Deep Sleep : గాఢమైన నిద్రకు ఉపకరించే సుగంధ ద్రవ్యాలు ఇవే !

భారతీయల వంటగదిలో విస్తృతంగా లభించే సుగంధ ద్రవ్యాలలో ఇది ఒకటి. ఇది జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది.యాసిడ్ రిఫ్లక్స్‌ను నివారిస్తుంది. జీలకర్ర నిద్రను ప్రేరేపిస్తుంది,

Deep Sleep : శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని కాపాడటంలో నిద్ర ఎంతగానో దోహదపడుతుంది. ఎక్కువ నిద్ర, తక్కువ నిద్ర రెండూ ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ మనం కొత్త ఒత్తిళ్ళను ఎదుర్కొవాల్సి వస్తుంది. అది మన శక్తిపై ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా మన శారీరక ,మానసిక ఆరోగ్యం పై ఈ ప్రభావం ఉంటుంది. ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాగైనా ఎనిమిది గంటలు నిద్ర పోవాలని అధ్యయనకారులు చెబుతున్నారు.

నిద్రలేమితో రక్తంలో గ్లూకోస్ స్థాయిని నియంత్రించే సామర్థ్యం కూడా దెబ్బతింటుందని, నిద్రలేమి రోగనిరోధక వ్యవస్థను దెబ్బతింటుంది. ఇన్ఫెక్షన్లు సోకే అవకాశముటుంది. తగినంత నిద్ర పొందడం వల్ల మన ఎనర్జీకూడా పెరుగుతుంది. ద్రలేమి ప్రభావం మెదడు పనితీరుపై కూడా ఉంటుంది. తగినంత నిద్ర లేకపోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు, ఊబకాయం, డిప్రెషన్ వంటి అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. సరైన రోజువారి పనితీరు కోసం ఒక వ్యక్తికి సగటున ఏడు నుండి ఎనిమిది గంటల నిద్ర అవసరమని నిపుణులు చెబుతున్నారు.

భారతీయ ఆయుర్వేదం ప్రకారం కొన్ని సుగంధ ద్రవ్యాలు ఒత్తిడి మరియు ఆందోళన లక్షణాలతో పోరాడటానికి సహాయపడతాయి. అంతేకాకుండా మంచి నిద్రను పట్టేలా చేసి నిద్రలేమి సమస్యలను తొలగిపోయేలా చేస్తాయి. అలాంటి సుగంధ ద్రవ్యాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

READ ALSO : Boost Your Immunity : ఉదయం నిద్రలేచిన వెంటనే వీటిని తీసుకుంటే రోగనిరోధకశక్తి పెరుగుతుంది తెలుసా?

1. జీరా ; భారతీయల వంటగదిలో విస్తృతంగా లభించే సుగంధ ద్రవ్యాలలో ఇది ఒకటి. ఇది జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది.యాసిడ్ రిఫ్లక్స్‌ను నివారిస్తుంది. జీలకర్ర నిద్రను ప్రేరేపిస్తుంది. మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. ఈ లక్షణాలు ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గించడంలో సహాయపడతాయి.

2. పుదీనా ఆకులు ; పుదీనాలో ఒత్తిడి మరియు ఆందోళన నుండి ఉపశమనం కలిగించే లక్షణాలు ఉన్నాయి. పుదీనాలో ఉండే మెంథాల్ కండరాలను సడలించే యాంటిస్పాస్మోడిక్ స్వభావం కలిగి ఉంటుంది. ఇది మీ కండరాలను విశ్రాంతి తీసుకోవడానికి, ప్రశాంతంగా నిద్రపోవడానికి తోడ్పడుతుంది. పడుకునే ముందు ఒక కప్పు పుదీనా టీ తాగటం వల్ల గాధమైన నిద్ర వస్తుంది.

3. జాజికాయ ; జాజికాయ నిద్రను ప్రేరేపించే లక్షణాలను కలిగి ఉన్న మరొక ముఖ్యమైన మసాలా. దీని లక్షణాలు మన నరాలను శాంతపరచి ఒత్తిడిని దూరం చేస్తాయి. ఇది సమర్థవంతంగా నిద్ర పట్టేలా చేయటం, నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. నిద్రపోయే వేడిపాలలో చిటికెడు జాజికాయ పొడిని వేసుకుని తాగితే నిద్రబాగా పడుతుంది.

4. అశ్వగంధ ; అశ్వగంధ అనేది ఒత్తిడిని తగ్గించడానికి మరియు ఆందోళన వంటి మానసిక ఆరోగ్య సమస్యలను నయం చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది అడాప్టోజెనిక్ హెర్బ్, ఇది మన శరీరం ఒత్తిడి లక్షణాలతో పోరాడటానికి సహాయపడుతుంది. ఇది ఒత్తిడి మరియు ఆందోళన లక్షణాలను తగ్గించటంలో సహాయపడుతుంది. ఇది నిద్రను ప్రేరేపించడంలో ప్రధాన పాత్రపోషిస్తుంది.

5. ఫెన్నెల్ విత్తనాలు ; ఫెన్నెల్స్ విత్తనాలు వీటిని సాన్ఫ్ అని పిలుస్తారు, ఇవి మనస్సుకు ప్రశాంతతను చేకూర్చే లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది మన కండరాలను సడలించడంలో సహాయపడుతుంది. నిద్రలేమి, ఒత్తిడి లేదా ఆందోళన వంటి సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులపై ఇటువంటి లక్షణాలు సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయి.

ట్రెండింగ్ వార్తలు