Android Camera Phones : ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్‌‌ను తలదన్నేలా 5 ఆండ్రాయిడ్ కెమెరా ఫోన్లు.. హైక్వాలిటీ ఫొటోలతో కిసిక్ అంతే..!

Android Camera Phones : ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ కొనే బదులు అంతే ఫీచర్లతో ఆండ్రాయిడ్ కెమెరా ఫోన్లు లభ్యమవుతున్నాయి. ఏది బాగుంటే అది కొనేసుకోండి.

Android Camera Phones : ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్‌‌ను తలదన్నేలా 5 ఆండ్రాయిడ్ కెమెరా ఫోన్లు.. హైక్వాలిటీ ఫొటోలతో కిసిక్ అంతే..!

Android Camera Phones

Updated On : November 23, 2025 / 8:15 PM IST

Android Camera Phones : ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? కొత్త ఐఫోన్ కన్నా అద్భుతమైన కెమెరాలతో అనేక ఆండ్రాయిడ్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. మీరు ఐఫోన్ కొనేముందు ఓసారి ఈ ఆండ్రాయిడ్ కెమెరా ఫోన్లు చూడండి.. కెమెరా పర్ఫార్మెన్స్  (Android Camera Phones) పరంగా ఐఫోన్ 17 ప్రో మాక్స్‌ మించిన బెటర్ పర్ఫార్మెన్స్ అందిస్తాయి. ఈ 5 ఆండ్రాయిడ్ ఫోన్లలో ఏ కెమెరా ఫోన్ కొంటారో కొనేసుకోండి..

​శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా (రూ. 1,09,999) :
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రాలో 200MP వైడ్ సెన్సార్, 10MP టెలిఫోటో లెన్స్, 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 50MP అల్ట్రావైడ్ కెమెరాతో క్వాడ్-కెమెరా సెటప్ ఉంది. బెస్ట్ సెల్ఫీల కోసం ఈ ఫోన్ 12MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. 6.9-అంగుళాల డైనమిక్ ఎల్టీపీఓ అమోల్డ్ 2X డిస్‌ప్లేతో వ్యూ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.

గూగుల్ పిక్సెల్ 10 ప్రో XL (రూ. 1,24,999) :
50MP + 48MP + 48MP బ్యాక్ కెమెరా సెటప్‌తో గూగుల్ పిక్సెల్ 10 ప్రో XL అద్భుతమైన ఫొటోలను క్యాప్చర్ చేయొచ్చు. 42MP సెల్ఫీ కెమెరాతో పోర్ట్రెయిట్ షాట్‌లను అందిస్తుంది. జూమ్ ఎన్‌హాన్స్, మల్టీ-జోన్ లేజర్ AF, LED ఫ్లాష్ అల్ట్రా-HDR వంటి ఫీచర్లు ఫొటో క్వాలిటీతో వస్తుంది.

Read Also : Black Friday Deal : ఇది కదా డిస్కౌంట్.. ఆపిల్ ఐఫోన్ ఎయిర్ అతి తక్కువ ధరకే.. క్రోమాలో ఇలా కొనేసుకోండి..!

షావోమీ 15 అల్ట్రా (రూ. 1,09,999) :
ఈ యూనిట్ మూడు 50MP సెన్సార్లు, 200MP లెన్స్‌తో కూడిన కెమెరా సిస్టమ్‌తో పాటు 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 90W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5410mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇంకా, అత్యుత్తమ పర్ఫార్మెన్స్ కోసం స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ద్వారా పవర్ పొందుతుంది.

వివో X200 ప్రో (రూ. 94,999) :
వివో X200 ప్రో ఫోన్ 6000mAh బ్యాటరీతో ఎక్కువ గంటలు వస్తుంది. 50MP + 200MP + 50MP బ్యాక్ కెమెరా సెటప్‌తో అద్భుతమైన షాట్‌లను అందిస్తుంది. ఈ యూనిట్ ఫన్‌టచ్ OS15తో ఆండ్రాయిడ్ 15పై రన్ అవుతుంది. మీడియాటెక్ డైమన్షిటీ 9400 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది.

ఒప్పో ఫైండ్ X9 ప్రో (రూ. 1,09,999) :
లేటెస్ట్ ఒప్పో ఫైండ్ X9 ప్రోలో 50MP+200MP+50MP ప్రైమరీ కెమెరా సెటప్, సెల్ఫీ ప్రియుల కోసం 50MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 80W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన భారీ 7500mAh బ్యాటరీని కలిగి ఉంది.