Cracked Feet : చలికాలంలో పాదాల పగుళ్ల సమస్యతో బాధపడుతుంటే ఈ చిట్కాలు పాటించి చూడండి!

అల్లం చర్మంపై ఇన్ఫెక్షన్ కలిగించే శిలీంధ్రాలు, బ్యాక్టీరియాను చంపడానికి సహాయపడుతుంది. నిమ్మకాయలోని ఆమ్లత్వం పాదాల్లోని మృత కణాలను తొలగించి వాటిని ప్రకాశవంతంగా మార్చేందుకు సహాయపడుతుంది.

Cracked Feet : చలికాలంలో పాదాల పగుళ్ల సమస్యతో బాధపడుతుంటే ఈ చిట్కాలు పాటించి చూడండి!

Cracked Feet :

Cracked Feet : చలికాలంలో పాదాల పగుళ్ల సమస్య చాలా మందిని వేధిస్తుంది. పొడి గాలి, తేమ సరిగా లేకపోవడం, పాదాలకు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల పాదాల పగుళ్లు ఏర్పడతాయి. ఆహార లోపాలు, పెరుగుతున్న వయసుతోపాటు ఎక్కువ సేపు గట్టి నేల మీద నిలబడి ఉండాల్సి రావడం కూడా మడమల పగుళ్లకు దారి తీస్తుంటాయి. డయాబెటిస్‌తోపాటు థైరాయిడ్ సమస్యలు కూడా పాదాల పగుళ్లను కలిగిస్తాయి. కొద్దిపాటి జాగ్రత్తతో పగిలిన పాదాలను ఇంట్లోనే మృదువుగా మార్చుకోవచ్చు. కొన్ని రకాల గృహ చిట్కాలతోనే పాదాల పగుళ్లను నివారించుకోవచ్చు. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

పాదాల పగుళ్ల నివారణ చిట్కాలు ;

వెజిటబుల్ ఆయిల్స్: వెజిటబుల్ ఆయిల్స్‌ను పాదాల పగుళ్లకు చికిత్స కోసం వాడొచ్చు. ఆలివ్ ఆయిల్, నువ్వుల నూనె, కొబ్బరి నూనెల్ని ఇందుకోసం వాడొచ్చు. రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు సబ్బు నీటితో పాదాలను శుభ్రపరుచుకోవాలి. మృత చర్మం తొలగిపోయేలా రుద్దుకోవాలి. తర్వాత పొడి వస్త్రంతో తుడిచి పాదాలకు వెజిటబుల్ ఆయిల్స్‌ను రాయాలి. సాక్సులు ధరించి నిద్రించాలి. ఉదయాన్నే పాదాలు మృదువుగా ఉండటాన్ని గమనించొచ్చు. కొద్ది రోజులపాటు ఇలా చేయడం వల్ల పగుళ్లు తొలగిపోతాయి.

బియ్యం పిండి ; బియ్యం పిండితోనూ పాదాల పగుళ్లను తగ్గించొచ్చు. పిడికెడు బియ్యం పిండి, కొన్ని చెంచాల తేనె, ఆపిల్ సీడర్ వెనిగర్ తీసుకోవాలి. ఇది మందమైన పేస్టులా అయ్యేలా మరిగించాలి. పగుళ్లు మరీ ఎక్కువగా ఉంటే.. టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ లేదా స్వీట్ ఆల్మండ్ ఆయిల్ జత చేయొచ్చు. పాదాల్ని పది నిమిషాలపాటు వెచ్చటి నీటిలో ఉంచి బియ్యం పిండి పేస్టుతో మృదువుగా రుద్దాలి. పాదాల పగుళ్లు పూర్తిగా తగ్గేవరకూ ఇలాగే చేయాలి.

పాదాల ఇన్ఫెక్షన్లు తొలగించే వేపాకులు ; వేపాకులతోనూ తేలిగ్గా పాదాల పగుళ్లను దూరం చేయొచ్చు. పాదాలు దురద పెడుతూ, ఇన్ఫెక్షన్ ఇబ్బంది పెడుతున్నప్పుడు వేపాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. వేపాకు ఫంగల్ ఇన్ఫెక్షన్ల నివారిస్తుంది. గుప్పెడు వేపాకులు తీసుకొని పేస్టులా చేసుకోవాలి. దీనికి మూడు టీ స్పూన్ల పసుపు జత చేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పగుళ్లపై రాసి ఓ గంటపాటు ఉంచాలి. తర్వాత వెచ్చటి నీటితో కడిగి శుభ్రమైన వస్త్రంతో క్లీన్ చేసుకోవాలి.

నిమ్మరసం ; చర్మం రఫ్‌గా మారడం పగుళ్లకు దారి తీస్తుంది. నిమ్మలోని ఆమ్ల గుణాలు రఫ్‌గా మారిన చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. వెచ్చటి నీటిలో నిమ్మరసం కలిపి పాదాలను పావు గంటపాటు అందులో ఉంచాలి. తర్వాత మడమల్ని రుద్దాలి. తరువాత కడుక్కోవాలి. పొడిగా ఉండే వస్త్రంతో తుడవాలి.

పసుపుతో : పాదాల పగుళ్లు వచ్చిన వారు రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో చెంచా ఉప్పు, చిటికెడు పసుపు వేసి ఆ నీటిలో పాదాలను పది నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత పొడి వస్త్రంతో శుభ్రంగా తుడిచి పెట్రోలియం జెల్లీని రాసుకుంటే పగుళ్ల సమస్యను త్వరితగతిన నివారించవచ్చు.

యాపిల్ వెనిగర్ తో మేలు : పాదల పగుళ్లకు యాపిల్ వెనిగర్ మేలు చేస్తుంది. దీనికి నిమ్మరసం కలిపి అప్లే చేస్తే మెరుగైన ఫలితాలు పొందవచ్చు. యాపిల్ వెనిగర్ తో పాటు నిమ్మరసంలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ, అసిటిక్ కాంపోనెంట్ లు ఉంటాయి. ఇవి డ్రై సెల్స్ ను ఎక్స్ ఫోలియేట్ చేసి కొత్త కణాలను ఉత్తేజపరిచి చర్మాన్ని పునరుజ్జీవింపజేస్తాయి.

అల్లం, నిమ్మ నూనె ఫుట్ క్రీమ్ ; అల్లం చర్మంపై ఇన్ఫెక్షన్ కలిగించే శిలీంధ్రాలు, బ్యాక్టీరియాను చంపడానికి సహాయపడుతుంది. నిమ్మకాయలోని ఆమ్లత్వం పాదాల్లోని మృత కణాలను తొలగించి వాటిని ప్రకాశవంతంగా మార్చేందుకు సహాయపడుతుంది. బీస్వాక్స్, కోకో బటర్, కొబ్బరి నూనె, బాదం నూనె వేసి కరిగించి అల్లం ఎసెన్షియల్ ఆయిల్, లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. నిద్రపోయే ముందు ఈ మిశ్రమంతో మీ పాదాలను మసాజ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

రోజ్ వాటర్, గ్లిజరిన్‌ మిశ్రమంతో ; గ్లిజరిన్, రోజ్ వాటర్ మిశ్రమంతోనూ మడమల పగుళ్లను నివారించవచ్చు. ఈ రెండింటిని సమపాళ్లలో కలిపి రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు మడమలు, పాదాలకు రాయాలి. రోజూ ఇలా చేయడం వల్ల పగుళ్లు తొలగిపోతాయి.

పాలు, తేనె ఫుట్ క్రీమ్ ; పాలు, తేనె ఫుట్ క్రీమ్ పగిలిన చర్మాన్ని నయం చేస్తుంది. పాదాల ఆకృతిని పునరుద్ధరిస్తుంది. ఒక గిన్నెలో వెచ్చని చల్లని పాలు, తేనె, నిమ్మరసం, బాదం నూనె వేసి బాగా కలపండి. దానిని చల్లారనిచ్చి దానిలో వెనీలా ఎసెన్స్ వేసి మళ్లీ కలుపుకోవాలి. ప్రతిరోజూ పడుకునే ముందు దీనితో మీ పాదాలను మసాజ్ చేస్తే పాదాల పగుళ్లు తొలగిపోతాయి.