Monopause : మోనోపాజ్ దశలో సమస్యలు లేకుండా ఆనందంగా ఉండాలంటే!

మోనోపాజ్ సమయంలో శరీరంలో హార్మోన్లలో అనేక మార్పులు వస్తాయి. దాని వల్ల ఆందోళన , ఒత్తిడి, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలు వస్తాయి. యోగా, ధ్యానం, దీర్ఘ శ్వాస వంటి వాటిని పాటించటం వల్ల ఒత్తిడిని అదుపులో ఉంచుకోవచ్చు.

Monopause Phase

Monopause : మోనోపాజ్ దశలో మహిళలు అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సమస్యల ప్రభావాన్ని తగ్గించుకుని ఆనందంగా జీవితాన్ని గడపాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం. ఇందుకోసం ప్రతిరోజు వ్యాయామం చేయటం అలవాటు గా మార్చుకోవాలి. మోనోపాజ్ ప్రభావం రోజువారి వ్యాయామాలు చేసే మహిళల్లో చాలా తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రధానంగా 40 సంవత్సరాలు దాటిన మహిళలు ప్రతిరోజు ఖచ్చితంగా వ్యాయామం చేయటం అలవాటుగా మార్చుకోవాలి. ఇలా చేయటం వల్ల జీవక్రియల వేగం పెరుగుతుంది. బరువుతగ్గటానికి అవకాశం ఉంటుంది. ప్రతిరోజు కనీసం అరగంట సమయం వాకింగ్, జాగింగ్ వంటి వ్యాయామానికి కేటాయించటం వల్ల మానసిక ఆనందం సొంతమౌతుంది.

రోజు మొత్తంలో ఎన్ని పనులున్నా, ప్రతిరోజు కనీసం ఎనిమిది గంటలు నిద్రకు కేటాయించటం మంచిది. దీని వల్ల తరువాత రోజు అలసటగా అనిపించదు. ఆరోగ్యం కోసం వీలైనంత ఎక్కవగా పోషకాహారాన్ని తీసుకోవాలి. మోనాపాజ్ లక్షణాలను అధిగమించేందుకు విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, మాంసకృత్తులనున్న ఆహారంతోపాటు, గింజలు, పండ్లూ, కూరగాయలు ఎక్కువగాతీసుకోవాలి.

మోనోపాజ్ సమయంలో శరీరంలో హార్మోన్లలో అనేక మార్పులు వస్తాయి. దాని వల్ల ఆందోళన , ఒత్తిడి, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలు వస్తాయి. యోగా, ధ్యానం, దీర్ఘ శ్వాస వంటి వాటిని పాటించటం వల్ల ఒత్తిడిని అదుపులో ఉంచుకోవచ్చు. ఆరోగ్యం విషయంలోను తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. మోనోపాజ్ దశలో కాన్సర్‌కు సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి. బహిష్టు ఆగిపోయిన ఆరు నెలల తర్వాత రక్తస్రావం కనపడితే అశ్రధ్ధ చేయకుండా వైద్యుల వద్దకు వెళ్ళి తగిన పరీక్షలు చేయించుకోవాలి. ఆ సమయంలో ప్రశాంతంగా, ధైర్యంగా ఉండాలి. సరైన ఆహారం తీసుకుంటూ, సరైన వ్యాయామం చేస్తూ, బరువు పెరగకుండా చూసుకోవాలి. వైద్యుల సలహా తీసుకుంటూ వ్యాధుల గురించి అవగాహనతో జీవితం గడిపితే మెనోపాజ్ వలన వచ్చే బాధల నుండి సులభంగా బయటపడవచ్చు.