Pakistan : పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడులు.. పారా మిలిటరీ ప్రధాన కార్యాలయం వద్ద ఘటన..

Pakistan : పాకిస్థాన్ ఆత్మాహుతి దాడులతో దద్దరిల్లిపోయింది. పెషావర్‌లోని ఫ్రంటియర్ కోర్ ప్రధాన కార్యాలయంపై

Pakistan : పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడులు.. పారా మిలిటరీ ప్రధాన కార్యాలయం వద్ద ఘటన..

Pakistan

Updated On : November 24, 2025 / 12:14 PM IST

Pakistan : పాకిస్థాన్ ఆత్మాహుతి దాడులతో దద్దరిల్లిపోయింది. పెషావర్‌లోని పాకిస్థాన్ (Pakistan)  పారామిలిటరీ దళం ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకొని ముగ్గురు ఆత్మాహుతి బాంబర్లు దాడి చేశారు. సోమవారం తెల్లవారు జామున ఈ పేలుళ్లు సంభవించాయి. పారామిలిటరీ దళం ప్రధాన కార్యాలయం ఖైబర్ ఫక్తున్ఖ్వా ప్రావిన్స్ రాజధాని పెషావర్ లోని జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఉంది.

తొలుత కార్యాలయంలోకి చొరబడిన ఉగ్రవాదులు కాల్పులు జరిపి, ఆ తర్వాత కాంప్లెక్స్ లోపల తమను తాము పేల్చేసుకున్నారని పోలీసులు తెలిపారు. తొలుత ఆత్మాహుతి బాంబర్ ప్రధాన ద్వారం వద్ద తనను తాను పేల్చుకోగా.. ఇతరులు ఆవరణలోకి ప్రవేశించారు. అనంతరం సమీపంలోని సైకిల్ స్టాండ్ వద్ద మరో పేలుడు చోటు చేసుకుంది. కార్యాలయాన్ని ముగ్గురు ఉగ్రవాదులు ముట్టడించినట్లు గుర్తించిన భద్రతా బలగాలు వారిపై కాల్పులు జరిపారు. ఇరువర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు పారామిలిటరీ సిబ్బంది మరణించగా.. నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాడులకు సంబంధించి బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ ఇంత వరకు ప్రకటన చేయలేదు. ఈ దాడిలో ముగ్గురు పారామిలిటరీ సిబ్బంది మరణించారని దళ డిప్యూటీ కమాండెంట్ జావేద్ ఇక్బాల్ తెలిపారు. మరో ఐదుగురు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో రహదారిని మూసివేశారు. సైన్యం, పోలీసులు, ఇతర భద్రతా సిబ్బంది ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి.

Also Read: Warangal : వామ్మో.. ఇదేం ట్విస్ట్‌రా మామ.. పెళ్లి చేసుకొని బిగ్ షాకిచ్చిన మహిళ.. పేరెంట్స్, బంధువులంతా ఫేకే.. ట్విస్టుల మీద ట్విస్టులు