Kidney
Kidney Function : మానవ శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు ప్రధానమైనది. శరీరంలో ఇవి చిక్కుడగింజ ఆకారంలో ఉంటాయి. రక్తాన్ని శుద్ధి చేసి మూత్రం ద్వారా వ్యర్ధాలను తొలగించటం, హర్మోన్లను ఉత్పత్తి చేయటం , ఖనిజాలను సమతుల్యం చేయటం వంటివి కిడ్నీల బాధ్యత. మద్యపానం, గుండె జబ్బులు, హెపటైటిస్ సి మరియు హెచ్‌ఐవి రక్తపోటు, మధుమేహం వంటి వాటి వల్ల ముఖ్యంగా కిడ్నీ సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి.
కిడ్నీలు చెడిపోయి సరిగా పనిచేయకుంటే రక్తంలో వ్యర్ధాలు పేరుకుపోతాయి. కిడ్నీల పనితీరు మందగిస్తే అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. మనం తీసుకునే ఆహారంలో కొన్ని నియమాలను అలవరచుకుంటే కిడ్నీల పనితీరు మెరుగుపడి ఆరోగ్యంగా ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు. కొన్ని ఆహారాలను తీసుకోవటం నివారించటం వల్ల రక్తంలో వ్యర్ధాలు చేరటాన్ని తగ్గించ వచ్చు.
దీర్ణకాలిక మూత్రపిండాల వ్యాధి ఉన్నవారిలో కిడ్నీలు అదనపు సోడియం, పొటాషియం, ఫాస్పరస్ లను రక్తం నుండి తొలగించలేవు. మనం తీసుకునే ఆహారంలో సోడియంను తగింనంత మోతాదులో మాత్రమే తీసుకోవాలి. ఉప్పును అధిక మోతాదులో తీసుకునే వారికి కిడ్నీ సమస్యలు త్వరితగతిన వచ్చే ప్రమాదం ఉంటుంది. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారు కొన్ని జాగ్రత్తులపాటిస్తే కొంతమేర సమస్య నుండి బయటపడవచ్చు.
కిడ్నీల పనితీరు మెరుగు పడాలన్నా, ఆరోగ్యం బాగుండాలన్నా రోజూ కనీసం ఎనిమిది గ్లాసుల నీరు తాగమని వైద్యులు చెబుతారు. శరీరంలో తయారయ్యే టాక్సిన్లను కిడ్నీలు బయటకు పంపాలంటే నీరు పుష్కలంగా తాగాలి. శరీరంలో సగం రోగాలకు కారణం తగినంత నీరు శరీరానికి ఇవ్వకపోవటమే. కాబట్టి రోజుకు సరిపడినన్ని నీరు శరీరానికి అందజేయటం వల్ల కిడ్నీ సమస్యలను దూరంగా పెట్టవచ్చు.
విటమిన్ సి అధికంగా ఉండే సిట్రస్ జాతి పండ్లులతోపాటు బ్రోకలీ, దోసకాయ వంటి కూరగాయలను తీసుకోవడం మంచిది. కిడ్నీలో రాళ్లను కరిగించే సామర్ధ్యాన్ని విటమిన్ సి కలిగి ఉంటుంది. ఈ పోషకం కిడ్నీ ఆరోగ్యానికి మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఖర్జూరాలను రాత్రంతా నీళ్ళలో నానబెట్టి తర్వాత రోజు తింటే కిడ్నీలో రాళ్లు వంటి సమస్యలు దూరమవుతాయి. ఖర్జూరాలలో ఫైబర్, మెగ్నీషియం, కాపర్, మాంగనీస్ వంటి ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కిడ్నీల పనితీరును మెరుగుపరచడానికి సహాయపడతాయి.
యాపిల్ పండులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కిడ్నీలోని ఇన్ఫెక్షన్లను నయం చేసి కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తాయి. కనుక రోజుకు ఒక యాపిల్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. యాపిల్ లో ఉండే ఔషధ గుణాలు కిడ్నీల లోపల బ్యాక్టీరియా పెరగకుండా అడ్డుకుంటాయి. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలుపుకుని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది యూరిన్ సిట్రేట్ స్థాయిలను పెంచి కిడ్నీలోని రాళ్లను కరిగిస్తుంది. కిడ్నీల పనితీరు మెరుగుపడుతుంది.
పొటాషియం ఎక్కువగా ఉన్న వాటిని రోజువారీగా తీసుకుంటూ ఉండాలి. ద్రాక్ష, కమలాపండు, అరటిపండు, కివి, అప్రికాట్ లాంటి పండ్లలో పొటాషియం ఎక్కువగా లభిస్తుంది. అంతేకాకుండా పాలు, పెరుగులో కూడా పొటాషియం పుష్కలంగానే ఉంటుంది. ముఖ్యంగా వివిధ రకాల బెర్రీస్ కిడ్నీలలో మలినాలను శుభ్రం చేస్తుంది. రాత్రంతా నీళ్లలో నానబెట్టిన బార్లీ గింజల నీటిని ఉదయాన్నే తాగితే కిడ్నీల పనితీరు మెరుగుపడుతుంది. బార్లీలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది కిడ్నీలను శుభ్రపరిచడానికి సహాయపడుతుంది.