Winter Skin Care : చలికాలంలో చర్మ సంరక్షణకు ఈ ఫేస్ ప్యాక్ లైతే బెటర్!

కొబ్బరి లో అనేక పోషకాలు ఉంటాయి. ఇది ఆహారంగానే కాదు చర్మానికి ఎంతగానో మేలు చేస్తుంది. చర్మానికి కొబ్బరి పాలతో ఫేస్ ప్యాక్ ఎన్నో చర్మ సమస్యలను పరిష్కరించడంతో పాటుగా పోషణను అందిస్తుంది.

Winter Skin Care : చలికాలంలో చర్మ సంరక్షణకు ఈ ఫేస్ ప్యాక్ లైతే బెటర్!

This face pack is better for winter skin care!

Updated On : January 8, 2023 / 12:20 PM IST

Winter Skin Care : చలికాలంలో చర్మ సమస్యలు అధికం. చర్మం పొడిబారిపోయి నిర్జీవంగా మారిపోతుంది. ఈ సమయంలో చర్మ సంరక్షణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖంపై మొటిమలు, దురద, చర్మ రంగు మారడం, డ్రై స్కిన్ వంటి ఇతర సమస్యలు ఎక్కువగా వస్తాయి. చర్మం పగుళ్లు ఏర్పడటం వల్ల నలుగురిలో తిరగటం ఇబ్బందికరంగా ఉంటుంది. చలికాలంలో ఈ చర్మ సమస్యలను తగ్గించుకోవడానికి కొంతమంది ఇంటి చిట్కాలను అనుసరిస్తుంటారు. అయితే ఇంకొంతమంది చర్మవ్యాధి నిపుణులను సంప్రదిస్తారు. వాస్తవానికి ఈ సీజన్ లో వచ్చే చర్మ సమస్యలను తగ్గించుకోవడానికి కొన్ని రకాల ఫేస్ ప్యాక్ లు బాగా ఉపకరిస్తాయి. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

1. పసుపు, పెరుగు ఫేస్ ప్యాక్ ; పసుపులో అనేక ఔషదగుణాలు ఉన్నాయి. చర్మం పొడి బారడాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే మొటిమలను, మొటిమల వల్ల అయ్యే మచ్చలను తగ్గించడానికి, వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేయటంలో ఉపకరిస్తుంది. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇందుకోసం పెరుగు, పసుపును బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. ఈ ప్యాక్ ను వారానికి రెండుసార్లు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. పెరుగు చర్మాన్ని మరింత కాంతివంతంగా తయారుచేస్తుంది. అలాగే నల్లటి మచ్చలను, పిగ్మెంటేషన్ ను తొలగిస్తుంది. చర్మం రంగును మెరుగుపరుస్తుంది.

2. కొబ్బరి పాలతో ఫేస్ ప్యాక్ ; కొబ్బరి లో అనేక పోషకాలు ఉంటాయి. ఇది ఆహారంగానే కాదు చర్మానికి ఎంతగానో మేలు చేస్తుంది. చర్మానికి కొబ్బరి పాలతో ఫేస్ ప్యాక్ ఎన్నో చర్మ సమస్యలను పరిష్కరించడంతో పాటుగా పోషణను అందిస్తుంది. దీనికిగాను కొద్దిగా కొబ్బరిని తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసి అందులో నీళ్లు పోసి చిక్కటి పేస్ట్ లా తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖానికి, మెడకు అప్లై చేయాలి. దీన్ని 20 నిమిషాల పాటు వదిలేయాలి. ఆ తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఇది మీ ముఖాన్ని అందంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.

3. అరంటిపండు, తేనె ఫేస్ ప్యాక్ ; చలికాలంలో చర్మం పొడిబారకుండా నివారించటానికి, మచ్చలను తొలగించడానికి ఈ ఫేస్ ప్యాక్ బాగా ఉపయోగపడుతుంది. తేనె, పండిన అరటి చర్మాన్ని తేమను నింపుతాయి. అలాగే చర్మాన్ని అందంగా ఉంచుతాయి. ముందుగా అరటిపండ్లు, తేనెను కలిపి మెత్తగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని ముఖానికి అప్లై చేయాలి. ఒక 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. ఈ ప్యాక్ ను వారానికి రెండు లేదా మూడు సార్లు అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.