Moto G57 Power : మోటోరోలా కొత్త ఫోన్ కేక.. భారీ 7000mAh బ్యాటరీ హైలెట్ భయ్యా.. ధర ఎంతో తెలిస్తే వెంటనే కొనేస్తారు..!

Moto G57 Power : మోటో కొత్త ఫోన్ లాంచ్ అయింది. 7000mAh భారీ బ్యాటరీతో మోటో G57 పవర్ అందుబాటులో ఉంది. యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లతో కొనుగోలుదారులను ఆకట్టుకునేలా ఉంది.

Moto G57 Power : మోటోరోలా కొత్త ఫోన్ కేక.. భారీ 7000mAh బ్యాటరీ హైలెట్ భయ్యా.. ధర ఎంతో తెలిస్తే వెంటనే కొనేస్తారు..!

Moto G57 Power

Updated On : November 24, 2025 / 1:24 PM IST

Moto G57 Power : కొత్త మోటోరోలా ఫోన్ వచ్చేసింది. భారతీయ మార్కెట్లో అధికారికంగా మోటోరోలా మోటో G57 పవర్‌ ఫోన్ లాంచ్ చేసింది. లాంగ్ బ్యాటరీ లైఫ్, ఆకర్షణీయమైన డిస్‌ప్లే, క్లీన్ సాఫ్ట్‌వేర్‌ కలిగి ఉంది. ఈ మోటో ఫోన్ రిఫ్రెషింగ్ డిజైన్ ఆప్షన్ల కూడా అందిస్తుంది. వీగన్ లెదర్ ఫినిషింగ్ కొత్త పాంటోన్ కలర్ ఆప్షన్లు కలిగి ఉంది. ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ కూడా అందిస్తుంది.

ఆండ్రాయిడ్ 16ని బాక్స్ వెలుపల (Moto G57 Power) రన్ అవుతుంది. మోటో G57 పవర్ పర్ఫార్మెన్స్, డిస్‌ప్లే క్వాలిటీ, బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. మోటో ఫోన్‌ రోజువారీ వినియోగానికి యూజర్ ఫ్రెండ్లీ సాఫ్ట్‌వేర్‌తో టాప్ ప్లేసులో ఉంది. బడ్జెట్ పవర్‌ఫుల్ ఫోన్ కొనుగోలుదారులు మోటో G57 పవర్ ధర పూర్తి స్పెసిఫికేషన్‌లను అందిస్తుంది.

మోటో G57 పవర్ స్పెసిఫికేషన్లు :

మోటో G57 పవర్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.72-అంగుళాల ఫుల్ HD ప్లస్ LCD డిస్‌ప్లే కలిగి ఉంది. హై-బ్రైట్‌నెస్ మోడ్‌లో 1050 నిట్స్ వరకు బ్రైట్‌నెస్‌ అందిస్తుంది. ఫ్రంట్ సైడ్ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ఉంది. MIL STD 810H ప్రొటెక్షన్‌తో పాటు IP64 వాటర్ రెసిస్టెన్స్ కలిగి ఉంది. ఈ మోటో ఫోన్ 4nm ప్రాసెస్‌పై స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 4 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. 8GB LPDDR4X ర్యామ్ ఉంది. ర్యామ్ బూస్ట్‌తో 24GB వరకు విస్తరించవచ్చు. ఈ ఫోన్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది.

Read Also : Android Camera Phones : ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్‌‌ను తలదన్నేలా 5 ఆండ్రాయిడ్ కెమెరా ఫోన్లు.. హైక్వాలిటీ ఫొటోలతో కిసిక్ అంతే..!

మోటో G57 పవర్ 7000mAh బ్యాటరీ, 33W టర్బోపవర్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. 60 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. కెమెరాల విషయానికొస్తే.. ఈ మోటో ఫోన్‌లో 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. 30fps వద్ద 2K వీడియో, 60fps వద్ద ఫుల్ HD రికార్డ్ చేయగలదు.

నైట్ మోడ్, పోర్ట్రెయిట్, పనోరమా, ప్రో మోడ్, స్లో మోషన్, టైమ్‌లాప్స్ కొన్ని ఏఐ టూల్స్ వంటి సాధారణ మోడ్స్ కూడా పొందవచ్చు. ఫ్రంట్ సైడ్ ఈ మోటో ఫోన్ 8MP కెమెరా కలిగి ఉంది. 30fps వద్ద 2K వీడియోలు తీసుకోవచ్చు. ఇందులో నైట్ మోడ్, HDR, పోర్ట్రెయిట్, ప్రో మోడ్ గెస్చర్ సెల్ఫీ ఫేస్ ఎన్‌హాన్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

భారత్‌లో మోటో G57 పవర్ ధర ఎంతంటే? :
మోటో G57 పవర్ 5G ఫోన్ సింగిల్ వేరియంట్ ధర రూ.14,999కు పొందవచ్చు. 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. అయితే, ప్రత్యేక లాంచ్ ఆఫర్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్ రూ.12,999 తగ్గింపు ధరకు అందుబాటులో ఉంటుంది. బ్యాంక్ ఆఫర్‌లు, లాంచ్ డిస్కౌంట్ వంటి అదనపు బెనిఫిట్స్ పొందవచ్చు.