Bindi Benifits : మహిళలు బొట్టు పెట్టుకుంటే చర్మం యవ్వనంగా ఉంటుందట.. నిపుణులు చెబుతున్నారు

భారతదేశంలో మహిళలు బొట్టు పెట్టుకుంటారు. కుంకుమ, బిందీలు ధరిస్తారు. బొట్టు పెట్టుకోవడం ఫ్యాషన్ కోసమని చాలామంది భావిస్తారు. నిజానికి బొట్టు పెట్టుకోవడం వెనుక అనేక శాస్త్రీయమైన కారణాలు ఉన్నాయి.

Bindi Benifits

Bindi Benifits: భారతదేశంలో మహిళలు ముఖానికి బొట్టుని ధరిస్తారు. కొందరు వివాహితులు కుంకుమను, పెళ్లికాని యువతులు రకరకాల బొట్టు బిళ్లలను అలంకరించుకుంటారు. ఇది కేవలం ఫ్యాషన్ కోసం అని కొందరు భావిస్తారు. దీని వెనుక సైన్స్ ఉంది. ఆ శాస్త్రీయ కారణాలు ఏంటో తెలుసుకుందాం.

Tambulam : తాంబూలం ఇస్తున్నారా? పద్ధతి పాటించకపోతే దోషం కలుగుతుందట

మహిళలు రకరకాల బిందీలను ఇష్టపడతారు. రంగురంగుల్లో వచ్చే బొట్టు బిళ్లలు వేసుకున్న డ్రెస్ కలర్‌కి తగ్గట్లుగా కూడా ధరిస్తారు. బొట్టు పెట్టుకునే ప్రాంతంలో ‘ఆజ్ఞా చక్రం’  ఉంటుంది. ఇది మానవ శరీరంలో 6 వ అత్యంత శక్తివంతమైన చక్రం. బొట్టు పెట్టుకునేటపుడు ఆ పాయింట్‌ని చాలాసార్లు నొక్కడం వల్ల ఆరోగ్యానికి సంబంధించి మాత్రమే కాకుండా  చర్మ ప్రయోజనాలు కూడా ఉన్నాయట.

 

బొట్టు పెట్టుకోవడం వెనుక ఉన్న శాస్త్రీయమైన అంశాలను డాక్టర్ దీక్షా భావ్‌సర్ సవలియా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసారు. యోగ ప్రకారం బొట్టు ధరించే ప్రాంతాన్ని’ఆజ్ఞా చక్రం’ అని పిలుస్తారు. అత్యంత శక్తివంతమైన ఈ చక్రం తల, కళ్లు, మెదడు, పీనియల్ మరియు పిట్యూటరీ గ్రంథికి రిలేట్ అయి ఉంటుంది. బొట్టు పెట్టుకునేటపుడు ఆ ప్రాంతంలో చేత్తో నొక్కుతారు. ఇలా చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. స్త్రీలకు మాత్రమే కాకుండా పురుషులు కూడా  ‘ఆజ్ఞా చక్రంపై’ కుంకుమ, లేదా తిలకం పెట్టుకుంటే ఎంతో మేలు చేస్తుందట.

పసుపు, కుంకుమ కిందపడితే అపశకునమా?

బొట్టు పెట్టుకోవడం వల్ల తలనొప్పి తగ్గుతుందట. సైనస్ సమస్యతో బాధపడేవారికి ఉపశమనం లభిస్తుందట. అలాగే కంటిచూపు మెరుగుపడటంతో పాటు కంటి ఆరోగ్యం బాగుంటుందట. డిప్రెషన్ నుంచి బయటపడటం, చర్మం యవ్వనంగా ఉండటం, జ్ఞాపకశక్తితో పాటు ఏకాగ్రత పెరగడం, వినికిడి శక్తి మెరుగుపడటం, ఒత్తిడి తగ్గడంతో పాటు మైగ్రేన్  తలనొప్పి తగ్గడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు