Cancer Diagnosis : క్యాన్సర్ నిర్ధారణకు మార్గాలివే!

హార్మోన్లస్ధాయిల్లో కలిగే మర్పుల వల్ల గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దీనిని ఎండో మెట్రియల్ క్యాన్సర్ అని కూడా అంటారు. పాప్ టెస్ట్, ట్రాన్స్ వెజైనల్ అల్ట్రాసౌండ్ పద్ధతి ద్వారా ఈ క్యాన్సర్ ను నిర్ధారించవచ్చు.

cancer diagnosis

Cancer Diagnosis : క్యాన్సర్ అనేది శరీరంలోని కొన్ని కణాలు అనియంత్రితంగా పెరిగి శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించే ఒక వ్యాధి. మానవ శరీరంలో ఎక్కడైనా క్యాన్సర్ ప్రారంభం కావచ్చు. నిజానికి మానవ శరీరంలోని కణాలు పెరుగుతాయి. కణ విభజన అనే ప్రక్రియ ద్వారా శరీరానికి అవసరమైన కొత్త కణాలు ఏర్పడతాయి. కణాలు పాతబడినప్పుడు లేదా దెబ్బతిన్నప్పుడు అవి చనిపోతాయి. వీటి స్థానంలో కొత్త కణాలు ఏర్పడతాయి. అయితే కొన్నిసార్లు ఈ క్రమబద్దమైన ప్రక్రియ విచ్ఛిన్నమవుతుంది. దీంతో అవసరం లేని సమయంలో అసాధారణమైన లేదా దెబ్బతిన్న కణాలు పెరుగుతాయి. ఈ కణాలు కణితులు ఏర్పడేలా చేస్తాయి. ఇవి గడ్డలుగా ఉంటాయి. ఈ కణితులు క్యాన్సర్ కావచ్చు కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ కాకపోవచ్చు కూడా.

క్యాన్సర్ నిర్ధారణ ఇలా ;

రొమ్ము క్యాన్సర్ ; రొమ్ములో గడ్డల్లాంటివి తగలడం , రొమ్ముల పరిమాణంలో తేడావంటి పలు లక్షణాలు ఈ క్యాన్సర్ లో కనిపిస్తాయి. మమో గ్రామ్, క్లినికల్ బ్రెస్ ఎగ్జామ్ బ్రెస్ సెల్ఫ్ ఎగ్జామ్ చేసుకోవటం ద్వారా గుర్తించవచ్చు.

సర్వైకల్ క్యాన్సర్ ; ఇది హ్యూమన్ పాపిలోమా వైరస్ వల్ల వస్తుంది. ఈ క్యాన్సర్ 40 నుండి 60 ఏళ్ల మధ్య వయసు వారిలో ఎక్కువగా వస్తుంది. పాప్ స్మియర్ టెస్ట్, పెల్విక్ ఎగ్జామినేషన్, బయాప్సీ విధానాల ద్వారా ఈ క్యాన్సర్ నిర్ధారించవచ్చు.

గర్భాశయ క్యాన్సర్ ; హార్మోన్లస్ధాయిల్లో కలిగే మర్పుల వల్ల గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దీనిని ఎండో మెట్రియల్ క్యాన్సర్ అని కూడా అంటారు. పాప్ టెస్ట్, ట్రాన్స్ వెజైనల్ అల్ట్రాసౌండ్ పద్ధతి ద్వారా ఈ క్యాన్సర్ ను నిర్ధారించవచ్చు.

కొలెరెక్టల్ క్యాన్సర్ ; ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ , ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద తయారు చేసిన మాంసాహారం తినటం, వంటి అంశాలు ఈ క్యాన్సర్ కు దోహదం చేస్తాయి. ఫీకల్ ఆకల్ట్ బ్లడ్ టెస్ట్ లేదంటే ఫికల్ ఇమ్మునోకెమికల్ టెస్ట్, స్టూల్ డీఎన్ఏ టెస్ట్, కోలొనోస్కోపీ ద్వారా ఈ క్యాన్సర్ ను గర్తించ వచ్చు.