Pink Bollworms : పత్తిలో గులాబి పురుగుల ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

ఈ ఏడాది పత్తి వేసిన రైతులకు ప్రస్తుత ప్రతికూల పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. భారీ వర్షాలకు చాలా చోట్ల పంట నష్టం జరిగింది. ఇందులో అత్యధికంగా పత్తి వేసిన రైతులు ఎక్కువ మంది దెబ్బతిన్నారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగుపడుతున్నాయి.

Pink Bollworms : పత్తిలో గులాబి పురుగుల ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

Cotton Cultivation

Pink Bollworms : ప్రస్తుతం తెగులు రాష్ట్రాల్లో పత్తి పైరు వివిధ దశల్లో ఉంది. చాలా ప్రాంతాల్లో పూత నుండి కాయ ఏర్పడే దశలో ఉంది. ముందుగా వేసిన ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే పత్తి కాయ పగిలేందుకు సిద్ధంగా ఉంది. అయితే ఈ సమయంలో గులాబిరంగు పురుగులు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వీటి నివారణకు ఎలాంటి సమగ్రసస్యరక్షణ చర్యలు చేపట్టాలో తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా , బెల్లం పల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు.

READ ALSO : Organic Farming : సేంద్రీయ వ్యవసాయంలో నత్రజని పోషక లోప నివారణకు చేపట్టాల్సిన చర్యలు

ఈ ఏడాది పత్తి వేసిన రైతులకు ప్రస్తుత ప్రతికూల పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. భారీ వర్షాలకు చాలా చోట్ల పంట నష్టం జరిగింది. ఇందులో అత్యధికంగా పత్తి వేసిన రైతులు ఎక్కువ మంది దెబ్బతిన్నారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. చాలాచోట్ల  పూత దశ నుండి కాయగా ఏర్పడే స్థితిలో పంట ఉంది.

READ ALSO : Organic Vegetable Farming : వ్యవసాయం చేస్తూ.. రైతుబజార్లో.. కూరగాయలు అమ్ముతున్న యువజంట

ఈ సమయంలో పత్తిపంటలో గులాబిరంగు పురుగు సమస్య ఏర్పడింది. ఈ పురుగును సకాలంలో నివారించకపోతే తీవ్రనష్టం వాటిల్లే ప్రమాదం ఉందని .. నివారణ మార్గాలు తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా , బెల్లం పల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు.