Tomatoes Have A Kind Of Nervous System That Warns About Attacks
Tomatoes Nervous System : టమాటోల్లోనూ నాడి వ్యవస్థ ఉంటుంది. అది ముందుగానే కీటకాల దాడిని పసిగట్టేస్తుందట.. కీటకాలు దాడిచేయడానికి ముందే పక్క మొక్కలకు సంకేతాలు పంపుతాయట. ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ద్వారా ఈ సంకేతాలను పంపి హెచ్చరిక చేస్తాయట.. టమాటోల్లో నాడివ్యవస్థ.. మన నాడీ వ్యవస్థల మాదిరిగానే పనిచేస్తుందట.. టమాటోలపై దాడిచేసిన కణజాలాలు దెబ్బతిన్న వెంటనే అందులోని రియాక్టివ్ కెమికల్ హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను విడుదల అవుతుంది.
అది ఇతర మొక్కల రక్షణకు సందేశాలు పంపుతుందని ఓ కొత్త అధ్యయనంలో వెల్లడైంది. మానవ నాడీ వ్యవస్థలు శరీరంలోని వివిధ భాగాల మధ్య విద్యుత్ సంకేతాలను పంపడానికి న్యూరాన్లు అనే ప్రత్యేక కణాలను కలిగి ఉంటాయి. అలాగే మొక్కలకు న్యూరాన్లు లేవు. కానీ, వాటి మూలాలు, ఆకులు పండ్ల మధ్య జిలేమ్ ఫ్లోయమ్ అనే పొడవైన, సన్నని గొట్టాలు ఉంటాయి. ఈ గొట్టాలలో వెలుపల ప్రవహించే చార్జడ్ అయాన్లు మొక్కల వివిధ భాగాల చుట్టూ న్యూరాన్ల మాదిరిగానే విద్యుత్ సంకేతాలను ప్రసారం చేస్తాయి.
శారీరకంగా దెబ్బతిన్న ఆకులు ఇతర ఆకులకు విద్యుత్ సంకేతాలను పంపుతాయని కొత్త అధ్యయనంలో తేలింది. బ్రెజిల్‌లోని ఫెడరల్ యూనివర్శిటీ ఆఫ్ పెలోటాస్ పండులో కూడా పండులో కూడా ఇలాగే ఉంటుందా? లేదా అనేది పరిశోధించారు. చిన్న చెర్రీ టమోటా మొక్కలపై అధ్యయనం చేశారు. వాటిని ఫెరడే బోనుల్లో ఉంచి బాహ్య విద్యుత్ క్షేత్రాలను నిరోధించారు. ప్లాస్టిక్ సంచులలోని పండ్ల ఉపరితలంపై చిమ్మట (Helicoverpa armigera) గొంగళి పురుగులను పరిమితం చేశారు.
పండ్ల కొమ్మలలో ఉంచిన ఎలక్ట్రోడ్లు గొంగళి పురుగులు తినడం తరువాత విద్యుత్ సంకేతాల సరళిని మార్చినట్టు గుర్తించారు. పండ్లు పండినా లేదా ఆకుపచ్చగా ఉన్న సమయంలోనూ మార్పులను గమనించారు. పండు, విద్యుత్ కార్యకలాపాలు ప్రతి సెకనులో నిరంతరం మారుతూ ఉంటాయని రీసెర్చర్లు కనుగొన్నారు. అదే ఏదైనా క్రిమికీటకం దాడి చేసినప్పుడు విద్యుత్ పరంగా ఎలాంటి మార్పులు ఉంటాయో పరిశోధకులు గుర్తించారు.