Universal Covid Vaccine : భవిష్యత్తులో మహమ్మారులను అడ్డుకునే యూనివర్శల్ కొవిడ్ వ్యాక్సిన్..!

భవిష్యత్తులో రాబోయే కరోనా వంటి మహమ్మారులను సైతం సమర్థవంతంగా అడ్డుకోగల యూనివర్శల్ కొవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధి చేశారు సైంటిస్టులు. ప్రస్తుతానికి ఈ వ్యాక్సిన్ ను ఎలుకలపై ప్రయోగించారు.

Universal Coronavirus Vaccine : భవిష్యత్తులో రాబోయే కరోనా వంటి మహమ్మారులను సైతం సమర్థవంతంగా అడ్డుకోగల యూనివర్శల్ కొవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధి చేశారు సైంటిస్టులు. ప్రస్తుతానికి ఈ వ్యాక్సిన్ ను ఎలుకలపై ప్రయోగించారు. ఎలుకల్లో కరోనాపై మాత్రమే కాకుండా ఇతర కరోనా వైరస్ జాతులపై కూడా సమర్థవంతంగా అడ్డుకుందని తేలింది. అంతేకాదు.. ప్రమాదకర వేరియంట్ పై పోరాడేందుకు కూడా వ్యాక్సిన్ అద్భుతంగా పనిచేస్తుందని రుజువైంది. రోగనిరోధక శక్తిని కూడా ప్రేరిపించగలదని నిరూపితమైంది. రాబోయే రోజుల్లో ఎలాంటి మహమ్మారులు విజృంభించనున్నాయో ఎవరికి తెలియదు.

2003లో SARS వ్యాప్తితో మొదలైన వైరస్ మహమ్మారులు.. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారిగా పుట్టుకొచ్చాయి. కరోనావైరస్ మ్యుటేషన్లతో ప్రపంచానికి ముప్పుగా మారనున్నాయని అమెరికాలోని నార్త్ కరోలినా యూనివర్శిటీ (UNC) పరిశోధకులు గుర్తించారు. భవిష్యత్తులో కరోనావైరస్ మహమ్మారిని నివారించడంతో పాటు.. ప్రస్తుత SARS-CoV-2 కరోనావైరస్‌ల రక్షణ కల్పించడానికి టీకాను అభివృద్ధి చేసింది పరిశోధక బృందం.. ఈ అధ్యయన ఫలితాలను సైన్స్ జర్నల్‌లో ప్రచురించారు. ఈ టీకా (sarbecoviruses) లక్ష్యంగా చేసుకుని అభివృద్ధి చేసినట్టు తెలిపారు.

కరోనావైరస్ పెద్ద జాతుల్లో sarbecoviruses ఒక భాగంగా చెప్పవచ్చు. గత రెండు దశాబ్దాలలో అత్యంత ప్రాణాంత మహమ్మారులుగా రూపాంతరం చెందాయి. ఈ రకం వైరస్‌ల్లోని mRNA నివారణతో పరిశోధన ప్రారంభమైంది. ప్రస్తుత ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్ల మాదిరిగానే ఉంటుంది. ఒకే వైరస్ mRNA కోడ్‌ను చేర్చడానికి బదులుగా, బహుళ కరోనావైరస్‌ల mRNAని కలిపి పరిశోధనలు చేశారు. ఈ టీకాను ఎలుకలకు ఇచ్చినప్పుడు.. హైబ్రిడ్ వ్యాక్సిన్.. స్పైక్ ప్రోటీన్లపై తటస్థీకరించే యాంటీబాడీలను సమర్థవంతంగా ఉత్పత్తి చేశాయి. వీటిలో B.1.351 వేరియంట్‌తో సంబంధం ఉందని గుర్తించారు.

ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఈ వేరియంట్‌ను మొదట గుర్తించారు. ఈ పరిశోధనలో SARS-CoV, సంబంధిత కరోనావైరస్ సోకిన ఎలుకల డేటా ఉంది. టీకాతో ఎలుకలలో వైరస్ వ్యాప్తి నియంత్రణతో పాటు ఊపిరితిత్తుల దెబ్బతినకుండా నిరోధించినట్టు గుర్తించారు. వచ్చే ఏడాది హ్యమన్ క్లినికల్ ట్రయల్స్‌ ద్వారా లోతుగా అధ్యయనం చేయనున్నట్టు పరిశోధకులు తెలిపారు. ఈ వ్యూహంతో, రాబోయే SARS-CoV-3ని నిరోధించడం సాధ్యపడుతుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు