Wrinkles : ముఖంపై ముడతలు పోవాలంటే ఇలా చేసి చూడండి..

అర టీ స్పూన్‌ తేనెకు ఒక టీ స్పూను బియ్యం పొడిని కలిపి ఆ పేస్ట్‌ని చర్మం మీద పడిన గీతలపై రాసుకోవాలి. అరగంట తర్వాత ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా ముఖంపై ముడతల

Face (1)

Wrinkles : మారుతున్న ఆహారపు అలవాట్లు, వాతావరణ కాలుష్యం కారణంగా ఇటీవలి కాలంలో చిన్నవయస్సు వారిలో చర్మం తేజస్సును కోల్పోవటంతోపాటు, ముడతలు రావటం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. తక్కువ వయస్సులోనే ఇలా మొఖంపై వచ్చే ముడతల కారణంగా ఎదువారు వారిని చూసినప్పుడు ఎంతో ఎక్కువ వయస్సు కలిగిన వారిగా కనిపిస్తుంటారు. ఇంటి నుండి బయటకు వెళ్ళే సమయంలో ముఖంపై దుమ్ము,దూళ్ళి పడటం, ఎండ సమయంలో వేడి సూర్యకిరణాలు పడటం వల్ల చర్మం నిగారింపును కోల్పోతుంది. చాలా మంది ఇలాంటి సందర్భాల్లో మార్కెట్లో వివిధ రకాల కంపెనీల క్రీములను వాడుతుంటారు. అయితే వాటి వల్ల ముఖంపై ముడతలు పోకు పోను వివిధ రకాల చర్మసంబంధిత సమస్యలను కొని తెచ్చుకోవాల్సి వస్తుంది.

అయితే సాధారణ పద్దతిలో గృహ చిట్కాల ద్వారా ముఖ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. ముఖంపై ముడతలు తొలగించేందుకు నేరేడు పండ్లు చక్కగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. నేరేడు పండులో విటమిన్ సి, ఐరన్, క్యాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్ లు ఉంటాయి. నేరేడు పండ్లను తినడం వల్ల రక్త శుద్ది జరిగి ముఖం నిగనిగలా కాంతివంతంగా వెలుగుతుంది. రోజూ నేరుడు పండ్లను తినడం వల్ల చర్మంపై ముడతలు, మెటిమలు వంటివి రాకుండా చూడవచ్చు. నేరేడులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేస్తాయి.

అర టీ స్పూన్‌ తేనెకు ఒక టీ స్పూను బియ్యం పొడిని కలిపి ఆ పేస్ట్‌ని చర్మం మీద పడిన గీతలపై రాసుకోవాలి. అరగంట తర్వాత ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా ముఖంపై ముడతలు పోతాయి. ఇక బొప్పాయి పైతొక్కును ముఖంపై రబ్‌ చేసి అరగంట తర్వాత నీటితో కడుక్కోవాలి. ముడతలు పోగొట్టడంతోపాటు వుంచి టోనర్‌గా కూడా ఉపయోగపడుతుంది. బాదం నూనెను ముడతలు ఉన్నచోట కింది నుంచి పై వైపునకు రాసి రాత్రంతా ఉంచుకుని మర్నాడు ఉదయం గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. దీని వల్ల కూడా ముఖంపై ముడతలు పోతాయి.

ఇక ఒక టేబుల్ స్పూన్ చల్లని పాలల్లో 3 నుంచి 4 చుక్కల నిమ్మరసం కలిపి ముడతలు పడ్డ ప్రదేశంలో రాత్రి పడుకునే ముందు రాసుకోవాలి. తరువాత రోజు ఉదయం వేడి నీటితో ముఖాన్ని కడిగి మెత్తని టవల్ తో తుడుచుకోవాలి. మరోసారి అదే మిశ్రమాన్ని వ్యతిరేక దిశలో రబ్‌ చేసి అరగంట పాటు ఉంచి ముఖాన్ని కడగాలి. ఇలా కొన్నిరోజులు చేయడం వల్ల ముఖంపై ఉన్నముడతలుపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది.