కరోనా నివారణకు కొత్త డ్రగ్.. యాంటీబాడీ థెరపీతో లైఫ్ సేవ్!

UK scientists Trial Drug Prevent Infection Covid : కరోనావైరస్ వ్యాధి వ్యాప్తిని నివారించే కొత్త డ్రగ్‌ను యూకే సైంటిస్టులు తయారుచేస్తున్నారు. ఈ కొత్త డ్రగ్ అందుబాటులోకి వస్తే.. చాలా మంది ప్రాణాలను కరోనా నుంచి కాపాడుతుందని నిపుణులు అంటున్నారు. యాంటీబాడీ థెరపీ కరోనా వ్యాప్తికి వ్యతిరేకంగా తక్షణ రోగనిరోధక శక్తిని అందిస్తుందని చెబుతున్నారు. ఆసుపత్రి ఇన్‌పేషెంట్లకు అత్యవసర చికిత్సగా ఈ డ్రగ్ ఇవ్వొచ్చునని సైంటిస్టులు అంటున్నారు. కరోనా సోకిన వ్యక్తి ఇంట్లోని ఇతరులకు వైరస్ సోకకుండా ముందు జాగ్రత్తగా ఈ డ్రగ్ ఇంజెక్ట్ చేయొచ్చునని సూచిస్తున్నారు.

తద్వారా వారిని కరోనా బారినపడకుండా కాపాడుకోవచ్చు. యూనివర్శిటీ విద్యార్థులకు వైరస్ వేగంగా వ్యాపించిందని అందుకే వీరికి ఈ డ్రగ్ ఇస్తున్నట్టు తెలిపారు. ఈ డ్రగ్ ట్రీట్ మెంట్ పనిచేస్తుందని నిరూపించగలిగితే.. కరోనా వైరస్‌కు గురయ్యే వారిలో లక్షణాలు అభివృద్ధి చెందడానికి ముందే ఈ డ్రగ్ తీసుకుంటే వారిలో వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చునని వైరాలాజిస్ట్ యూనివర్శిటీ కాలేజీ లండన్ ఆస్పత్రి NHS ట్రస్ట్ (UCLH) డాక్టర్ Catherine Houlihan పేర్కొన్నారు. ఈ డ్రగ్‌ను UCLH ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేశాయి.

ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీతోపాటు, మందులు ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల రెగ్యులేటరీ ఏజెన్సీ వచ్చే వారం బ్రిటన్‌లో డ్రగ్ వినియోగం కోసం ఆమోదం పొందే అవకాశం ఉంది. యాంటీబాడీస్ కాక్టెయిల్ 6 నుంచి 12 నెలల మధ్య కోవిడ్-19 వ్యాధి నుంచి రక్షిస్తుందని బృందం భావిస్తోంది. ట్రయల్ పాల్గొనేవారు ఈ డ్రగ్ రెండు మోతాదులుగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ డ్రగ్ రెగ్యులేటరీ ఆమోదం పొందితే.. గత ఎనిమిది రోజులలో కోవిడ్‌కు గురైన వ్యక్తికి అందించే అవకాశం ఉంటుందని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. అధ్యయనంలోని ఆధారాలను సమీక్షించిన తర్వాత మెడిసిన్స్ రెగ్యులేటరీ ఆమోదించినట్లయితే మార్చి లేదా ఏప్రిల్‌లోనే అందుబాటులోకి రావొచ్చు.