Vegetable Juices : ప్రకృతి సిద్ధంగా లభించే కూరగాయలను మనం ఆహారంలో బాగం చేసుకుంటాం. వివిధ రకాల కూరల రూపంలో వీటిని మనం తయారు చేసుకుని ఆహారంగా తీసుకుంటాం. అయితే వాటితో రసాలు తయారు చేసుకుని తాగినా ఆరోగ్యానికి మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఒక్కో కూరగాయకు ఒక్కో గుణం ఉంది. వీటి వల్ల శరీరం రోగాల బారిన పడకుండా కాపాడు కోవచ్చు. ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయల జ్యూస్ ల గురించి తెలుసుకుందాం…
క్యాబేజీ జ్యూస్ ; రోజు క్యాబేజీ రసాన్ని తాగటం వల్ల నయంకాని జబ్బులను అదుపులో ఉంచుతుంది. కడుపులో అల్సర్లు, పెప్టిక్ అల్సర్ , డ్యుయోడినం అల్సర్, ఇంటెస్టినల్ అల్సర్ , పైల్స్, మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. ముధుమేహం ఉన్నవారికి రక్తంలో చక్కెర అదుపులో ఉంటుంది. ఊబకాయం తగ్గుతుంది. మలబద్ధకం పోతుంది. అసిడిటి తొలగుతుంది. కడుపులో మంటరాదు.
బీట్ రూట్ రసం ; కంటి చూపు మెరుగు కావటానికి , రేచీకటి పోవటానికి రోజు బీట్ రూట్ రసాన్ని తాగాలి. అజీర్ణం, పెప్టిక్ అల్సర్, కడుపునొప్పి మాయం అవుతాయి. శారీరక బలహీనత తొలగుతాయి. రక్తంలో హిమోగ్లోబిన్ మెరుగవుతుంది.
క్యారెట్ జ్యూస్ ; క్యారెట్ లో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. కళ్ళకు చాలా మంచిది. రేచీకటి ఉన్నవారు , దృష్టి లోపం ఉన్న వారు రోజు క్యారట్ రసాన్ని తాగాలి. క్యాన్సర్ కణాలను నిరోధించే శక్తి క్యారట్ లో ఉంది. మలబద్ధకం, లివర్ సమస్యలు, స్త్రీలకు రుతుక్రమ లోపాలు, అసిడిటి, వంట్లో చెడు కొలెస్ట్రాల్ పెరగటం , కొవ్వు చేరటం , వంటివన్నీ క్యారట్ రసం తాగటం వల్ల తొలగిపోతాయి. నిద్రపట్టక ఇబ్బంది పడేవారు క్యారట్ రసాన్ని తాగటం మేలు.
కీర దోసకాయ జ్యూస్ ; అన్ని రకాల ఉదర సమస్యలు, బానపొట్ట, అల్సర్, ఆకలి లేకపోవటం, మధుమేహం , శరీరంలో వేడి అధికంగా ఉన్న , కంటి సమస్యలు, పురీషనాళంలో వేడి, ఫైల్స్, రక్తంలో ఎక్కవగా సోడియం, సాల్ట్ , యూరియా, ఉన్నా, మోకాళ్ళ నొప్పులు, చెమటలు పట్టటం వంటివి ఉన్నప్పుడు కీరదోసకాయ రసాన్ని తాగటం మంచిది. అధిక బి.పి , నేద్రలేమి ఉన్నవారు కీర దోసకాయను ఆహారంగా తీసుకోవాలి.
ఉల్లిగడ్డ జ్యూస్ ; ఉల్లిగడ్డలో యాంటి బయాటిక్ గుణం ఉంది. కత్తి గాయమైన చోట ఉల్లిగడ్డ రసం రాయవచ్చు. గాయం త్వరగా నయం అవుతుంది. రక్తాన్ని శుభ్రపరుస్తుంది. అజీర్ణం, జలుబు, శ్లేష్మం రావటం, కంటి జబ్బులు, గ్యాస్, మదుమేహాన్ని తగ్గిస్తుంది. వంట్లోని చెడు కొలెస్ట్రాల్ తొలగిస్తుంది.
బూడిద గుమ్మడి కాయ జ్యూస్ ; అధిక బరువు , ఊబకాయం, బానపొట్ట శరీరంలో అధిక వేడి వంటి సమస్యలకు బూడిద గుమ్మడి రసాన్ని తాగాలి. దీర్ఘకాలికి మలబద్ధకం , అధిక అసిడిటి, కిడ్నీలలో రాళ్ళు, పొట్టనొప్పి, స్త్రీలకు రుతుక్రమం, అధిక రక్త స్రావం, వంటివి బూడిద గుమ్మడి కాయ రసం తాగటం వల్ల తొలగిపోతాయి.
టమాటా జ్యూస్ ; టమాటా రసం తాగటం వల్ల వంట్లోని వేడి తగ్గుతుంది. ముఖ వర్చస్సు పెరుగుతుంది. వారం రోజుల పాటు టమాటా రసం ఒక కప్పు మేర తాగితే ముఖంపై మొటిమలు పోతాయి. మలబద్దకం, మూత్ర విసర్జనలో సమస్యలు తొలగుతాయి.