చిహ్నాలే అక్షరాలా? : సింధు లోయ లిపి emojis లాంటిదా? 

  • Publish Date - January 13, 2020 / 07:18 AM IST

సింధు లిపి (హరప్పా లిపి) అనేది సింధు లోయ నాగరికతకు సంబంధించిన చిహ్నాల సముదాయంగా చరిత్ర చెబుతోంది. ఈ లిపి క్రీస్తు పూర్వం 3500 నుంచి క్రీ.పూ 2000 వరకు ప్రాచుర్యంలో ఉంది. ఈ చిహ్నాలు ఉన్న శాసనాలు అత్యంత చిన్నవిగా ఉండేవి. ఎన్నో పరిశోధనలు చేసినా ఎంతగా లోతుగా పరిశీలించిన సింధు లిపి ఇంకా మిస్టరీగానే ఉండిపోయింది. సింధు లోయ నాగరికతకు చెందిన ప్రజలు ఎలా మాట్లాడేవారు.. వారి లిపి ఎలా ఉండేది అనే అంశాలు ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయాయి.

అక్షరాస్యులు కారని చరిత్ర చెబుతుంటే ఇలా శాసనలపై ఎలా చిహ్నాలను ఎలా చెక్కేవారు అనేది అంతుచిక్కలేదు. సింధు లోయ లిపికి సంబంధించి ఇటీవల కోల్ కతా కు చెందిన ఓ స్వతంత్ర పరిశోధకురాలు రీసెర్చ్ చేశారు. తన పరిశోధనలో సింధు లోయ అక్షర నిర్మాణం, వాటి అకృతులు నేటి తరానికి నచ్చిన ఎమోజీల మాదిరిగా ఉన్నట్టు చెబుతున్నారు. చారిత్రక సింధు లోయ కళాఖండాలను గుట్టును ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు. ఈ విషయంలో తన రీసెర్చ్ లో సింధు లిపికి సంబంధించి విధానాన్ని ఆమె ప్రస్తావించారు.

కాదని నిరూపిస్తే 10వేల డాలర్లు :
సింధు లిపి చదివే విధానం ఎక్కువగా కుడి నుంచి ఎడమకు శాసనలపై చెక్కినట్టుగా ఉందని, కొన్ని సింబల్స్ మాత్రం అంకెల మాదిరిగా ఉన్నట్టు తెలిపారు. కానీ, ఈ లిపి.. మనం చదివే అల్ఫాబెట్ సౌండింగ్ దగ్గరిగా ఉందా? అనేది పెద్ద ప్రశ్నలుగా మిగిలిపోయాయి. ఇది ఏ భాష లేదా భాషలను ఎన్కోడ్ చేసింది? హరప్పన్స్ అని కూడా పిలిచే సింధు లోయ ప్రజలు అక్షరాస్యులు కాదని ఒక సమూహం పరిశోధకులు వివాదాస్పదంగా పేర్కొన్నారు. దీనిపై ఒక పరిశోధక బృందం పోటీ పెట్టింది.తమ సిద్ధాంతాన్ని ఖండించగల ఎవరైనాసరే వారికి 10వేల డాలర్లు చెల్లించనున్నట్టు ప్రకటించారు.

కోల్‌కతాకు చెందిన బహతా అన్సుమాలి ముఖోపాధ్యాయ, ఇప్పుడు బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. సింధు లిపి నిర్మాణంపై ఆమె స్వతంత్ర పరిశోధన చేస్తున్నారు. జూలైలో నేచర్-బ్రాండెడ్ జర్నల్ పాల్గ్రావ్ కమ్యూనికేషన్స్‌లో ప్రచురించారు. 38 ఏళ్ల ముఖోపాధ్యాయ సింధు లిపితో ముడిపడి ఉన్న చిక్కును పరిష్కరించడానికి తన ఆసక్తిని తెలియజేశారు. ప్రస్తుత పరిశోధనలకు ఆమె పరిశోధనలు ఎలా దోహదపడతాయో వివరించారు. ఈ లిపిని రాసే విధానం, చిహ్నా నమూనాలు చూస్తే ఇతర భాషల లిపితో పోలికలు ఉన్నట్టు ఆమె గుర్తించారు.

ధ్వనితో కాదు.. చిహ్నాల అర్థంతోనే:
సింధు లిపిని ధ్వనిపూరితంగా అక్షరాల్లో రాయలేమని ముఖోపాధ్యాయ రుజువు చేశారు. ఇంగ్లీష్ అల్ఫాబెట్ సౌండ్స్ మాదిరిగా ఈ చిహ్నాలు అక్షరాల రూపంలో ఉండవని అన్నారు. ధ్వనిపరంగా పలికే పదాలు కాదని, కేవలం చిహ్నాల అర్థం ఆధారంగా మాత్రమే అర్థం చేసుకోవడం వీలు అవుతుందని ఆమె గుర్తించారు. దీన్నే లోగో గ్రాఫిక్ అని కూడా పిలుస్తారని అన్నారు. ప్రస్తుత కాలంలో వాట్సాప్ ఎమోజీలు ఎలా అయితే ఎమోషన్స్, క్రయింగ్, లాఫింగ్ వంటి ఎక్స్ పర్షన్స్ తెలిపే విధంగా ఉన్నాయో అప్పటి సింధు లిపి కూడా అలాగే అర్థవంతంగా వేర్వేరు చిహ్నాలతో ఉన్నట్టుగా తెలిపారు.