vegetables
Winter Vegetables : శీతాకాలంలో ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలంటే యాంటీఆక్సిడెంట్లు, రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలతో కూడిన కూరగాయలను తీసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే చలి కాలంలో అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతాయి. దగ్గు, జలుబు, జ్వరం వంటివి తరచుగా వస్తుంటాయి. ఇలాంటివి రాకుండా ఉండాలంటే చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవటం చాలా అవసరం. ఈ కాలంలో వివిధ రకాల కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల వ్యాధులు దరిచేరకుండా కాపాడుకోవచ్చు. చలికాలంలో తీసుకోవాల్సిన కూరగాయాల్లో కొన్నింటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
READ ALSO : Winter Skin Care : చలికాలంలో చర్మ సంరక్షణ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటే ?
చలికాలంలో తీసుకోవాల్సిన కూరగాయలు ;
బచ్చలి కూర
బచ్చలికూర చలికాలంలో అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఆకు కూర. ఇందులో విటమిన్లు ఎ, బి, సి, ఇ, కె, జింక్, మెగ్నీషియం మరియు పెద్ద మొత్తంలో ఐరన్ ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం, ఎముకలు, కంటిచూపు కోల్పోకుండా నిరోధించడం, హిమోగ్లోబిన్‌ను మెరుగుపరచడం, శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. శీతాకాలంలో అద్భుతమైన ఆకుకూరల్లో ఇది ఒకటిగా చేప్పవచ్చు.
క్యారెట్లు
శీతాకాలపు ఆరోగ్యకరమైన ఆహారాలలో ఒకటిగా క్యారెట్ ను చెప్పవచ్చు. దీనిలో విటమిన్లు A, B, B2, B3, C, K మరియు బీటా కెరోటిన్ ఉన్నాయి. అంతేకాకుండా, క్యారెట్ క్యాన్సర్, మధుమేహం, గుండె జబ్బులతో బాధపడుతున్న వారు త్వరగా కోలుకోవడంలో సహాయపడుతుంది. క్యారెట్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నందున, అవి శీతాకాలానికి సరైన ఆహారంగా చెప్పవచ్చు. అంతేకాకుండా చర్మానికి కూడా మేలు చేస్తాయి.
READ ALSO : Seasonal Depression : చలికాలంలో ఎదురయ్యే మానసిక సమస్యలు !
బీట్‌రూట్
చలికాలంలో బీట్ రూట్ ను తరచుగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇందులో ఐరన్, విటమిన్లు A, B6 మరియు C ఉంటాయి. బీట్‌రూట్‌లు శీతాకాలంలో తినడానికి ఉత్తమమైన కూరగాయలలో ఒకటిగా చెప్పవచ్చు. ఎందుకంటే బీట్ రూట్ కాలేయాన్ని శుద్ధి చేయడంలో సహాయపడతాయి, మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఊబకాయాన్ని ఎదుర్కోవడంలో సహాయం చేస్తుంది.
వైట్ ముల్లంగి
శీతాకాలం తీనాల్సిన కూరగాయలలో ప్రసిద్ధ గాంచింది తెల్ల ముల్లంగి. దీనిలో పొటాషియం, సోడియం, విటమిన్ సి మరియు మెగ్నీషియం ఉంటాయి. అంతేకాకుండా, ఇది తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది, అదే క్రమంలో అధిక నీటి కంటెంట్ కలిగి ఉంటుంది. శీతాకాలంలో హైడ్రేట్‌గా ఉండటానికి సహాయపడుతుంది. దీనిలోని పోషకాలు శరీరం ఫ్లూ వంటి వ్యాధులతో పోరాడటానికి సహాయపడతాయి. కాబట్టి చలికాలంలో ఆహారంలో చేర్చుకోవాల్సిన అద్భుతమైన శీతాకాలపు కూరగాయగా ముల్లంగిని చెప్పవచ్చు.
READ ALSO : Cracked Feet : చలికాలంలో పాదాల పగుళ్ల సమస్యతో బాధపడుతుంటే ఈ చిట్కాలు పాటించి చూడండి!
బ్రోకలీ
శీతాకాలంలో తినడానికి ఉత్తమమైన కూరగాయల జాబితా బ్రోకలీకి ప్రముఖస్ధానం ఉంది. బ్రోకలీ ఆరోగ్యకరమైన ఆకుపచ్చ కూరగాయలలో ఒకటి. ఎందుకంటే ఇందులో కాల్షియం, జింక్, సెలీనియం, ఫోలేట్, విటమిన్లు B6, B12, C మరియు K పుష్కలంగా ఉన్నాయి. అంతేకాకుండా, అధిక ఫైబర్ కంటెంట్‌తో, బ్రోకలీ ప్రేగు కదలికలను సులభతరం చేయడంలో సహాయపడుతుంది. చలికాలంలో దీన్ని తినడం ఉత్తమం ఎందుకంటే ఇందులో ఉండే సూక్ష్మపోషకాలు ఈ సీజన్‌లో వృద్ధి చెందే బ్యాక్టీరియా , వైరస్‌లతో పోరాడటానికి సహాయపడుతుంది.