belly fat
Lose Belly Fat Naturally : అధిక బరువు ఉన్నవారిలో బెల్లి ఫ్యాట్ సమస్య అనేది ఇబ్బంది కరంగా ఉంటుంది. ఏంచేసైనా బెల్లి ఫ్యాట్ ను పోగొట్టుకోవాలని అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ బెల్లి ఫ్యాట్ అన్నది శారీరక శ్రమ లేనివారిలో, నిత్యం కూర్చుని ఉండే వారిలో , అయిల్ ఫుడ్స్ తినేవారిలో, హార్మోన్ లోపాలు, ఒత్తిడి కారణంగా వస్తుంది. అయితే దానిని తగ్గించుకోవటం అంతా ఈజీ ఏమి కాదు.
READ ALSO : Mango Leaves Benefits : మామిడాకులతో ఇలా చేస్తే తలలో తెల్లవెంట్రుకలు కనిపించవు !
ఈ క్రమంలోనే పొట్ట క్రింద కొవ్వులను తగ్గించుకునేందుకు ఎఫెక్టివ్ గా పనిచేసే చిన్న చిట్కా బాగా ఉపకరిస్తుంది. అదేటంటే కొత్తిమీరలో నిమ్మరసం కలపటం వల్ల రుచి పెరగడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా బరువు తగ్గడంలో బాగా సహాయపడుతుంది. నిమ్మకాయలో పెక్టిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా రక్తాన్ని శుద్ధి చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. నిమ్మరసాన్ని కొత్తిమీరతో కలిపి తీసుకుంటే, కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.
కొత్తిమీర నిమ్మకాయ జ్యూస్ ఎలా తయారీ ;
కావాల్సిన పదార్దాలు
కొత్తిమీర ఆకులు – 1 కప్పు
నిమ్మరసం – 1 స్పూన్
నీరు – 1 గ్లాసు
READ ALSO : Lose Fat : కొవ్వులు కరగాలంటే వారంలో ఒకరోజు కేలరీలు తగ్గిస్తే సరిపోతుందా?
తయారీ ;
ముందుగా కొత్తిమీర ఆకులను మెత్తగా పేస్ట్ అయ్యే వరకు వాటిని గ్రైండ్ చేయాలి. తరువాత కొత్తిమీరలో నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఒక గిన్నెలో నీటిని గోరువెచ్చగా వచ్చేవరకు వేడి చేయాలి. తరువాత నిమ్మకాయ, కొత్తిమీర మిశ్రమాన్ని నీటిలో వేయాలి. ఉదయం ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ ను తీసుకోవాలి.
ప్రతిరోజు ఉదయం కొత్తిమీర,నిమ్మ జ్యూస్ ను తీసుకుంటే బెల్లీ కొవ్వు మొత్తం కొద్ది రోజుల్లోనే కరిగిపోతుంది. బాన పొట్ట ఫ్లాట్ గా మారిపోతుంది. బరువు కూడా సులభంగా తగ్గవచ్చు.