Beautiful : వయస్సు పైబడుతుందా? అందంగా కనిపించటం కోసం!

చర్మంపై కనిపించే వృద్ధాప్య సంకేతాలకు ఎండ కూడ ఒక కారణంగా చెప్పవచ్చు. సూర్య కిరణాల తాకిడికి ముదురు మచ్చలు, పిగ్మెంటేషన్ లేదా ముడతలు కూడా వస్తాయి. ఇంటి లోపల లేదా మేఘావృతమైన రోజులో కూడా వృద్ధాప్య సంకేతాలను తగ్గించడానికి సన్‌స్క్రీన్‌ను ఉపయోగించడం మంచిది.

Look Beautiful

Beautiful : వయస్సు 30 దాటితే చర్మ సౌందర్యంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా వృద్ధాప్య ఛాయలు మెల్లమెల్లగా కనిపిస్తుంటాయి. ఇది ప్రతి ఒక్కరిలో కనిపించే సహజ ప్రక్రియ. అయితే కొందరు తక్కువ వయసులోనే చాలా పెద్దవారిగా కనిపిస్తుంటారు. ఇంకొందరు ఎక్కువ వయసు ఉన్నా యవ్వనంగా కనిపిస్తారు. ఇదంతా ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి, చర్మ సంరక్షణ పై ఆధారపడి ఉంటుంది. వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తూ, ఎప్పుడూ యవ్వనంగా కనిపించడానికి కొన్ని సూచనలు పాటించటం వల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది.

ఆహారంలో మార్పులు ; యాంటీ ఆక్సిడెంట్ల లక్షణాలతో నిండిన ఆహారం చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. చర్మాన్ని వృద్ధాప్యం ఛాయల నుంచి కాపాడుతుంది. చర్మంపై ముడతుల రాకుండా ఉండేందుకు తినే ఆహారంపై దృష్టి పెట్టడం మంచిది. పచ్చి ఆకు కూరలు, బెల్ పెప్పర్స్, బ్రోకలీ, క్యారెట్లు మొదలైన కూరగాయలు, దానిమ్మ, బ్లూబెర్రీస్, అవకాడో మొదలైన పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి. గ్రీన్ టీ, ఆలివ్ ఆయిల్‌ని ఉపయోగించటం ద్వారా చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.

చర్మ రక్షణకోసం ; సన్‌స్క్రీన్ లోషన్, క్రీమ్స్ అనేవి బెస్ట్ యాంటీ ఏజింగ్ సొల్యూషన్స్. సూర్యుని నుంచి రక్షించడానికి ఇవి అత్యంత ప్రభావవంతగా తోడ్పడతాయి. చర్మంపై కనిపించే వృద్ధాప్య సంకేతాలకు ఎండ కూడ ఒక కారణంగా చెప్పవచ్చు. సూర్య కిరణాల తాకిడికి ముదురు మచ్చలు, పిగ్మెంటేషన్ లేదా ముడతలు కూడా వస్తాయి. ఇంటి లోపల లేదా మేఘావృతమైన రోజులో కూడా వృద్ధాప్య సంకేతాలను తగ్గించడానికి సన్‌స్క్రీన్‌ను ఉపయోగించడం మంచిది. చర్మానికి క్రమం తప్పకుండా మాయిశ్చరైజ్ చేయడం చాలా ముఖ్యం. మాయిశ్చరైజర్‌ను అప్లై చేయటం ద్వారా చర్మం హైడ్రేటెడ్‌గా, తాజాగా ఉంటుంది. ఇది ముడతలను, వృద్ధాప్యం కనిపించే సంకేతాలను తగ్గించడంలో సహాయపడుతుంది. విటమిన్ సి లేదా విటమిన్ ఎ ఉన్న మాయిశ్చరైజర్‌ను అప్లై చేస్తే మేలని నిపుణులు సూచిస్తున్నారు.

సుఖ నిద్ర ; నిద్రపోతున్న సమయంలో చర్మానికి రక్త ప్రవాహం పెరుగుతుంది. ముడతలు, ఏజ్‌ స్పాట్స్‌ తగ్గేందుకు నిద్ర ఉపకరిస్తుంది. మనిషికి ఏడు నుంచి తొమ్మిది గంటల నిద్ర అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. నిద్ర లేమితో బాధపడుతున్న వారిలో వృద్ధాప్య ఛాయలు త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. ఆందోళనలు నిద్ర లేమికి కారణమౌతాయి. క్రమంగా చర్మంపై వృద్ధాప్య సంకేతాలను తీసుకువస్తాయి.

చర్మానికి విటమిన్ ఇ ; విటమిన్ ఇ పోషకాల ప్రధాన విధి ఫ్రీ రాడికల్స్ ద్వారా ప్రేరేపించబడిన ఆక్సీకరణ నష్టాన్ని నివారిస్తుంది. ముడతలు, మచ్చలు, చర్మం మంట, మొటిమలు, అతినీలలోహిత కిరణాల వంటి హానికరమైన ప్రభావాన్ని అడ్డుకోవడంలో సహాయపడే లక్షణాలను విటమిన్ ఇ కలిగి ఉంటుంది. చర్మపు రంగు,ఆకృతిని మెరుగుపరచడానికి అవసరమైన యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది. విటమిన్ ఇ హైపర్‌పిగ్మెంటేషన్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది.