Hemoglobin : రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరగాలంటే రోజుకు ఒక స్పూన్ పొడి చాలు!

ఈ మధ్య కాలంలో మనలో చాలా మంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. రక్తహీనత సమస్య ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆహారంలో మార్పులు చేసుకోవటం మేలు.

Hemoglobin : రక్తహీనత సమస్య నుండి బయట పడటానికి గోధుమ గడ్డి చాలా బాగా సహాయపడుతుంది. గోధుమ గడ్డిలో మెగ్నీషియం, క్లోరోఫిల్, కాల్షియం, అయోడిన్, సెలీనియం, జింక్, ఐరన్, ఫైబర్, విటమిన్ కె, విటమిన్ బి, సి , ఇ వంటి పోషకాలు సమృద్దిగా ఉంటాయి. క్లోరోఫిల్ సమృద్ధిగా ఉండటంతో రక్తం శుద్ధి కావడమేగాకుండా. రక్తం పెరుగుదలకు తోడ్పడుతుంది.యాంటీ యాక్సిడెంట్లు గోధుమ గడ్డిలో ఉండటం వల్ల ఒత్తిడి, ఆందోళనలను తగ్గిస్తుంది.

ఈ మధ్య కాలంలో మనలో చాలా మంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. రక్తహీనత సమస్య ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆహారంలో మార్పులు చేసుకోవటం మేలు. సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే మందులు వాడుతూ మార్కెట్ లో దొరికే గోధుమ గడ్డి పొడి లేదంటే ఇంట్లోనే గోధుమ గడ్డిని పెంచుకుని దానిని పొడిగా మార్చి ఉపయోగిస్తే రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుకోవచ్చు.

గోదుమ గడ్డి పొడిని ఉదయం త్రాగే వెజిటేబుల్ జ్యూస్ లో కలిపి తీసుకోవాలి. అలా కాకుండా ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ పొడి,అరస్పూన్ ఎండు ఖర్జూరం పొడి వేసి బాగా కలిపి తాగాలి. ఖర్జూరం పొడి లేకపోతే ఒక స్పూన్ తేనె కలుపుకొని తాగటం మంచిది. ఈ విధంగా 10 రోజుల పాటు తాగితే ఫలితం కనపడుతుంది. ఇలా తాగటం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. చురుకుదనం తోపాటు, అజీర్ణం ,అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు తొలగిపోతాయి.

ట్రెండింగ్ వార్తలు