ఆల్ డివైజ్.. సింగిల్ కనెక్ట్ : ఈ స్మార్ట్ క్లాత్స్ ధరిస్తే.. మీ శరీరమే గాడ్జెట్! 

  • Publish Date - February 17, 2020 / 06:42 PM IST

ఇప్పటివరకూ వెరబుల్ డివైజ్‌లు.. స్మార్ట్ వాచ్ లు, సెన్సార్లు మాత్రమే చూసి ఉంటారు. ఈ డివైజ్‌లతో మీ హార్ట్ రేట్ ఎంత? ఇట్టే చెప్పేస్తుంటాయి. ఇటీవల కాలంలో ఈ వేరబుల్ డివైజ్ లు ఎంతో పాపులర్ అయ్యాయి. వినియోగదారుల విషయానికి వస్తే.. వారి వ్యక్తిగత ఆరోగ్యం.. ఫిట్ నెస్ రెండూ ఎంతో అమూల్యమైనవి. కానీ, సింగపూర్ లోని రీసెర్చర్లు మాత్రం వేరబుల్ టెక్నాలజీని సరికొత్త స్థాయికి తీసుకెళ్లారు.

ఒకేసారి ఎక్కువ గాడ్జెట్లను కనెక్ట్ చేసే డివైజ్ ల సాంకేతికత ఎంతో అవసరం కూడా. డేటా వినియోగం, సాంకేతిక పరిజ్ఞానం వేగవంతమైపోతున్న తరుణంలో తగినట్టుగా కనెక్టవిటీ కూడా ఉండాల్సిందే. ఇందుకోసం… వేరబుల్ డివైజ్ లపై పరిశోధనలు చేస్తున్న నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్ పరిశోధకులు ఒక సరికొత్త వేరబుల్ హ్యుమన్ సర్య్కూట్ బోర్డును రూపొందించారు. ‘స్మార్ట్ క్లాత్స్’ పేరుతో డిజైన్ చేశారు. ఈ సూట్ ధరించడం ద్వారా అన్ని డివైజ్ లను ఒకేసారి కనెక్ట్ చేసుకోవచ్చునని చెబుతున్నారు.

NUS ఇన్సిస్ట్యూట్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ నుంచి అసిస్టెంట్ ప్రొపెసర్ నేతృత్వంలోని పరిశోధక బృందం ఈ స్మార్ట్ క్లాత్స్ డిజైన్ చేసింది. దీని ద్వారా రేడియో వేవ్స్ వంటి బ్లూటూత్, వైఫై కనెక్టవిటీని ఈజీగా యాక్సస్ చేసుకోవచ్చు. వైర్ లెస్ బాడీ సెన్సార్ నెట్ వర్క్ క్రియేట్ చేయడం ద్వారా ఒకే సిగ్నల్ సాయంతో అన్ని డివైజ్ ల నుంచి డేటాను ట్రాన్స్ మిట్ చేసేలా రూపొందించారు.

ఇతర కన్వెన్షనల్ టెక్నాలజీస్ కంటే దీని సిగ్నల్స్ 1000 రెట్లు పటిష్టంగా ఉంటాయి. ఫలితంగా బ్యాటరీ లైఫ్ సామర్థ్యం కూడా వెయ్యి రెట్లు వరకు పెరుగుతుంది. బ్లూటూత్, వై-ఫై రేడియో తరంగాలతో బాడీ సర్క్యూట్ లోని అన్ని సెన్సార్లను స్మార్ట్ ఫోన్లు, ఇతర వేరబుల్ ఎలక్ట్రానిక్స్ పరికరాలతో లింక్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ క్లాత్స్ డిజైన్ చేయడానికి వాడిన మెటేరియల్.. స్టెయిన్లెస్ స్టీల్ ఫైబర్స్ నుంచి తయారైంది. 

దువ్వెన ఆకారపు కుట్లు రూపంలో ఉంటుంది. ఎంబ్రాయిడరీ లేదా ఫాబ్రిక్ అంటుకుని ఉంటాయి. అన్ని డైరెక్షన్ల నుంచి సిగ్నల్ వచ్చేలా డివైజ్ లకు అధిక మొత్తంలో ఎనర్జీ అందేలా చూస్తుంది. వీక్ సిగ్నల్స్ కూడా ఈజీగా గుర్తించగలదు. రేడియో తరంగాలు కలిగిన స్మార్ట్ క్లాత్స్ ధరించిన వ్యక్తికి ఏదైనా ఆరోగ్య పరంగా ముప్పు ఉంటుందా? అంటే.. అసిస్టెంట్ ప్రొఫెసర్ హో మాట్లాడుతూ.. ప్రమాదాలు చాలా తక్కువ అని చెప్పారు. గంటల తరబడి చేతిలో స్మార్ట్ ఫోన్ పట్టుకోవడం కంటే తక్కువ ప్రాముఖ్యతను కలిగి ఉంటుందని అన్నారు. 

బ్యాటరీ రహిత గాడ్జెట్లకు ఎంతో ఉపకరిస్తుంది. మెటా-మెటీరియల్ స్ట్రిప్స్ సిగ్నల్స్ బాహ్య పరిధిని శరీరం నుండి కేవలం 10 సెంటీమీటర్ల దూరంలో పరిమితం చేస్తాయి. తద్వారా “వైర్‌లెస్ నెట్‌వర్క్” మరింత సురక్షితంగా ఉంటుంది. NUS ప్రకారం.. మెటా-మెటీరియల్ కూడా ఖర్చుతో కూడుకున్నది అని తెలిపింది.

ఇది మీటరు వస్త్రానికి 7.37 డాలర్ల కంటే తక్కువ ఖర్చు అవుతుంది. ఈ స్మార్ట్ క్లాత్స్ ను ఫోల్డ్ చేయడం లేదా వంపు తిప్పొచ్చు. కానీ కొంతమేర సిగ్నల్ తగ్గిపోవచ్చు. వైర్ లెస్ ప్రాపర్టీ కలిగిన ఈ క్లాత్స్ ను సాధారణ బట్టలు మాదిరిగానే ఉతకవచ్చు. ఎండబెట్టాక ఐరన్ కూడా చేయొచ్చు.