Seasonal Depression : చలికాలంలో ఎదురయ్యే మానసిక సమస్యలు !

చలికాలంలో ఎదురయ్యే మానసిక రుగ్మతలలో ప్రధానంగా మూడ్ మారిపోవటం, అనవసర ఆందోళన, నిస్పృహకు లోనవటం, చిరాకు, బద్ధకం, అతి నిద్ర, అలసట ,రోజువారీ కార్యకలాపాలపై ఆసక్తి కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

Seasonal Depression : చలికాలంలో ఎదురయ్యే మానసిక సమస్యలు !

Seasonal Depression

Seasonal Depression : వాతావరణ మార్పులు చాలా మందిలో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. అంతేకాకుండా ఆనందాన్ని అందిస్తాయి. అయితే ఇలాంటి మార్పులు కొందరిలో మానసిక సమస్యలను కలిగిస్తాయి. అందుకే కొంత మంది వాతావరణంలో మార్పును ఏమాత్రం ఇష్టపడరు. ఈ పరిస్ధితినే మూడ్ స్వింగ్స్’ అని పిలుస్తారు. దీనినే సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ గా నిపుణులు అభివర్ణిస్తున్నారు.

READ ALSO : చలికాలంలో పాదాల పగుళ్ల సమస్యతో బాధపడుతుంటే ఈ చిట్కాలు పాటించి చూడండి!

సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ కు అసలు కారణాలు ;

శరీరంలో సెరోటోనిన్ లోపం ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. వాతావరణం మారుతున్న సమయంలో సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్‌కు ప్రధాన కారణం సూర్యరశ్మి తగ్గడం వల్ల శరీరంలో సెరోటోనిన్ స్థాయిలు తగ్గుతాయి. సెరోటోనిన్ మన మానసిక స్థితి, ఆకలి, నిద్రను ప్రభావితం చేసే ముఖ్యమైన హార్మోన్.

అలాగే మెలటోనిన్ అనేది కూడా ఈ పరిస్ధితికి కారణమవుతుంది. మెలటోనిన్ అనేది నిద్రకు, నిరాశకు అతిపెద్ద కారణంగా చెప్పవచ్చు. ఇది వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్న సమయంలో పెరుగుతుంది. ఈ పరిస్థితిలో ఒంటరితనానికి లోనై అకస్మాత్తుగా నిరాశకు గురవుతారు.

READ ALSO : చలికాలంలో రాత్రి పూట అరటిపండు తినొచ్చా?

విటమిన్-డి లోపం కూడా చలికాలంలో తీవ్ర నిరాశకు కారణంగా చెప్పవచ్చు. విటమిన్ డి కోసం తప్పనిసరిగా బయటికి వెళ్ళటం, సూర్యరశ్మి తగిలేలా చూసుకోవటం, గదిలో తగినంత లైటింగ్ ఏర్పాట్లు చేసుకోవటం వంటి చేయాలి. పగలు మరియు రాత్రి మధ్య జరిగే వాతావరణ మార్పులను సమతుల్యం చేసుకోవటం అన్నది చాలా ముఖ్యం. ఈ పరిస్ధితుల్లో దినచర్యలో కొన్ని మార్పులు చేసుకోవాలి.

READ ALSO : చలికాలంలో శరీర వెచ్చదనం కోసం తీసుకోవాల్సిన ఆహారపదార్ధాలు ఇవే?

చలికాలంలో ఎదురయ్యే మానసిక రుగ్మతలలో ప్రధానంగా మూడ్ మారిపోవటం, అనవసర ఆందోళన, నిస్పృహకు లోనవటం, చిరాకు, బద్ధకం, అతి నిద్ర, అలసట ,రోజువారీ కార్యకలాపాలపై ఆసక్తి కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీని నుండి బయటపడేందుకు రోజువారి పనులను పక్కన పెట్టి కుటుంబ సభ్యులు, స్నేహితులతో విహారయాత్రకు వెళ్ళి సరదాగా గడపటం, మారుతున్న వాతావరణ మార్పులకు అనుగుణంగా రోజువారి దినచర్యను ప్లాన్ చేసుకోవటం, రోజవారి వ్యాయామాలు, యోగా వంటి వాటిని అనుసరించటం ద్వారా చలికాలంలో ఎదురయ్యే మానసిక సమస్యల నుండి బయటపడవచ్చు.