Durga Temple : విజయవాడ దుర్గగుడికి వెళ్లే భక్తులకు అలర్ట్.. గుడికి వెళ్లే ముందు ఈ కొత్త రూల్స్ తెలుసుకోండి..

Durga Temple : విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంకు వెళ్లే భక్తులకు అలర్ట్. ఇకపై ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులకు ఆలయ నిర్వాహకులు కొత్త రూల్

Durga Temple : విజయవాడ దుర్గగుడికి వెళ్లే భక్తులకు అలర్ట్.. గుడికి వెళ్లే ముందు ఈ కొత్త రూల్స్ తెలుసుకోండి..

Durga Temple

Updated On : August 26, 2025 / 2:47 PM IST

Durga Temple : విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంకు వెళ్లే భక్తులకు అలర్ట్. ఇకపై ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులకు ఆలయ నిర్వాహకులు కొత్త రూల్స్ అమలు చేయనున్నారు. సెప్టెంబర్ 27వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని తెలిపారు. (Durga Temple)

Also Read: e-Vitara Car : మోదీ జెండా ఊపి ప్రారంభించిన ఈ-విటారా.. 100కు పైగా దేశాలకు ఎగుమతి చేసే ఈ కార్ రేటు..!

ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులకు కొత్తగా డ్రెస్ కోడ్ అమలు చేయనున్నారు. దుర్గగుడికి వచ్చే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులే ధరించాలని, లేకపోతే వారిని ఆలయంలోకి అనుమతించబోమని ఆలయ ఈవో వీకే శీనా నాయక్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ కొత్త నిబంధన సెప్టెంబర్ 27వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని చెప్పారు.

తాజా నిర్ణయంతో.. సెప్టెంబర్ 27వ తేదీ నుంచి భక్తులతోపాటు ఆలయ సిబ్బంది సంప్రదాయ దుస్తులు ధరించడం తప్పనిసరి కానుంది. విధుల్లో ఉండే సమయంలో ఆలయ ఉద్యోగులు కచ్చితంగా ఐడీ కార్డులు ధరించాలని, అలాగే స్కానింగ్ పాయింట్, టికెట్ కౌంటర్ వద్ద కఠిన తనిఖీలు చేయాలని ఈవో వీకే శీనా నాయక్ పేర్కొన్నారు. దుర్గ గుడిలో సేవ, దర్శనాలతో పాటు వసతి సదుపాయాలు కోసం https://kanakadurgamma.org/en-in/home వెబ్‌సైట్‌ సందర్శించాలని ఆలయ అధికారులు సూచించారు.

Also Read: Gold Silver Price Today : పండుగ వేళ దెబ్బకొట్టిన ట్రంప్.. బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు.. నేటి ధరలు ఇలా..

ఆలయ నిర్వాహకులు కొత్త రూల్ అమల్లోకి తీసుకురావడం వెనుక పెద్ద కారణమే ఉంది. దుర్గగుడికి భక్తులు అభ్యంతరకర దుస్తుల్లో వస్తుండటంతో పాటు, ఆలయం లోపల వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న ఘటనలు ఇటీవల ఆలయ అధికారులు గుర్తించారు.

ఇలాంటి చర్యలతో ఆలయ సంప్రదాయాలకు భంగం కలగకుండా ఉండేందుకు కఠిన నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించినట్లు ఆలయ ఈవో పేర్కొన్నారు. అదేవిధంగా ఆలయంలో సెల్ ఫోన్ వాడకాన్ని కూడా నిషేధించినట్లు వెల్లడించారు. ప్రొటోకాల్ దర్శనాలకు వచ్చేవారు ఆలయ ఆఫీసుల్లోనే ఫోన్లు డిపాజిట్ చేయాల్సి ఉంటుందని సూచించారు.