Organic Farming : సేంద్రీయ వ్యవసాయంలో నత్రజని పోషక లోప నివారణకు చేపట్టాల్సిన చర్యలు

మొక్కలకు అవసరమైన ప్రధాన పోషకాలలో నతజని అత్యంత ముఖ్యమైనది. నత్రజని సమృద్ధిగా ఉన్న నేలలో మొక్కలు ధృడంగా మరియు పచ్చగా పెరుగుతాయి. మొక్కలో ప్రోటీన్ల ఉత్పత్తికి ఇది అత్యంత అవసరం.

Organic Farming : సేంద్రీయ వ్యవసాయంలో నత్రజని పోషక లోప నివారణకు చేపట్టాల్సిన చర్యలు

nitrogen deficiency

Organic Farming : సేంద్రీయ వ్యవసాయంలో సమృద్ధిగా సేంద్రియ వదార్థాలను తద్వారా మొక్కలకు అవనరమైన పోషకాలను అందించడం ముఖ్యమైనది. సేంద్రియ పదార్ధం కుళ్ళిపోయే ప్రక్రియలో అనేక ఉపయోగకరమైన పదార్థాలను ఉత్పత్తి చేయడమే కాకుండా నేలయొక్క భౌతిక రనాయన లక్షణాలను మెరుగు పరున్తుంది. సేంద్రియ వ్యవసాయంలో నేలలో ఉండే సూక్ష్మజీవులను నిరంతరంగా పోషించడానికి కంపోస్ట్, జంతు సంబంద లేదా పచ్చిరొట్ట ఎరువులను తప్పనిసరిగా ఉపయోగించాలి.

READ ALSO : Turmeric Cultivation : సేంద్రీయ పసుపు సాగులో ఎరువులు, నీటి యాజమాన్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

సేంద్రియ పదార్ధం ముడి రూపంలో అనేక పోషకాలను కలిగి ఉంటుంది. కుళ్ళిపోయే ప్రక్రియలో ఇది నత్రజని, భాస్వరము, గంధకము, జింక్‌ మరియు కాపర్‌ వంటి పోషకాలను మొక్కలకు అందుబాటులో ఉండే రూపంలో విడుదల చేన్తుంది. నేలలో మొక్కల పోషకాలను సమతుల్యం చేయడానికి సేంద్రియ పదార్థాలతో పాటు రాతి పొడులను ఉపయోగించవచ్చు. ఇవి దీర్ఘకాలికంగా పోషకాలను అందజేయగలవు.

పెద్ద మొత్తంలో అవసరం అయ్యే 9 ప్రధాన పోవకాలలో మూడింటిని ప్రథమ పోషకాలు అంటారు. అవి నత్రజని, భాస్వరం మరియు పొటాష్‌ మరో మూడింటిని ద్వితీయ పోషకాలు అంటారు అవి కాల్షియం, మెగ్నీషియం మరియు సల్ఫర్‌. మిగిలిన మూడు కర్బనము, హైడ్రోజన్‌ మరియు అక్సిజన్‌ మొక్కలకు సహజంగా వాతావరణం నుంచి లభిస్తాయి.

READ ALSO : Organic Food : సేంద్రియ ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్.. సేంద్రీయ ఉత్పత్తులతో హోటల్ నిర్వహిస్తున్న రైతులు

నత్రజని పోషక లోపం, నివారణ ;

మొక్కలకు అవసరమైన ప్రధాన పోషకాలలో నతజని అత్యంత ముఖ్యమైనది. నత్రజని సమృద్ధిగా ఉన్న నేలలో మొక్కలు ధృడంగా మరియు పచ్చగా పెరుగుతాయి. మొక్కలో ప్రోటీన్ల ఉత్పత్తికి ఇది అత్యంత అవసరం. వార్షిక పంటలకు ప్రారంభ పంట కాలంలో భారీ మొత్తంలో నత్రజని అవసరం. ఇది విత్తనాలతో తయారయ్యే సీడ్‌ కేక్‌, సీడ్‌ మీల్స్‌ చేపల వ్యర్దాలు, పశువుల ఎరువులు మరియు వ్యక్ధాలలో అధికంగా ఉంటుంది.

సేంద్రియ వ్యవసాయం చేసే రైతులు సాధారణంగా చివికిన పశువుల ఎరువు, పంట అవశేషాలతో తయారు చేసిన కంపోస్ట్‌, వర్మి కంపోస్ట్‌ లేదా పప్పుధాన్య పంటలలో పంట మార్చిడి, పచ్చిరొట్ట ఎరువులు వంటివి నత్రజని సరఫరా చేయడానికి వాడతారు. ఎరువు, వంటగది వ్యర్థాలు, పంట వ్యర్థాలు, జంతువుల వ్యర్థాలతో సమృద్ధిగా ఉండే కంపోస్ట్‌ నృతజని యొక్క దీర్హకాలిక మూలం. ఇలా సమృద్ధి చేయబడిన కంపోస్ట్‌ పూర్తిగా తయారయి పూర్తి నత్రజనిని మొక్కలకు సరఫరా చేసేంత వరిపక్వత కలిగి ఉండాలి. లేనిచో నత్రజనిని కొద్ది మొత్తంలో నెమ్మదిగా విడుదల చేయడం వలన పూర్తిస్థాయిలో వినియోగం కాదు.

READ ALSO : Onion Cultivation : ఉల్లిసాగులో సేంద్రీయ విధానంలో చీడపీడల నివారణ, సస్యరక్షణ చర్యలు!

నత్రజని లోప లక్షణాలు :

అకులు వాటి యొక్క సహజంగా మెరిసే ఆరోగ్యకరమైన అకుపచ్చ రంగు కోల్పోతాయి. తరువాత ముదురు అకులు పసుపు రంగులో పాలిపోయి క్రమేణా మొక్కలు బలహీనంగా మరియు అనారోగ్యంగా కనిపిస్తాయి.

నత్రజని లోప నివారణ :

జీవామృతము, పంచగవ్య, అవుమూత్రం వంటి గోవు ఆధారిత ఎరువులు త్వరితగతిన నేరుగా నత్రజనిని సరఫరా చేస్తాయి. చేపల ఎమల్నన్‌, వర్మివాష్‌, సేంద్రియ నత్రజని యొక్క వాణిజ్య ఉత్పత్తులు అకులపై పిచికారి చేయడం వలన నేరుగా నత్రజనిని గ్రహిస్తాయి. ఇది పంటను త్వరగా కోలుకునేటట్టు చేస్తుంది. పప్పుజాతికి చెందిన మొక్కజొన్న, బార్లీ, ఓట్స్, జొన్న, చిరుధాన్యాలు, చెరకు , వరి , కంది, పెసర, మినుము, శనగ, సోయాబీన్ వంటి పంటలు పచ్చిరొట్ట ఎరువులుగా నత్రజని లోప నివారణకు తోడ్పడతాయి.