Rishabh Pant : రిషబ్ పంత్‌కు వన్డే కెప్టెన్సీ ఇవ్వకపోవడం వెనుక ఇంత పెద్ద కారణం ఉందా?
వన్డే సిరీస్‌కు సైతం గిల్ దూరం అయ్యాడు. ఈ క్రమంలో వన్డే కెప్టెన్సీ బాధ్యతలను సైతం రిషభ్ పంత్(Rishabh Pant)కు అప్పగిస్తారు అని అంతా భావించారు.
Why wasnt rishabh pant given the odi captaincy aginst south africa series
Rishabh Pant : భారత జట్టు ప్రస్తుతం గౌహతి వేదికగా దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు మ్యాచ్ ఆడుతోంది. రెగ్యులర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మెడనొప్పితో ఈ మ్యాచ్‌కు దూరం కావడంతో అతడి స్థానంలో రిషబ్ పంత్ నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. ఇక దక్షిణాఫ్రికాతో నవంబర్ 30 నుంచి జరగనున్న వన్డే సిరీస్‌కు సైతం గిల్ దూరం అయ్యాడు. ఈ క్రమంలో వన్డే కెప్టెన్సీ బాధ్యతలను సైతం రిషభ్ పంత్‌కు అప్పగిస్తారు అని అంతా భావించారు.
అయితే.. బీసీసీఐ మాత్రం పంత్ ను కాదని సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్ కు నాయకత్వ బాధ్యతలను అప్పగించింది. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. దీనిపై ఓ బీసీసీఐ వివరణ ఇచ్చింది.
గత ఏడాది కాలంలో పంత్ కేవలం ఒకే ఒక వన్డే మ్యాచ్‌ను ఆడాడు. అందకనే కేఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా నియమించినట్లు వెల్లడించింది. అంటే ఎంతటి ఫేమ్ ఉన్న ఆటగాడు అయినా సరే.. కనీసం మ్యాచ్‌లు ఆడకుంటే కెప్టెన్సీ ఇవ్వరనే విషయాన్ని ఇన్‌డైరెక్టుగా చెప్పింది.
మరోవైపు శుభ్‌మన్ జనవరిలో న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు పేసర్లు బుమ్రా, సిరాజ్‌తో పాటు ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు విశ్రాంతి ఇచ్చారు. ఇక ఇటీవల రంజీలతో పాటు దక్షిణాఫ్రికా-ఏ జట్టుపై నిలకడగా రాణించిన రుతురాజ్ గైక్వాడ్‌కు వన్డే జట్టులో స్థానం దక్కింది. అదే సమయంలో సంజూ శాంసన్‌కు మరోసారి నిరాశే ఎదురైంది.
దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ కోసం భారత జట్టు ఇదే..
రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్ (కెప్టెన్), రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్, నితీశ్‌కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, ధ్రువ్ జురెల్.
