Organic Food : సేంద్రియ ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్.. సేంద్రీయ ఉత్పత్తులతో హోటల్ నిర్వహిస్తున్న రైతులు

ప్రకృతి విధానంలో పండించిన పంటకు మార్కెటింగ్ సమస్య తలెత్తుతోంది. దీంతో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రకృతి వ్యవసాయం చేసే కొందరు రైతులు న్యాచురల్ కోఆపరేటీవ్ సొసైటీగా ఏర్పడి.. గో ఆధార్ - గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తుల సహకార విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

Organic Food : సేంద్రియ ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్.. సేంద్రీయ ఉత్పత్తులతో హోటల్ నిర్వహిస్తున్న రైతులు

Farmers Hotel

Organic Food : మారుతున్న ఆహారపు అలవాట్లతో కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. కెమికల్ తో పండించిన ఆహార పదార్ధాలు తిని చిన్న వయసులోనే ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. అందుకే మళ్లీ సేంద్రియ ఉత్పత్తులపై ప్రజల్లో చైతన్యం పెరిగింది. అందుకే కొంచె ఖర్చు ఎక్కువైనా.. ప్రకృతి విధానంలో పండించిన పంటలకోసం వెతుకుతున్నారు. అయితే ఏది సహాజ సిద్దమో.. ఏది రసాయనమో తేల్చుకోలేకపోతున్నారు. దీనినినే అనుకూలంగా మల్చుకుంటున్నారు కొందరు ప్రకృతి విధానంలో పంటలు సాగుచేసే రైతులు. సొంతంగా సేంద్రియ ఉత్పత్తులను పండిస్తూ.. దుకాణాలను నెలకొల్పి వినియోదారులకు అందిస్తూ.. మంచి లాభాలను గడిస్తున్నారు.

READ ALSO : Crave Crops : పంటలను ఆశించే చీడ పీడలను ఆకర్షించే ఎరపంటలు!

నాలుగైదు తరాల ముందు మన జీవన విధానంలో రసాయనిక ఎరువుల వినియోగం లేదు. పూర్తిగా సేంద్రియ విధానంలోనే పంటలు సాగయ్యేవి. మన ఆరోగ్యం కూడా ప్రశాంతంగా ఉండేది. కానీ ఇటీవలి కాలంలో దిగుబడులకోసం అధిక రసాయన ఎరువులను వాడుతున్నారు. ఫలితంగా నేల నిస్సారమైపోతోంది. ఇటు పెట్టుబడులు పెరుగడంతో పాటు దిగుబడులు తగ్గుతూ ఉన్నాయి. రసాయన మందులతో పండించిన పంటలను తిని ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. ఇటు ప్రభుత్వాలు కూడా ప్రకృతిసాగును ప్రోత్సహిస్తుండటంతో చాలామంది రైతులు ప్రకృతి విధానంలోనే పంటల సాగు చేపడుతున్నారు.

READ ALSO : Cassava Cultivation : కర్రపెండలం సాగుకు అనువైన రకాలు.. సాగులో మెళకువలు

ప్రకృతి విధానంలో పండించిన పంటకు మార్కెటింగ్ సమస్య తలెత్తుతోంది. దీంతో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రకృతి వ్యవసాయం చేసే కొందరు రైతులు న్యాచురల్ కోఆపరేటీవ్ సొసైటీగా ఏర్పడి.. గో ఆధార్ – గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తుల సహకార విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.మహబూబ్ నగర్ పట్టణంలో న్యూటన్ చౌరస్తా సమీపంలో గత ఎనిమిది నెలల క్రితం గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తుల సహకార విక్రయ కేంద్రాల సంఘం ఏర్పాటు చేసుకున్నారు రైతులు. ఈ సంఘంలో 39 మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. వారంతా తమ ఉత్పత్తులను తిరుమల హోటల్ లోనే ఒక పక్కకు విక్రయ కేంద్రం ఏర్పాటు చేశారు. తాము పండించిన బియ్యం కాలా బట్, మైసూర్, మల్లిక, కులకర్, రత్నాచోడి, ఒరిస్సా బాస్మతి, నారాయణా, కామిని తదితర దేశవాళీ రకాల బియ్యాన్ని అమ్మకానికి పెడతారు. తిరుమల హోటల్ మేనేజ్ మెంట్ చేస్తున్న సుకన్య ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు.

READ ALSO : Cultivation of vegetables : ప్రకృతి వ్యవసాయంలో కూరగాయల సాగు.. ఏడాది పొడవునా దిగుబడులు

దేశవాళి బియ్యంతో పాటు కొర్రలు, అరికెలు, సామాలు, ఉదలు, అండు కొర్రలు వంటి చిరుధాన్యాలు టమాట, బీర, పచ్చిమిర్చి, కోతిమీర, పుదీనా, పాలకూర వంటి కూరగాయలు కూడా అమ్ముతున్నారు. విక్రయ కేంద్రాలకు ఇచ్చిన సరుకులు ధరలు వాటిని ఉత్పత్తి చేసిన రైతులే నిర్ణయిస్తారు. అదే ధరకు నిర్వాహకులు విక్రయిస్తారు. ఇందుకు వారికి 8 శాతం కమిషన్ , 2 శాతం సంఘం నిర్వాహణకు రైతు చెల్లిస్తారు.

వినియోగదారుడు దళారుల చేతిలో మోసపోకుండా ప్రత్యక్షంగా రైతులకు డబ్బులు చెల్లించడం జరుగుతోంది. ప్రస్తుతం కొనుగోళ్లు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రతి నెలకోసారి సమావేశమయ్యే సంఘం రైతులు.. సేంద్రీయ వ్యవసాయం వైపు మొగ్గుచేపేలా ఇతర రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఏదేమైనా ఈ మధ్యకాలంలో రకరకాల రోగాలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు మందులు కొట్టిన కూరగాయలు వదులుకొని గో ఆధారిత సేంద్రియ పద్ధతిలో ఉత్పత్తులను చేసిన కూరగాయల పై ఆసక్తి ఎక్కువ చూపుతున్నారు. దీంతో రైతులకు కూడా లాభదాయకంగా మారిందని చెప్పొచ్చు.