Smriti Mandhana : స్మృతి మంధాన తండ్రే కాదు.. కాబోయే భర్తకు అనారోగ్యం.. ఆస్పత్రిలో చేరిన పలాష్ ముచ్చల్..
ఆదివారం జరగాల్సిన భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన(Smriti Mandhana) మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్ పెళ్లి వాయిదా పడింది.
After Smriti Mandhana Father Fiance Palash Muchhal Taken To Hospital
Smriti Mandhana : ఆదివారం జరగాల్సిన భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన, మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్ పెళ్లి వాయిదా పడింది. స్మృతి మంధాన తండ్రి శ్రీనివాస్ ఆరోగ్యం అకస్మాత్తుగా విషమించడంతో ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వివాహానికి కొన్ని గంటల ముందు శ్రీనివాస్ అస్వస్థతకు గురి అయ్యారు. గుండెపోటు లాంటి లక్షణాలు కనిపించాయి. దీంతో ఆదివారం మధ్యాహ్నం జరగాల్సిన మంధాన పెళ్లి వాయిదా వేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.
అయితే.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం స్మృతి మంధానకు కాబోయే భర్త పలాష్ ముచ్చల్ కూడా అనారోగ్యం వల్ల ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. వైరల్ ఇన్ఫెక్షన్, అసిడిటీ కారణంగా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరినట్లు ఆంగ్ల మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే.. అతడి సమస్య తీవ్రమైనది కాదని సమాచారం. చికిత్స పొందిన తరువాత అతడు ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది.
స్మృతి తండ్రి ఆరోగ్యం ఎలా ఉందంటే.?
స్మృతి మంధాన తండ్రి శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి పై డాక్టర్ నమన్ షా పీటీఐతో మాట్లాడారు. ఆయన ఛాతి నొప్పితో బాధపడుతున్నట్లు వెల్లడించారు. వైద్య పరిభాషలో దీనిని యాంజినా పెక్టోరిస్ అని అంటారన్నారు. ఆయనకు మధ్యాహ్నం 1.30 గంటలకు గుండె నొప్పి వచ్చిందని, 2.15 గంటలకు ఆస్పత్రికి తీసుకువచ్చినట్లుగా చెప్పారు.
ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. సోమవారం ఉదయం మరిన్ని పరీక్షలు చేసి, యాంజియోగ్రఫీ అవసరమా లేదా అనేది నిర్ణయం అని వెల్లడించారు. ఈసీజీలో కొత్తగా ఆందోళనకరమైన విషయాలు ఏమీ లేవని, రక్తపోటు కొద్దిగా పెరిగిందన్నారు. నిరంతరం వైద్య బృందం ఆయన్ను పర్యవేక్షిస్తుందన్నారు.
Rishabh Pant : రిషబ్ పంత్‌కు వన్డే కెప్టెన్సీ ఇవ్వకపోవడం వెనుక ఇంత పెద్ద కారణం ఉందా?
ఆరేళ్లుగా ప్రేమ..
స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ గత ఆరేళ్లుగా ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబాల సమ్మతిలో వివాహానికి సిద్ధం అయ్యారు. వివాహానికి కొన్ని గంటల ముందు ఊహించని పరిణామం కారణంగా వారి పెళ్లి తాత్కాలికంగా వాయిదా పడింది.
