Lose Weight : ఊబకాయ సమస్యతో బాధపడేవారు శరీర బరువు తగ్గాలంటే వారంలో రెండు రోజులు ఇలా చేస్తే చాలు!

ఇలా చేయటం ద్వారా మన శరీరంలో పేరుకుపోయిన శక్తి కొవ్వు కరిగి శక్తిగా మారుతుంది. శరీరానికి ఎనర్జీ ఉండటమే కాకుండా శరీర బరువు సులభంగా తగ్గుతారు. రెండు రోజుల ఉపవాసం వల్లశరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా పెరుగుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.

Lose Weight : బరువు పెరుగుట అనేది అందరి లోను ఒక సమస్యగా రుపాయిందినది. బరువు అనేది మనం తీసుకొనే ఆహరం, మనం త్రాగే పానియాల బట్టి మనం బరువు పెరగటం అన్నది ఆధారపడి ఉంటుంది. ఊబకాయం సమస్యతో బాధపడేవారు శరీర బరువు తగ్గాలంటే తినే డైట్ లో మార్పులు చేయటంతోపాటు, వారంలో రెండు రోజులు ఉపవాసం ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వారంలో ఐదు రోజులు మనకు ఇష్టమైన ఆహారం తింటూ మిగిలిన రెండు రోజులు ఉపవాసం ఉండాలని సూచిస్తున్నారు.

ఈ రెండు ఉపవాస రోజుల్లో తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. కార్బోహైడ్రేట్లు తక్కువగా ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలను, అన్ని కూరగాయలను తీసుకోవాలి. అన్నంకి బదులు రాగి, జొన్నలు వంటి వాటితో తయారు చేసిన రొట్టెలు తీసుకోవాలి. మాంసాహారం తినేవారు చేపలు చికెన్ వంటివి తీసుకోవచ్చు. తరుచూ నీటిని మాత్రం తాగుతూ ఉండాలి. ఇలా బరువు తగ్గాలనుకునేవారు ఈ డైట్ ఫాలో కావటం వల్ల పూర్తిగా బరువు తగ్గుతారు.

ఇలా చేయటం ద్వారా మన శరీరంలో పేరుకుపోయిన శక్తి కొవ్వు కరిగి శక్తిగా మారుతుంది. శరీరానికి ఎనర్జీ ఉండటమే కాకుండా శరీర బరువు సులభంగా తగ్గుతారు. రెండు రోజుల ఉపవాసం వల్లశరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా పెరుగుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. మెదడు కణాల పనితీరు మెరుగుపడటమే కాకుండా మన శరీరంలో దెబ్బతిన్న కణాలు పునరుద్ధరణ జరుగుతుంది. మొదట్లో ఈ డైట్ కాస్త కష్టతరంగా అనిపించిన అనంతరం సులుభంగానే ఉంటుంది. ఇలా చేయటం వల్ల ఏవిధమైనటువంటి దుష్ప్రభావాలు ఉండవు.

శరీర బరువు ఒక్కసారిగా తగ్గేకంటే వారంలో రెండు రోజుల పాటు ఉపవాసాలు ఉంటూ క్రమేపి బరువు తగ్గటం ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అలాగే తీసుకునే ఆహారంలో ఆహారంలో ఎక్కువ పీచు పదార్థాలను ఉండేటట్టుగా చూడండి దీని వాళ్ల మీరు తక్కువ కేలరీల తీసుకోవడానికి సహాయపడుతుంది పీచుపదార్థాలున్న ఆహారం బరువు తగ్గడానికి సిఫార్సు చేయబడింది. ఆకలిగా అనిపించినప్పుడు ఏ మిఠాయిలో, ఇతర చిరుతిళ్లో తినే బదులు.. పండ్లు ఎంచుకోవడం మంచిది. వీటివల్ల చక్కెర, కొవ్వు శరీరంలో చేరతాయన్న బాధ ఉండదు. పోషకాలూ ఎక్కువగా అందుతాయి. బరువూ తగ్గుతారు.

 

ట్రెండింగ్ వార్తలు