మరో లేడీ విలన్.. కన్నింగ్ ప్లాన్ వేసిన భార్య.. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చి, బాత్రూంలో పడేసి..
దుబాయ్‌లో ఉన్న హరిచరణ్ కొడుకు కృష్ణ హుటాహుటిన గ్రామానికి వచ్చాడు. తన తల్లిపై అనుమానంతో కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అసలు విషయం బయటపడింది.

Representative image (Nirmal district crime)
Nirmal district: ప్రియుడి మోజులో పడి భర్తను చంపేసింది మరో మహిళ. నిర్మల్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
నిర్మల్ జిల్లా సోన్ మండలం వెల్మల్ గ్రామానికి చెందిన నాగలక్ష్మి అదే గ్రామానికి చెందిన మహేశ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం నాగలక్ష్మి భర్త హరిచరణ్‌కు తెలిసింది.
దీంతో భర్తను ప్రియుడితో కలిసి టవల్‌తో గొంతు నులిమి చంపేసింది నాగలక్ష్మి. హరిచరణ్ మృతదేహాన్ని బాత్రూంలో ఉంచి, మూర్ఛ రోగంతో చనిపోయాడని బంధువులను నమ్మించింది.
దుబాయ్‌లో ఉన్న హరిచరణ్ కొడుకు కృష్ణ హుటాహుటిన గ్రామానికి వచ్చాడు. తన తల్లిపై అనుమానంతో కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. (Nirmal district)
దీంతో అసలు విషయం బయటపడింది. నిందితులు ఇద్దరినీ రిమాండుకి తరలించిన పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు.