Tobacco Worm : చలికాలంలో పంటలను ఆశించే పొగాకు లద్దె పురుగు, నివారణ మార్గాలు!

ఈ పురుగులు ఆకుల్లోని పచ్చని పదార్ధాన్ని గీకి తినటం వలన ఆకులు జల్లెడగా మారి తెల్లగా కనిపిస్తాయి. ఆకులకు రంధ్రాలు చేసి, ఆకులను పూర్తిగాను, పువ్వులను, పిందెలను కూడా తినేస్తాయి.

How to Control and Prevent Hornworms

Tobacco Worm : వాతావరణం చల్లగా ఉండి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పుడు పొగాకు లద్దె పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. తల్లి రెక్కల పురుగులు ఆకు అడుగు భాగాన గుంపుగా గుడ్లు పెడతాయి. పిల్ల పురుగులు గుంపులుగా ఉండి ఆకుపై పత్రహరితాన్ని గోకి తినేసి జల్లెడగా మారుస్తాయి. బాగా ఎదిగిన పురుగులు ఆకులను తినేస్తాయి. పగటిపూట ఈ పురుగులు చెట్ల అడుగు భాగాన లేక మట్టి పెళ్లల కింద దాగి ఉండి రాత్రిపూట మొక్కలను ఆశించి నష్టాన్ని కలుగజేస్తాయి. చివరకు ఈనెలను మాత్రమే మిగిల్చి చెట్లను మోడుల్లాగా మారుస్తాయి.

ఈ పురుగులు ఆకుల్లోని పచ్చని పదార్ధాన్ని గీకి తినటం వలన ఆకులు జల్లెడగా మారి తెల్లగా కనిపిస్తాయి. ఆకులకు రంధ్రాలు చేసి, ఆకులను పూర్తిగాను, పువ్వులను, పిందెలను కూడా తినేస్తాయి. ఈ పురుగు రాత్రి పూట ఎక్కువగా పంటను తినేస్తుంది. పగలు మొక్కల మొదళ్ళలోను, భూమి నెర్రెలలోనికి చేరిపోతాయి.

నివారణ చర్యలు ;

ఈ పురుగుకు సంబంధించి గ్రుడ్ల సముదాయాలను ఏరివేయాలి. పిల్ల పురుగులతో ఉన్న ఆకులను ఏరి నాశనం చేయాలి. ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను ఏర్పాటుచేసి పురుగు ఉధృతిని తగ్గించే చర్యలు తీసుకోవాలి. పురుగు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు పొలంలో విషపు ఎర ముద్దల్ని వెదజల్లాలి. ఎకరాకు మోనోక్రోటోఫాస్‌ 36 % యస్‌.ఎల్‌ 500 మి.లీ. లేదా క్లోరిపైరిఫాస్‌ 20 % ఇ.సి 500 మి.లీ. లేదా కార్బరిల్‌ 50 % డబ్ల్యు.పి. 500 గ్రా 5 కిలోల తవుడు, అరకిలో బెల్లం సరిపడే నీటితో కలిపి చిన్న ఉండలుగా చేసి సాయంకాలం సమయంలో వెద జల్లాలి.

పురుగు ఉధృతి తీవ్రంగా ఉంటే మోనోక్రోటోఫాస్‌ 36 % యన్‌.ఎల్‌ 1.6 మి.లీ. లేదా క్లోరిపైరిఫాస్‌ 20 % ఇ.సి 2.5 మి.లీ. లేదా నొవాల్యురాన్‌ 10 % ఇ.సి. 1 మి.లీ. లేదా థయోడికార్బ్‌. 75 % డబ్ల్యు. పి 1 గ్రా. లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. ఎకరాకు 30,000 ట్రైకోగ్రామ బదనికలను వారం రోజుల వ్యవధిలో విడుదల చేయాలి. ఎకరాకు ఎన్‌.పి.వి. 200 యల్‌.ఇ. ద్రావణాన్ని సాయం కాలం పిచికారి చేయటం ద్వారా పురుగు ఉధృతి తగ్గించి నష్టాన్ని నివారించుకోవచ్చు.

5శాతం వేపగింజల కషాయాన్ని గుడ్లు లేదా పరుగులు చిన్నవిగా ఉన్నప్పుడు పిచికారి చేయాలి. లేక వేపనూనె 1000మి.లీ మందును 200 లీటర్ల నీటికి చొప్పున కలుపుకుని ఎకరానికి పిచికారీ చేయాలి.

ట్రెండింగ్ వార్తలు