Diabetes : డయాబెటీస్ ఉన్న వారికి రక్తంలో చక్కెర స్ధాయిలు పెరగకుండా చూసే కూరగాయలు ఇవే?

టమాటాలు లేని కూర చేయడం దాదాపుగా అసాధ్యమే. టామాటాలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందులోనూ వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ 30 నే ఉంటుంది. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులకు టమోటాలు తినడానికి మంచి ఆహారంగా చెప్పొచ్చు.

These are the vegetables that prevent blood sugar levels from rising in people with diabetes?

Diabetes : డయాబెటీస్ ఉన్నవారు కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. సమయానికి నిద్రపోవాలి. ఆరోగ్యకరమైన ఆహారాలనే తీసుకోవాలి. టైం ప్రకారం మందులు వాడాలి. మానస్థితిని మెరుగుపర్చుకోవడం వంటి విషయాలపై జాగ్రత్త వహించాలి. డయాబెటీస్ వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు విపరీతంగా పెరిగిపోతాయి. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుమడతాయి. అందుకే డయాబెటీస్ బారిన పడకుండా జాగ్రత్తగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే చెడు జీవన శైలి, అనారోగ్యకరమైన ఆహారాలు, శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాల వల్ల చాలా మంది టైప్ 2 డయాబెటీస్ బారిన పడుతున్నారు.

సాధారణంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు పిండి పదార్థాలను తక్కువుగా, పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారాలను ఎక్కువగా తినాలి. అలాగే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఆహారాలనే తినాలి. లేదంటే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగిపోతాయి. మధుమేహాన్ని నియంత్రించడంలో కొన్నిఆహారాలు కీలక పాత్ర పోషిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండటానికి ఎలాంటి ఆహారాలు సహాయపడతాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

1. బీట్ రూట్ ; బీట్ రూట్ లో ఎన్నో పోషకాలుంటాయి. ఈ కూరగాయలో విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది మధుమేహులు తినగలిగిన హెల్తీ ఫుడ్. బీట్ రూట్ లో విటమిన్ సి, ఐరన్, సోడియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. వీటిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి మధుమేహులు వీటిని రోజువారిగా తీసుకోవచ్చు.

2. బ్రోకలి ; బ్రోకలి బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. అలాగే ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి కూడా సహాయపడతుంది. దీనిలో పుష్కలంగా ఉండే ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. బ్రోకలీలో కార్బోహైడ్రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. వీటిని మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి.

3. క్యారెట్లు ; క్యారెట్లను తింటే ఆరోగ్యంగా ఉండటమే కాదు. శరీరం కూడా ప్రకాశవంతంగా తయారవుతుంది. క్యారెట్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ 39 గా ఉంటుంది. దీనిలో ఫైబర్, పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉండే క్యారెట్లు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినటం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి.

4. టమాటా ; టమాటాలు లేని కూర చేయడం దాదాపుగా అసాధ్యమే. టామాటాలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందులోనూ వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ 30 నే ఉంటుంది. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులకు టమోటాలు తినడానికి మంచి ఆహారంగా చెప్పొచ్చు. టమోటాలు గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచటంలో కీలకపాత్ర పోషిస్తాయి.

5. బచ్చలికూర ; బచ్చలికూరలో ఐరన్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అలాగే విటమిన్ ఎ, విటమిన్ సి, విటమినన్ ఇ, విటమిన్ కె, కాల్షియం, ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. బచ్చలికూరలో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యను తొలగిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉన్న బచ్చలికూర మధుమేహ వ్యాధిగ్రస్తులను మంచి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది.

6. బొప్పాయి ; బొప్పాయిలో విటమిన్ సి, విటమిన్ ఎ, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. డయాబెటీస్ పేషెంట్లకు బొప్పాయి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలో పెరగవు. దీనిలో షుగర్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది. బొప్పాయిని జ్యూస్ గా చేసుకుని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.