Kidney Stones : కిడ్నీలో రాళ్ళను కరిగించే చిట్కాలు

టేబుల్ స్పూన్ ఎండబెట్టిన తులసి ఆకులను వేడినీటిలో వేసి, ఆ టీని రోజులో మూడుసార్లు తీసుకోండి. ఇది ఎసిటిక్ ఆమ్లంగా మారి, మూత్రపిండాలలో రాళ్ళను విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది

Kidney Stones

Kidney Stones : శరీరం నుండి అదనపు వ్యర్థాలు, ఉప్పు, కాల్షియం, కొన్ని విష పదార్ధాలను ఫిల్టర్ చేసే అవయవంగా కిడ్నీ ఉంటుంది. లవణాలు, ఖనిజాలు, కాల్షియం, యూరిక్ ఆమ్లాల కలయికతో ఈ రాళ్ళు మూత్రపిండాలలో ఏర్పడుతాయి. కిడ్నీలో రాళ్ళు సాధారణంగా కాల్షియం ఆక్సలేట్‌తో తయారవుతాయి. నీళ్లను తగినంత మోతాదులో తాగకపోవడం వల్ల, కిడ్నీల్లో వ్యర్థాలు ఎక్కువగా పేరుకుపోవడం వల్ల, వంశ పారంపర్యంగా, ఆగ్జలేట్స్‌ ఉండే ఆహారాలను ఎక్కువగా తినడం వల్ల.. కిడ్నీ స్టోన్లు వస్తుంటాయి. ఆరంభంలో నొప్పి కొద్దిగానే ఉంటుంది. ఆ సమయంలో రాళ్లు చిన్నగా ఉంటాయి. చిన్న చిట్కాలను పాటిస్తే రాళ్లను కరిగించుకోవచ్చు. లేదంటే రాళ్లు పెద్ద సైజ్‌లోకి మారితే తీవ్రమైన ఇబ్బందులు వస్తాయి. కిడ్నీలకు నష్టం జరుగుతుంది.

ఒక గ్లాస్‌ కొబ్బరినీళ్లలో ఒక నిమ్మకాయను పూర్తిగా రసం పిండి రోజూ ఉదయాన్నే పరగడుపునే తాగుతుండాలి. దీంతో కిడ్నీ స్టోన్లు కరిగిపోతాయి. పుచ్చకాయ విత్తనాలను సేకరించి ఎండ బెట్టి పొడి చేయాలి. యాలకులను పొడి చేసుకోవాలి. ఈ రెండు పొడులను ఒక టీస్పూన్‌ మోతాదులో తీసుకోవాలి. రాత్రి పూట ఒక గ్లాస్‌ నీటిలో ఈ రెండు పొడులను ఒక టీస్పూన్‌ మోతాదులో తీసుకుని బాగా కలపాలి. అనంతరం మూత పెట్టి అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయం నీటిని వడకట్టి తాగేయాలి. ఇలా రోజూ చేస్తుంటే మూత్రపిండాల్లో రాళ్లు పడిపోతాయి.

రోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఒక కప్పు ముల్లంగి ముక్కలను తినాలి. లేదా ఒక కప్పు ముల్లంగి జ్యూస్‌ తాగవచ్చు. ఇలా చేస్తుంటే కిడ్నీ స్టోన్లు కరిగిపోతాయి. యాపిల్‌ పండు తొక్కలో సిట్రిక్‌ యాసిడ్‌ ఉంటుంది. అందువల్ల కిడ్నీ స్టోన్లను అది కరిగిస్తుంది. యాపిల్‌ పండుకు ఉన్న తొక్కను తీసి విడిగా తింటుండాలి. దీని వల్ల స్టోన్స్‌ పడిపోతాయి.

టేబుల్ స్పూన్ ఎండబెట్టిన తులసి ఆకులను వేడినీటిలో వేసి, ఆ టీని రోజులో మూడుసార్లు తీసుకోండి. ఇది ఎసిటిక్ ఆమ్లంగా మారి, మూత్రపిండాలలో రాళ్ళను విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది. దానిమ్మ రసాన్ని క్రమంతప్పకుండా తీసుకోవడం ద్వారా, మూత్రపిండాల్లో రాళ్లను బయటకు పంపడానికి దోహదపడుతుంది.

నిమ్మకాయలో ఉండే సిట్రేట్, కిడ్నీలో రాళ్లను విచ్ఛిన్నంచేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. నిమ్మకాయ నీళ్ళు, ఆపిల్ సైడర్ వెనిగర్, దానిమ్మ రసం వంటివి మూత్రపిండాలలోని రాళ్ళను బయటకు పంపడానికి సహాయపడే కొన్ని అద్భుతమైన నివారణలుగా సూచించబడుతున్నాయి.

మూత్రపిండాల్లో రాళ్ల సమస్య ఉన్నవారు రోజూ తగినంత నీటిని తాగాలి. అలాగే పాలకూర, టమాటా వంటి ఆహారాలను వీలైనంత మేర తక్కువగా తీసుకోవాలి. నిమ్మజాతికి చెందిన లేదా విటమిన్‌ సి ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. దీంతో కిడ్నీ స్టోన్స్‌ ను తొలగించుకోవచ్చు.