Baby Born with Covid Antibodies : కరోనా యాంటీబాడీలతో పుట్టిన శిశువు.. ప్రపంచంలోనే ఫస్ట్ టైం అంటున్న డాక్టర్లు

దక్షిణ ఫ్లోరిడాకు చెందిన మహిళ.. కరోనా యాంటీబాడీలు కలిగిన ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇటీవలే ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో మహిళ కరోనా టీకా తొలి డోస్ తీసుకుంది. మెటర్నల్ వ్యాక్సినేషన్ తర్వాత ఆమెకు కరోనా యాంటీబాడీలతో శిశువు జన్మించింది.

దక్షిణ ఫ్లోరిడాకు చెందిన మహిళ.. కరోనా యాంటీబాడీలు కలిగిన ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇటీవలే ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో మహిళ కరోనా టీకా తొలి డోస్ తీసుకుంది. మెటర్నల్ వ్యాక్సినేషన్ తర్వాత  ఆమెకు కరోనా యాంటీబాడీలతో శిశువు జన్మించింది. యాంటీబాడీలతో శిశువు జన్మించడం ఇదే మొదటిసారని Paul Gilbert, Chad Rudnick అనే ఇద్దరు శిశు వైద్యులు పేర్కొన్నారు.

బిడ్డకు జన్మనిచ్చిన మహిళ ఫ్రంట్ లైన్ హెల్త్ కేర్ వర్కర్ గా పనిచేసింది. జనవరిలో తాను 36 వారాల ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు మోడెర్నా వ్యాక్సిన్ తొలి టీకాను తీసుకుంది. మూడు వారాల తర్వాత మహిళ ఆరోగ్యంగా, బలంగా ఉన్న ఆడశిశువుకు జన్మనిచ్చింది. పుట్టిన శిశువు బొడ్డు తాడు నుంచి రక్తాన్ని పరీక్షించిన రీసెర్చర్లు.. యాంటీబాడీలు ఉన్నాయని నిర్ధారించారు.

మెటర్నల్ వ్యాక్సినేషన్ తీసుకోవడం ద్వారా Sars-CoV-2 వైరస్ ఇన్ఫెక్షన్ నుంచి ముందుగానే శిశువుకు రక్షణ అందిందని రీసెర్చర్లు పేర్కొన్నారు. కరోనా వ్యాక్సినేషన్ తర్వాత యాంటీబాడీలతో శిశువు జన్మించడం బహుషా ప్రపంచంలోనే ఇదే మొదటిసారని పాల్ గిల్‌బర్ట్ తెలిపారు. కరోనా టీకా తీసుకున్న తల్లి నుంచి శిశువుకు యాంటీబాడీలు అందాయా లేదా అని బొడ్డుతాడును పరీక్షించినట్టు చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు