Type 2 diabetes sufferers can keep their sugar levels under control by consuming these foods!
Type 2 Diabetes : టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతుంటే ఆహారంలో కొన్ని రకాల మార్పులు చేయటం ద్వారా దానిని నియంత్రణలో ఉంచుకోవచ్చు. డయాబెటీస్ బాధితులు ఆహార వేళలను కచ్చితంగా పాటించాలి. ఒకేసారి ఎక్కువ మొత్తంలో తినకుండా మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ తింటూ ఉండాలి. దీనివల్ల శరీరంలో చక్కెర స్థాయిలు ఒకేసారి పెరగడం లేదా ఒకేసారి తగ్గడం వంటి పరిణామాలు చోటు చేసుకోవు.
టైప్ 2 డయాబెటీస్ రోగులకు అధిక ఫైబర్ ఆహారం అవసరం. ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. కీరదోశ, టమోటాలు, ముల్లంగి, బొప్పాయి, పీయర్, పుచ్చకాయ చిన్న ముక్క, యాపిల్, ఆరెంజ్, సొరకాయ వంటివి రోజూ తీసుకోవచ్చు. సలాడ్‌లలో దోసకాయలు, టమోటాలు, క్యారెట్లు, బేబీ కార్న్ మరియు బచ్చలికూర మరియు బ్రోకలీ వంటి కొన్ని ఆకు కూరలు కూడా తీసుకోవాలి.
టైప్ 2 మధుమేహులు తీసుకోవాల్సిన ఆహారాలు ;
నేరేడు పండ్లు ;
టైప్ 2 డయాబెటిస్ రోగులకు నేరేడు పండ్లు ఎంతో మేలు కలిగిస్తాయి. ఈ పండు ఇన్సులిన్ చర్య మరియు సున్నితత్వాన్ని పెంచుతుంది, ఇది అధిక రక్తంలో చక్కెరను తగ్గించడమే కాకుండా, కంట్రోల్ లో ఉంచేందుకు సహాయపడుతుంది. వీటిని పచ్చిగా లేదంటే పెరుగుతో కలిపి తీసుకోవచ్చు. ఇందులో విటమిన్-సి, విటమిన్-ఎ, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరానికి, చిగుళ్లకు మేలు చేస్తుంది. నేరేడు పండ్లు, వెనిగర్ తీసుకోవడం వల్ల శరీరంలోని బ్లడ్ సుగర్ స్థాయిలు అదుపులో ఉంటాయి. రోజూ బ్రేక్‌ఫాస్ట్‌కు 15 నిమిషాల ముందు ఒక టీ స్పూన్ జామూన్ వెనిగర్‌ను అర గ్లాసు నీటిలో వేసుకుని తాగాలి.
మెంతికూర, మెంతులు ;
టైప్ 2 డయాబెటిస్ పేషెంట్లకు మరో అద్భుత ఆహారం మెంతికూర, దీనిని ‘మేథి థానా’ అని కూడా అంటారు. అవి కరిగే ఫైబర్‌లో పుష్కలంగా ఉన్నందున మధుమేహాన్ని నిర్వహించడంలో సహాయపడతాయి, ఇది జీర్ణక్రియ, కార్బోహైడ్రేట్ల శోషణను మందగింపచేయటం ద్వారా రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది. మెంతి గింజలను పొడిని తయారు చేసి మీ భోజనంలో చేర్చడం. ఇందులో ఫైవర్ శాతం ఎక్కువ. ఇది జీర్ణక్రియను మందగించేలా చేస్తుంది. ఇది శరీరంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా నివారిస్తుంది. మెంతులను పొడి రూపంలో తీసుకోవచ్చు లేదా నీటిలో నానబెట్టుకుని తాగొచ్చు. రోజు రెండు టేబుల్ స్పూన్ల మెంతులను ఆరు గ్లాసుల నీటిలో వేసి నానబెట్టుకోవాలి. ఆ నీటిని ఉదయం వేళల్లో తాగండి.
దాల్చిన చెక్క;
దాల్చినచెక్క టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో గ్లూకోజ్ మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరుస్తుంది. దాల్చిన చెక్కలను నీటిలో వేసి మరిగించటం ద్వారా , లేదంటే టీలో చేర్చడం ద్వారా సులభంగా ఆహారంలో చేర్చుకోవచ్చు.
జాక్‌ఫ్రూట్ పిండి ;
తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కారణంగా టైప్ 2 డయాబెటిస్ విషయానికి వస్తే జాక్‌ఫ్రూట్ పిండి యొక్క చికిత్సా సామర్థ్యాన్ని అనేక అధ్యయనాల్లో నిరూపితమైంది. ఈ పిండితో మీరు చపాతీ, అప్పం, రోటీ మరియు కుకీలను కూడా సులభంగా తయారు చేసుకోవచ్చు.
వీటితో పాటుగా ప్రోటీన్లు, హెల్తీ కొవ్వులు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల మీ రక్తంలో షుగర్ లెవెల్స్ సమతుల్యంగా ఉండటంతో పాటుగా స్వీట్స్ తినాలనే కోరిక కూడా తగ్గుతుంది. షుగర్ నియంత్రణలో ఉండటానికి ఆహారం ఎంత అవసరమో.. వ్యాయామం కూడా అంతే అవసరం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా మీ కేలరీలను బర్న్ చేయడంతో పాటుగా మీకు శక్తి కూడా లభిస్తుంది.