భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి విజృంభిస్తోంది. కరోనా కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. లాక్ డౌన్ అమల్లోకి రావడంతో అన్ని వ్యాపారాలు మూతపడ్డాయి. జనజీవనం స్తంభించిపోయింది. బయటకు వెళ్లే పరిస్థితి లేదు. లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు. తమ అవసరాలకు చేతుల్లో చిలిగవ్వ లేక అల్లాడిపోతున్నారు.
పట్టణ ప్రాంతాల్లోని నిరుపేద కూలీల బతుకులు దయనీయంగా మారాయి. రెక్కడాతే గానీ డొక్క ఆడని పరిస్థితి వాళ్లది.. కొన్నివారాలుగా చేతిలో పనిలేకపోవడంతో మింగడానికి మెతుకు లేక పిల్లలను పోషించే స్థితిలేక అలమటించి పోతున్నారు. లాక్ డౌన్ ప్రభావం చిన్నపిల్లలపై తీవ్రంగా పడటంతో పసి హృదయాలు చితికిపోయాయి.
దురదృష్టవశాత్తూ చిన్నారులపై దీని ప్రభావం అధికంగా పడింది. పిల్లలను పోషించలేని నిరుపేద బతుకులు జీవనం సాగిస్తున్నాయి. వందలాది వలస కార్మికుల దుస్థితి అత్యంత దయానీయంగా కనిపిస్తోంది. హైదరాబాద్ లోని రాజభవన్ లో ఓ ప్రభుత్వ పాఠశాల దగ్గర భౌతిక దూరం పాటించలేని పరిస్థితుల్లో పిల్లలతో పాటు ఉపాధి కోసం ధీనంగా ఎదురుచూస్తున్నారు.
ఆదాయం వచ్చే దారి లేక తిరిగి తమ సొంత గ్రామాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఉపాధి కోల్పోయి పిల్లలతో పాటు రోడ్డునపడ్డారు.
గ్రామానికి కాలినడక బయల్దేరిన తల్లిదండ్రులు కాసేపు విశ్రాంతి తీసుకున్నారు.
అక్కడే కూర్చొన్న పిల్లాడు ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో ధీనంగా చూస్తు ఉండిపోయాడు..
చెన్నైలోని ఇండస్ట్రీయల్ ఏరియాలో మాస్క్ లు ధరించి ఆకలితో ఆహారం కోసం ఎదురుచూస్తున్న చిన్నారులు
వేలాది మంది వలస కార్మికులు కుటుంబాలతో కలిసి కాలినడకన తమ సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. వారిలో చిన్నారులు కూడా ఉన్నారు. కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉన్న సమయంలో పిల్లలు ఇలా రోడ్డనపడిన వైనం కలిచివేస్తోంది
చెన్నైలోని ఇండస్ట్రీయల్ ఏరియాలో సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ (CRPF) నుంచి ఆహారాన్ని అందుకున్న చిన్నారులు సంతోషంగా ఆకలి తీర్చుకుంటున్నారు.
వేల కిలోమీటర్ల దూరంలోని తమ సొంతూరికి పిల్లలతో కలిసి వెళ్తున్న ఓ కుటుంబం.. మార్గం మధ్యలో కాసేపు విశ్రాంతి తీసుకున్నారు.
మహారాష్ట్రలోని సాయిన్, ముంబై నుంచి తమ చిన్నారులతో కలిసి కాలినడకన ఓ కుటుంబం సొంతూరికి బయల్దేరింది..
ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాంప్ దగ్గర వలస కార్మికుడి పిల్లాడు ఇతర పిల్లలతో ఆడుకుంటున్న దృశ్యం…
ఈ ఫొటో చూస్తుంటే.. లాక్ డౌన్ సమయంలో వలస కార్మికుల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందే సమస్య మరింత పెరిగినట్టుగా కనిపిస్తోంది.
ఢిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఇస్తున్న ఫుడ్ ప్యాకెట్ల కోసం నిలబడిన వలస కార్మికుడి పిల్లాడిని మార్క్ చేసిన సర్కిల్లో ఉండాలని సూచిస్తున్న పోలీసు అధికారి..
కాలినడకన సొంత గ్రామాలకు బయల్దేరిన వలస కార్మికుల్లో చిన్నారులకు ఆహారాన్ని అందిస్తున్న పోలీసులు
ఓ వలస కార్మికురాలు.. ఆమె కుమారుడి సొంతూరికి బయల్దేరగా.. రవాణా సౌకర్యం దొరకుతుందేమనని ఆశతో ముందుకు నడక సాగిస్తోంది.
సొంతూరికి వెళ్లేందుకు బస్సు దొరక్కపోవడంతో రోడ్డుపైనే తన పిల్లాడితో కలిసి నిద్రపోతున్న వలస కార్మికులు..
Also Read | ఆ రెండు జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసుల్లేవు