Brown Rice
Brown Rice : ఇటీవలి కాలంలో ప్రజల ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు వస్తున్నాయి. వైట్ రైస్ కు ప్రత్యామ్నాయంగా బ్రౌన్ రైస్ అన్నాన్ని తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉండటంతో బ్రౌన్ రైస్ అన్నం ప్రస్తుతం అందరినోట వినిపిస్తుంది. ఇందుకు కారణం లేకపోలేదు. బ్రౌన్ రైస్ లో అధికమొత్తంలో పోషకాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఇవి శరీరానికి అవసరమైన కేలరీలు, ఫైబర్లుతోపాటు, మెగ్నీషియం, పాస్పరస్, థయామిన్, నియాసిన్, విటమిన్ బి6వంటి వాటిని అందిస్తుంది.
భారతదేశంలో సుమారు 50శాతం మంది వరకు బోజనంగా అన్నాన్ని తింటారు. అన్నం ఏమాత్రం తెల్లగా లేకపోయినా ఇష్టపడరు. పాలిష్ చేస్తే వచ్చేవే తెల్లని బియ్యం. పాలిష్ వేయకుండా ఉండే ముడిబియ్యాన్నే బ్రౌన్ రైస్ అంటారు. పాలిష్ చేయటం వల్ల పై పొర తొలగిపోతుంది. అందులోనే ముఖ్యమైన , శరీరానికి మేలు చేసే పోషకాలు ఉంటాయి. శరీరానికి ఆరోగ్యానికి మేలు జరగాలంటే పాలిష్ వేయకుండా ఉండే ముడిబియ్యాన్నే ఆహారంగా తీసుకోవటం ఉత్తమం.
బ్రౌన్ రైస్ తినటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఇందులో ఉండే మెగ్నీషియం, కాల్షియం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. కప్పు బ్రౌన్ రైస్ లో 21శాతం మెగ్నీషియం ఉంటుంది. అధిక బరువును తగ్గించుకోవాలనుకునే వారు బ్రౌన్ రైస్ తినటం ఎంతో మంచిది. గుండె పోటు, షుగర్ వ్యాధి వంటి వాటికి కారణమయ్యే మెటబాలిక్ సిండ్రోమ్ ను బ్రౌన్ రైస్ నియంత్రిస్తుంది. ఇందులో గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువ. దీనివల్ల షుగర్ స్ధాయిలు తక్షణమే పెరగకుండా చూస్తుంది.
బ్రౌన్ రైస్ లో గామా అమైనో బ్యుటీరిక్ యాసిడ్ అనే అమైనో యాసిడ్లు ఉంటాయి. ఈ యాసిడ్లు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయని పలు పరిశోధనల్లో తేలింది. మతి మరుపు, అల్జీమర్స్ వంటి వ్యాధులను దూరం చేసేందుకు బ్రౌన్ రైస్ ఉపయోగకరం. ఇక ముఖ్యంగా బ్రౌన్ రైస్ లో ఉండే పాలిఫినాల్స్ యాంటీ ఆక్సిడెంట్ గుణాలు శరీరంలోని కణాలు దెబ్బతినకుండా కాపాడుతాయి. పలు క్యాన్సర్లను రాకుండా చూస్తాయి.