Winter Skin Care : చలికాలంలో చర్మ సంరక్షణ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటే ?

చలిలో బయటకు వెళ్ళే సమయంలో వెచ్చదనాన్ని ఇచ్చే దుస్తులు ధరించాలి. ఈ సందర్భంలో స్కార్ఫ్, జర్కిన్, తలకు హెల్మెట్, కాళ్లకు షూ, చేతులకు గ్లౌజులు ధరించాలి. ఇలా చేయటం వల్ల వాహనాలపై వెళ్ళే సందర్భంలో చలిగాలి చర్మానికి తగలకుండా చూసుకోవచ్చు.

Winter Skin Care : చలికాలంలో చర్మ సంరక్షణ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటే ?

Facial moisturizer

Winter Skin Care : శీతాకాలంలో చర్మ ఆరోగ్యం పట్ల ప్రతిఒక్కరు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మన శరీరంలో చర్మం అన్నది ఇతర అవయవాలకు రక్షణగా పనిచేస్తుంది. శీతాకాలపు వాతావరణ ప్రభావం చర్మంపై ఎక్కువగా పడుతుంది. దీని నుండి చర్మాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ కాలంలో చర్మం పగుళ్లు , పొడిబారటం, దురదలు వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలను పాటించటం మంచిది.

READ ALSO : Integrated Farming : పండ్లు, శ్రీగంధం, చేపల పెంపకంతో సమీకృత వ్యవసాయం

శీతాకాలంలో వేడి నీటితో స్నానం సౌకర్య వంతంగా అనిపిస్తుంది. అయితే అదే పనిగా ఎక్కువ సమయం వేడి నీటిలో గడిపితే చర్మంలోని సహజ నూనెలు త్వరగా తొలగిపోతాయి. చర్మంపై సహజతేమ తగ్గిపోయి పొడిబారిపోతుంది. చర్మం పొడిబారకుండా ఉండటంకోసం హైడ్రేటింగ్ టోనర్‌ లను ఉపయోగించవచ్చు. చలికాలంలో చర్మానికి మాయిశ్చరైజింగ్‌ను అప్లై చేయటం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. మాయిశ్చరైజింగ్ మీ చర్మంపై తేమని అందించటంలో సహాయపడుతుంది. చలికాలంలో వాతావరణం పొడిగా ఉన్నప్పుడు, జిడ్డుగల చర్మం ఉన్నవారు, సహజమైన మాయిశ్చరైజర్ ను ఉపయోగించటం మంచిది.

READ ALSO : Hair Health : వర్షకాలంలో జుట్టు ఆరోగ్యం కోసం పెరుగుతో ఇలా చేసి చూడండి !

శీతాకాలంలో చల్లని వాతావరణం నుండి చర్మాన్ని కాపాడుకోవటం కోసం ఎక్కువ నీటిని సేవించాలి. చలికాలంలో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవటానికి ఆహారంలో కొన్ని పండ్లు, పండ్ల రసాలు వంటి వాటిని చేర్చుకోవటం మంచిది. చర్మాన్ని హైడ్రేట్ ఉంచటంతోపాటుగా పోషకాలను అందించే ఫేస్ మాస్క్‌ను ఉపయోగించడం ముఖ్యం. జిడ్డుగల చర్మం కోసం సహజమైన మాయిశ్చరైజర్‌లను ఉపయోగించాలి. లోషన్లు, మాయిశ్చరైజర్లు రాసుకోవడం వల్ల చర్మం మృధువుగా ఉంటుంది. కొబ్బరి నూనెను స్నానం చేసిన వెంటనే చర్మానికి రాసుకోవాలి.

READ ALSO : Pink Bollworms : పత్తిలో గులాబి పురుగుల ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

చలిలో బయటకు వెళ్ళే సమయంలో వెచ్చదనాన్ని ఇచ్చే దుస్తులు ధరించాలి. ఈ సందర్భంలో స్కార్ఫ్, జర్కిన్, తలకు హెల్మెట్, కాళ్లకు షూ, చేతులకు గ్లౌజులు ధరించాలి. ఇలా చేయటం వల్ల వాహనాలపై వెళ్ళే సందర్భంలో చలిగాలి చర్మానికి తగలకుండా చూసుకోవచ్చు. వారానికి ఒకసారైనా ఆలివ్ ఆయిల్,కొబ్బరి నూనెతో మసాజ్ చేసు కోవటం మంచిది. కొంతమందిలో సోరియాసిస్ వంటి చర్మ సమస్యలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంటుంది. అదే సమయంలో రెటినోల్‌తో మాయిశ్చరైజర్‌లను వాడకపోవటమే మంచిది. వాటికి బదులుగా హైలురోనిక్ యాసిడ్, ప్రొపైలిన్ గ్లైకాల్, పెట్రోలియం జెల్లీ, స్టెరిక్ యాసిడ్ మరియు గ్లిజరిన్ ఉన్న మాయిశ్చరైజర్‌లను ఉపయోగించాలి.