Watermelon Seeds : రక్తపోటును తగ్గించి, రక్తంలో చక్కెర నిల్వలను నియంత్రించే పుచ్చగింజలు!

పుచ్చకాయ గింజలు పెద్ద మొత్తంలో మోనోశాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటాయి. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటాయి. పుచ్చకాయ గింజలను తింటే శరీరం తక్షణ శక్తిని పొందుతుంది.

Watermelon Seeds : పుచ్చకాయ ముక్కలను తిని గింజలను పడేస్తూ ఉంటాం. అయితే గింజలలో అనేక పోషక విలువలు ఉన్నాయి. పుచ్చకాయ గింజల్లో విటమిన్స్‌తో పాటు మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, పాస్పరస్, కాపర్, జింక్, మాంగనీస్ సమృద్ధిగా ఉంటాయి. వీటిలో విటమిన్-బి అధికంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల గుండె జబ్బుల ముప్పు నుంచి బయటపడొచ్చు. ఈ గింజలను ఆహారంగా తీసుకోవడం వల్ల మూత్ర సంబంధ ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడతాయి. జ్ఞాపకశక్తి పెరగడానికి, ఏకాగ్రతను పెంపొందించడానికి, కండరాల కదలికల క్రమబద్ధీకరణలో తోడ్పడతాయి.

పుచ్చకాయ మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో పనిచేస్తుంది. ఈ గింజలను నీటిలో వేసి మరిగించి టీ తాగడం వల్ల కిడ్నీలో ఏర్పడిన రాళ్లు కరిగిపోతాయి. పుచ్చకాయ గింజల్లో ఉండే ప్రోటీన్, అమినో యాసిడ్స్ రక్తపోటు సమస్యను తగ్గించడంలో సహాయపడతాయి. పుచ్చకాయ గింజలు కణజాలాన్ని రిపేర్ చేయడం ద్వారా కండరాలను ఆరోగ్యవంతం చేస్తాయి. కండరాల నొప్పిని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. పుచ్చకాయ గింజల్లో ఎల్ సిట్రులిన్ సమృద్ధిగా ఉండుట వలన కండరాలు బలంగా ఉండేందుకు దోహదపడతాయి.

పుచ్చకాయ గింజలు పెద్ద మొత్తంలో మోనోశాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటాయి. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటాయి. పుచ్చకాయ గింజలను తింటే శరీరం తక్షణ శక్తిని పొందుతుంది. ఈ విత్తనాలు హిమోగ్లోబిన్‌కు కూడా మేలు చేస్తాయి. రక్తంలో చక్కెర నిల్వలను నియంత్రిస్తాయి. పుచ్చ గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి తర్వాత ఆరబెట్టుకోవాలి. ఆ తరువాత వీటిపైనున్న పొట్టును తీసి తింటే చాలా మంచిది. అధిక బరువు, ఊబకాయం సమస్యతో బాధపడుతుంటే పుచ్చకాయ గింజలు ఉపయోగపడుతాయి.

వీటిని మీరు సలాడ్‌లు, కూరగాయలు, స్నాక్స్‌లో కలిపి తీసుకోవచ్చు. కంటిజ‌బ్బుల‌కు కూడా పుచ్చ‌కాయ విత్త‌నాలు బాగ ప‌నిచేస్తాయి. వేసవికాలంలో డీహైడ్రేషన్ సమస్యను నివారించవచ్చు. పుచ్చకాయ గింజలలో పురుషుల వీర్య కణాల ఉత్పత్తి పెంచే ఔషధ గుణాలున్నాయి. శరీరంలోని వ్యర్ధాలను బయటికి పంపిస్తుంది. మెద‌డు ప‌నితీరు మెరుగ్గా ఉండాలంటే పుచ్చ‌కాయ విత్త‌నాల‌ను రోజూ తినాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు