Long COVID Symptoms : వ్యాక్సిన్లతో దీర్ఘకాలిక కరోనా లక్షణాలను తగ్గించవచ్చు : కొత్త అధ్యయనం

కరోనా దీర్ఘకాలిక లక్షణాలతో బాధపడేవారిలోనూ కోవిడ్ వ్యాక్సిన్లు తీసుకుంటే లక్షణాల తీవ్రతను తగ్గించవచ్చునని ఓ కొత్త అధ్యయనంలో వెల్లడైంది.

Long COVID Symptoms : కరోనా దీర్ఘకాలిక లక్షణాలతో బాధపడేవారిలోనూ కోవిడ్ వ్యాక్సిన్లు తీసుకుంటే లక్షణాల తీవ్రతను తగ్గించవచ్చునని ఓ కొత్త అధ్యయనంలో వెల్లడైంది. దీర్ఘకాలిక కరోనా లక్షణాలు కలిగినవారికి కోవిడ్ వ్యాక్సిన్లు సురక్షితమేనా? అనేదానిపై కొంతమంది పరిశోధక బృందం అధ్యయనం నిర్వహించింది. ఈ అధ్యయనంలో కరోనా నుంచి కోలుకున్నప్పటికీ లక్షణాలు తగ్గనివారికి వ్యాక్సిన్ ఇచ్చాక తీవ్రత తగ్గినట్టు తేలింది.

చాలామందిలో కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత కూడా వారిలో వారాలు, నెలల తరబడి లక్షణాలు కనిపిస్తున్నాయి. వాటిలో ఎక్కువగా అలసట, నిరంతర దగ్గు, శ్వాస తీసుకోలేకపోవడం, వాసన కోల్పోవడం, కండరాల బలహీనత, ఇన్సోమినియా, మెదడులో నిమ్ము వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ తరహా లక్షణాలు పదిమందిలో ఒకరికి ఎక్కువగా కనిపిస్తున్నాయని అధ్యయనం పేర్కొంది. మూడు నెలలు లేదా అంతకంటే ఎక్కువ రోజులు లక్షణాలు ఉంటున్నాయని గుర్తించారు.

కరోనాతో ఆస్పత్రిలో చేరిన తర్వాత 66 మందిలో 3 నెలల నుంచి 8 నెలల వరకు వారిలో వైరస్ లక్షణాలకు సంబంధించి అధ్యయనం చేశారు. వారిలో 80 శాతం వరకు దీర్ఘకాలిక కోవిడ్ లక్షణాలు ఉన్నాయని గుర్తించారు. వీరిని వ్యాక్సిన్ వేయించుకోని 22 మందితో పోల్చి చూశారు. అందులో 44 మందికి ఫైజర్, బయోంటెక్ లేదా ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్లను ఇచ్చారు. టీకా ఇచ్చిన నెల తర్వాత వారిలో 23శాతం దీర్ఘకాలిక కరోనా లక్షణాల్లో మెరుగుదల కనిపించింది.. మరోవైపు 5.6 శాతం లక్షణాలు తీవ్రత ఎక్కువగా ఉందని గుర్తించారు. వ్యాక్సిన్ తీసుకోనివారితో పోలిస్తే.. తీసుకున్నవారిలో లక్షణాల తీవ్రత తగ్గినట్టు రీసెర్చర్లు గుర్తించారు.

ట్రెండింగ్ వార్తలు