Hyderabad : బషీర్‌బాగ్..బేగంపేట్..అబిడ్స్.. ఈ ప్రాంతాలకు ఈ పేర్లు ఎలా వచ్చాయో తెలుసా?

హైదరాబాద్‌లో బేగంపేట, మలక్‌పేట, సికింద్రాబాద్, అబిడ్స్ వంటి అనేక ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు ఉన్నాయి. వాటికి ఆ పేర్లు పెట్టడం వెనుక కారణాలు తెలుసుకుందాం.

Hyderabad

Hyderabad : హైదరాబాద్‌లో మాసబ్ ట్యాంక్, మలక్ పేట్, సికింద్రాబాద్, నాంపల్లి ఇలా చాలా ప్రాంతాలు ఉన్నాయి. కొన్ని పేర్లు వింటే అసలు వాటికి ఆ పేరు ఎందుకు పెట్టారో తెలుసుకోవాలని అనిపిస్తుంది. అలా కొన్ని పేర్ల వెనుక దాగి ఉన్న కథ ఏంటో తెలుసుకుందాం?

శంషాబాద్ : షమ్స్-ఉల్-ఉమ్రా అనే పేరు కాస్త శంషాబాద్‌గా మారింది. ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించబడి చాలా పాపులర్ పేరుగా మారింది. షమ్స్ అంటే సూర్యుడు అని అర్ధం. దీనికి అర్ధం ప్రభువులలో సూర్యుడు లాంటి వాడని. ఈ బిరుదు నవాబ్ మొయిన్-ఉద్-దౌలా బహదూర్‌కి ఉండేదట.

Look Younger : యంగ్ గా కనిపించడం కోసం.. అలవాట్లు కూడా కీలకమే !

బహీర్‌బాగ్ : బషీర్‌బాగ్ అనే పదం నవాబ్ సర్ అస్మాన్ జహ్ బహదూర్ నిర్మించిన బషీర్ బాగ్ ప్యాలెస్ నుండి వచ్చింది. ఇది 1880 లో నిర్మించారు. ఈ ప్యాలెస్‌లో అందమైన తోట ఉండేదట.  అయితే ఆ ప్యాలెస్‌ను స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం కూల్చి వేసింది. పేరు మాత్రం స్థిరపడిపోయింది.

బేగంపేట్ : నిజాం కుమార్తె బషీరున్నీసా బేగంని పైగా నోబుల్‌కి ఇచ్చి పెళ్లిచేసినపుడు కట్నం కింద ఈ ప్రాంతంలో చాలా భూములు ఇచ్చారట. అందులోని గ్రామమే బేగం పేట. అలా ఆ ప్రాంతానికి పేరు వచ్చింది.

జీవనశైలి మార్పులతో శీతాకాలంలో కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చా?

సికింద్రాబాద్ : ఈ ప్రాంతానికి మూడవ నిజాం పేరు సికిందర్ ఝా అని 1806 లో పెట్టారట. ఇక్కడ బ్రిటీష్ సైన్యం ఉండేదట. ఈ ఏరియాని మొదట్లో లక్ష్సర్ అనేవారట. అంటే కంటోన్మెంట్.

మాసబ్ ట్యాంక్ : కులీ కుతుబ్ షా VI భార్య హయత్ బక్షి బేగంని మా సాహెబా అని పిలిచేవారట. మల్లేపల్లి గ్రామంలోని భూములకు సాగునీటి కోసం ఆమె ఓ ట్యాంకును నిర్మించిందట. అలా ఈ ప్రాంతాన్ని మా సాహెబా కా తలాబ్ అనేవారట మొదట్లో. అదే ఇప్పుడు మాసబ్ ట్యాంక్ అయ్యింది.

Bipolar Disorder : జీవనశైలి మార్పులతో హార్మోన్‌లలో అసమతుల్యత కారణంగా తలెత్తే మానసిక రుగ్మత నుండి బయటపడటం ఎలా ?

సుల్తాన్ బజార్ : ఇది  బ్రిటీష్ సైన్యం కోసం కట్టించారట. 1933 తర్వాత బ్రిటీష్ వారు ఈ ప్రాంతాన్ని తిరిగి నైజాంకు ఇచ్చినప్పుడు రెసిడెన్సీ బజార్‌ని కాస్త సుల్తాన్ బజార్‌గా పేరు మార్చారట.

నాంపల్లి : హైదరాబాద్ రాష్ట్రానికి దివాన్‌గా పనిచేసిన రజా అలీఖాన్ బిరుదు  ‘నేఖ్ నామ్ ఖాన్. అతనికి జాగీర్ మంజూరు చేసినపుడు దానికి నేఖ్-నాంపల్లి అని పిలిచేవారట. అది చివరికి నాంపల్లిగా మారింది.

Diet During Pregnancy : ప్రెగ్నెన్సీ సమయంలో పాటించాల్సిన ఆహారపు అలవాట్లు, జాగ్రత్తలపై నిపుణుల సూచనలు

సోమాజీగూడ : సోనాజీ అనే రెవెన్యూ డిపార్ట్ మెంట్ ఉద్యోగికికి ఈ ఏరియాలో చాలా భూములు ఉండేవట. అతని పేరు సోనాజీ కాస్త సోమాజీ అయ్యాడు. ఈ ఏరియా సోమాజీగూడ అయ్యిందట.

మలక్‌పేట : అబ్బులాహ్ కుతుబ్ షా గోల్కొండ రాజు సేవకుడు మాలిక్ యాకూబ్ పేరు అట. అక్కడ అతను నివసించిన మార్కెట్ ఉండటంతో మలక్‌పేట అని పేరు వచ్చింది.

Strange Rules For employee : ఈ ఉద్యోగం మద్యంపానం, ధూమపానం, మాంసాహారం అలవాటు లేనివారికి మాత్రమే

అబిడ్స్ : అబిడ్స్ లేదా అబిడ్ రోడ్‌కు హైదరాబాద్‌లోని మొదటి డిపార్ట్ మెంటల్ స్టోర్ యజమాని అర్మేనియాకు చెందిన యూదుడు ఆల్బర్ట్ అబిద్ ఎవాన్స్ పేరు పెట్టారు. అతను నిజాం VI కి వాలెట్‌గా పనిచేసాడట. అసలు పేరు అవిటిక్ సతూర్ హైరాపియెట్ . అతని భార్య నిజాం VII పిల్లలకు ట్యూటర్‌గా పనిచేసిందట. ఇవి హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాలకు చెందిన పేర్ల వెనుక కథ. ఇంకా అనేక ప్రాంతాలకు ఆ పేరు రావడం వెనుక చాలా చరిత్ర ఉంది.