Reconnect With Old Friends
Reconnect With Old Friends : సోషల్ మీడియాకు అతుక్కుపోతున్నారు.. సోషల్ మీడియాకు అడిక్ట్ అయ్యారు.. అని తిట్టుకుంటాము.. కానీ సోషల్ మీడియా అనేక విషయాల్లో మేలు చేసింది. సోషల్ మీడియా పుణ్యమా అని పాత స్నేహాలు మళ్లీ చిగురులు తొడుగుతున్నాయి. చిన్ననాటి స్నేహితులు మళ్లీ ఒక చోట చేరుతున్నారు. స్నేహితుల దినోత్సవం రోజు మీ చిన్ననాటి మిత్రులకి విష్ చేస్తున్నారన్నా.. వారిని కలవగలుగుతున్నారన్నాఅంతా సోషల్ మీడియా పుణ్యమే.
Blocking people : ఫ్రెండ్స్‌ని బ్లాక్ చేస్తున్నారా? చేసేముందు ఆలోచించండి
స్నేహితులకు సోషల్ మీడియా ఒక వరం అని చెప్పాలి. మనకి ఎంతో ఇష్టమైన వారు ఎంత దూరంలో ఉన్నా కనెక్ట్ చేయడంలో ఎన్నో యాప్‌లు సాయం చేస్తున్నాయి. కొన్ని పరిశోధనల ప్రకారం 65 అంతకంటే ఎక్కువ వయసు ఉన్న 40 శాతం మంది పెద్దవారు స్నేహితులు, ఫ్యామిలీ మెంబర్స్‌తో మాట్లాడటానికి సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారట. 2005 నుంచి ఈ శాతం పెరుగుతూ వస్తోంది. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ఎన్నో యాప్‌లు ఎంతోమందిని తిరిగి కలపడంలో అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఎప్పుడో కోల్పోయిన స్నేహితుల్ని గుర్తించడం, తిరిగి వారిని కలిసే అవకాశం కల్పించి ఎంతో ఆనందాన్ని పంచుతోంది.
చదువులు పూర్తి చేసుకుని ఎక్కడెక్కడో స్థిరపడ్డా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి. చదువుకున్న స్కూలు, అప్పటి స్నేహితులు, గురువులని చూడాలని అనిపిస్తుంది. ఒకప్పుడు వారిని కలవాలనే బలమైన కోరిక ఉన్నవారు అడ్రస్‌లు పట్టుకుని నానా తంటాలు పడేవారు. ఇప్పుడు ఆ సమస్య లేదు. చాలా ఈజీగా ఇంటర్నెట్‌లో బ్రౌజ్ చేసి తెలుసుకుంటున్నారు. అవతలివారు కూడా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో ఉంటే వారిని వెతికి పట్టుకోవడం చాలా సులభమైపోయింది. అలా ఒకరి నుంచి ఒకరు మొత్తం ఫ్రెండ్స్ అందరిని కలవడం.. వాట్సాప్ గ్రూపులలో జాయిన్ అవ్వడం.. గెట్ టుగెదర్లు పెట్టుకుని విడిపోయిన చిన్ననాటి బంధాలను మళ్లీ కలుపుకుంటున్నారు. ఇది ఎంతో సంతోషకరమైన పరిణామం.
International Friendship Day 2023 : స్నేహాన్ని సెలబ్రేట్ చేసుకోండి.. స్నేహితుల చెయ్యి వదిలిపెట్టకండి
సోషల్ మీడియా అతిగా వాడటం వల్ల ఎలాంటి దుష్ప్రరిణామాలు ఉన్నాయో.. అలాగే దానిని మంచికి వాడితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మనకి తెలియని ఎన్నో అంశాల గురించి తెలుసుకుంటూ మనకి ఎన్నో విధాలుగా సాయం చేస్తున్న సోషల్ మీడియా కొన్ని బంధాలను కూడా తిరిగి కలుపుతోంది. ఆనందాల్ని పంచుతోంది. అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియాకు థ్యాంక్స్ చెబుదాం. సోషల్ మీడియా వేదికగా కూడా స్నేహితుల దినోత్సవాన్ని సంబరంగా జరుపుకుందాం.