Treatment Range Hospital Conducts Second Ayushmaan Bharath Free Surgical Camp in Karnataka
– కర్ణాటకలో ట్రీట్‌మెంట్ రేంజ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో రెండో ఆయుష్మాన్ భారత్ ఫ్రీ సర్జికల్ క్యాంపు
Ayushmaan Bharath Free Surgical Camp : అధునాతన శస్త్రచికిత్సలు, సున్తీలో అగ్రగామి అయిన ట్రీట్‌మెంట్ రేంజ్ హాస్పిటల్.. రెండో ఆయుష్మాన్ భారత్ ఉచిత శస్త్ర చికిత్సా శిబిరాన్ని కర్ణాటకలో విజయవంతంగా నిర్వహించింది. వెనుకబడిన ప్రాంతాలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించడమే లక్ష్యంగా ఈ సంస్థ పనిచేస్తోంది. ఇందులో భాగంగానే కేఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో భాల్కిలోని వలీ కాంప్లెక్స్‌లోని జేఎస్ఎస్ ఆర్థో క్లినిక్‌లో ఈ ఫ్రీ సర్జికల్ క్యాంపు కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఆయుష్మాన్ భారత్-ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (PM-JAY) కింద ఈ వైద్య శిబిరంలో 252 మంది రోగులకు ఉచితంగా కన్సల్టెన్సీలను అందించింది. శస్త్రచికిత్స అవసరమయ్యే 35 మందిని గుర్తించింది. వీరిందరి శస్త్రచికిత్సలను ఎలాంటి ఖర్చు లేకుండా డిసెంబర్ 9, 2024 (సోమవారం) నిర్వహించనుంది.
బలహీన వర్గాలకు అధునాతన వైద్య సంరక్షణ మా లక్ష్యం : డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి
బలహీన వర్గాలకు అధునాతన వైద్య సంరక్షణ అందించడమే లక్ష్యంగా ఈ ఉచిత వైద్య శిబిరానికి జనరల్, ల్యాప్రోస్కోపిక్, లేజర్ సర్జన్, డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి నాయకత్వం వహించారు. వైద్య సేవలను అందించడంలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డికి రెండు దశాబ్దాల అనుభవం ఉంది. అంతేకాదు.. హైదరాబాద్‌లోని ట్రీట్‌మెంట్ రేంజ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వ్యవస్థాపకుడిగా, మేనేజింగ్ డైరెక్టర్‌గానూ అత్యాధునిక పద్ధతులు, సాంకేతికతను ఉపయోగించి వేలాది విజయవంతమైన శస్త్రచికిత్సలను నిర్వహించారు.
ఈ వినూత్న టెక్నిక్‌తో 25వేల మందికి పైగా రోగులకు శస్ర్తచికిత్స అందించారు కేఎస్ఆర్. ప్రత్యేకించి స్టాప్లర్ సున్తీలో తన నైపుణ్యానికి డాక్టర్ రెడ్డి ప్రశంసలు కూడా అందుకున్నారు. కేఎస్ఆర్ మార్గదర్శక కృషికి, ఆయనకు వైద్య రత్న అవార్డు, జాతీయ అవార్డు, ఏపీజే అబ్దుల్ కలాం హెల్త్ ఎక్సలెన్స్ అవార్డు లభించాయి. ఈజిప్ట్‌లోని కైరోలో జరిగిన వేడుకలో యూకేలోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు డాక్టర్ రెడ్డి చేసిన సేవలకు గుర్తింపుగా ఇంటర్నేషనల్ ఎక్సలెన్స్ అవార్డుతో సత్కరించారు.
Second Ayushmaan Bharath Free Surgical Camp
భాల్కీ వైద్య శిబిరం నిర్వహణ సందర్భంగా డాక్టర్ రెడ్డి మాట్లాడుతూ.. “సమాజంలోని అత్యంత బలహీన వర్గాలకు అధునాతన వైద్య సంరక్షణను అందుబాటులోకి తీసుకురావడమే మా లక్ష్యం. కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ అంతటా నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను విస్తరించాలని భావిస్తున్నాం. అందులో భాగంగానే భాల్కీలోని ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశాం” అని పేర్కొన్నారు.
కర్ణాటక అంతటా వైద్యసేవల విస్తరణ :
బీదర్‌లో ప్రారంభమైన ఆయుష్మాన్ భారత్ శిబిరం విజయవంతమైంది. 178 మంది రోగులు కన్సల్టెన్సీలు పొందారు. 89 శస్త్రచికిత్సలు ఉచితంగా నిర్వహించారు. భాల్కీలో రెండో క్యాంపు ఏర్పాటుతో కమ్యూనిటీ ఆరోగ్యం పట్ల ట్రీట్‌మెంట్ రేంజ్ హాస్పిటల్ అంకితభావాన్ని బలపరుస్తుంది.
గ్రామీణ ప్రాంతాలకు సరసమైన ఆరోగ్య సంరక్షణ విస్తరించడమే లక్ష్యం :
భాల్కీ మున్సిపాలిటీ సీఎమ్‌సీ వైస్ ప్రెసిడెంట్ ధన్‌రాజ్ హగర్గితో సహా అనేక మంది స్థానిక నేతలు ఈ వైద్య శిబిరం ఏర్పాటుపై ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా ట్రీట్‌మెంట్ రేంజ్ హాస్పిటల్ సీఈఓ గాలిపల్లి విక్రమ్ కుమార్ మాట్లాడుతూ.. సంస్థ భవిష్యత్తు ప్రణాళికలను ఉదహరించారు. ఆరోగ్య సంరక్షణ అనేది మా కమ్యూనిటీ జీవితాలను మరింతగా మెరుగుపరచడంలో సాయపడుతుందన్నారు. ఈ విషయంలో ట్రీట్‌మెంట్ రేంజ్ హాస్పిటల్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.
అలాగే, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలకు సరసమైన ఆరోగ్య సంరక్షణను విస్తరించాలనే లక్ష్యంలో ఈ రెండో క్యాంపు ఏర్పాటు ఒక భాగమని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆరోగ్య సంరక్షణ అంతరాన్ని తగ్గించేందుకు ఇలాంటి మరిన్నో కార్యక్రమాలను నిర్వహించడానికి అంకితభావంతో ఉన్నామని చెప్పారు.
ట్రీట్‌మెంట్ రేంజ్ హాస్పిటల్ :
2019లో ట్రీట్‌మెంట్ రేంజ్ హాస్పిటల్ స్థాపించారు. ఈ ఆస్పత్రిలో యూరాలజీ, ఆర్థోపెడిక్స్, జనరల్ సర్జరీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, నెఫ్రెక్టమీలో అత్యాధునిక సౌకర్యాలతో పాటు నైపుణ్యాన్ని అందిస్తూ ప్రముఖ మల్టీస్పెషాలిటీ హెల్త్‌కేర్ ప్రొవైడర్‌గా మారింది. ఆస్పత్రి ప్రధాన బీమా ప్రొవైడర్లు, ఆయుష్మాన్ భారత్‌తో సహా ప్రభుత్వ పథకాలతో ఎంప్యానెల్ అయింది. తద్వారా విభిన్న జనాభాకు ఆరోగ్య సంరక్షణను అందుబాటులో ఉండేలా చేస్తుంది.
ట్రీట్‌మెంట్ రేంజ్ హాస్పిటల్ కారుణ్య సంరక్షణను అందించడంతో పాటు వైద్యపరమైన పరిష్కారాలను అందించడంలో ముందంజలో ఉంది. భాల్కీ శిబిరం ఏర్పాటుతో ఆరోగ్య సంరక్షణను విస్తరించడంలో మరో ముందుడుగు పడింది.
భవిష్యత్తులో హెల్త్ క్యాంపులు లేదా ఆస్పత్రి సేవలకు సంబంధించిన అప్‌డేట్‌ల కోసం ట్రీట్‌మెంట్ రేంజ్ హాస్పిటల్ వెబ్‌సైట్ ( Visit Our Website : https://treatmentrangehospitals.com/) ను సందర్శించండి లేదా హెల్ప్‌లైన్‌ను సంప్రదించండి.