Star Fruit
Star Fruit : మార్కెట్లో లభించే పండ్ల రకాలలో స్టార్ ఫ్రూట్ ఒకటి. వేసవిలో అరుదుగా కనిపిస్తుంది. ఈ పండ్ల ధర తక్కువగానే ఉంటుంది. స్టార్ ఫ్రూట్ పండ్లు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో విరివిగానే దొరుకుతున్నాయి. నక్షత్ర ఆకారంలో కనిపించే ఈ పండు రసభరితంగా తినడానికి రుచిగా బాగుంటుంది. అందుకే దీన్నినేరుగా తింటుంటారు . ద్రాక్ష లాగానే మెరుపుదనంతో నిండి ఉంటాయి. బాగా పండిన పండ్లు పసుపురంగులోకి మారి తియ్యగా ఉంటాయి. పచ్చి పండ్లు పుల్లగా ఉంటాయి.
పచ్చి స్టార్ ఫ్రూట్ అయితే కాస్త పుల్లగా గ్రీన్ యాపిల్ మాదిరిగా ఉంటుంది. సాధారణంగా ఇందులో తియ్యగా ఉండేవీ, కాస్త పుల్లగా ఉండేవీ రెండు రకాలున్నాయి. తియ్యనివి వేసవి నుంచి శీతాకాలం వరకూ కాస్తే పుల్లనివి వేసవి చివర నుంచి చలికాలం మధ్య వరకూ మాత్రమే కాస్తాయి. స్టార్ ఫ్రూట్‌ను తినడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం…
యాంటీ ఆక్సిడెంట్లు, పీచు, విటమిన్- సి పుష్కలంగా ఉండే ఈ పండ్లు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. మలబద్ధకాన్ని నివారిస్తాయి. కామెర్లనీ తగ్గిస్తాయి. ముఖ్యంగా వేసవి వేడిని తగ్గించి వడదెబ్బ తగలకుండా కాపాడతాయి. పాలిచ్చే తల్లులు తింటే పాలు బాగా పడతాయి. స్టార్ ఫ్రూట్‌లో అనేక విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఐరన్, మెగ్నిషియం, ఫాస్ఫరస్, జింక్, కాల్షియంలు అధికంగా ఉంటాయి.
స్టార్ ఫ్రూట్స్ తినటం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. చర్మం సురక్షితంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలసటనీ అజీర్తినీ జలుబు, ఫ్లూ జ్వరాల్నీ నివారిస్తాయి. స్టార్ ఫ్రూట్ లో విటమిన్ ఎ, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గర్బిణీతో పాటు, కడుపులో పెరిగే బొడ్డకు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కంటి చూపును మెరుగుపరుస్తుంది. గర్భిణీలో ఆకిలిన పెంచుతుంది.
అధిక బరువు తగ్గాలనుకునే వారికి ఈ ఫ్రూట్ ఎంతగానో పనిచేస్తుంది. వీటిలో ఉండే అనేక బి విటమిన్లు, ఫైబర్ బరువును తగ్గించేందుకు సహాయ పడతాయి. జీర్ణాశయంలో ఉండే అల్సర్లను నయం చేస్తాయి. స్టార్ ఫ్రూట్‌లలో పొటాషియం అధికంగా ఉంటుంది. అందువల్ల హైబీపీ తగ్గుతుంది. బీపీ అదుపులో ఉంటుంది. హార్ట్ ఎటాక్‌లను రాకుండా నివారించవచ్చు. స్టార్ ఫ్రూట్‌లను తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణశక్తి పెరుగుతుంది.
ఈ పండ్లలో అనేక వృక్ష సంబంధ సమ్మేళనాలు ఉంటాయి. అందువల్ల వీటిని తింటే వాపులు తగ్గుతాయి. లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. స్టార్ ఫ్రూట్‌లో బీటా కెరోటీన్ అధికంగా ఉంటుంది. ఇది క్యాన్సర్ రాకుండా చూస్తుంది. క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటుంది. శరీరంలోని బ్యాక్టీరియా మరియు వైరస్ వంటివి అటాక్ కాకుండా నివారిస్తుంది. . యాంటీఆక్సిడెంట్స్ క్యాన్సర్ నివారిణిగా సహాయపడుతాయి.
స్టార్ ఫ్రూట్ లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, మలబద్దకం నివారిస్తుంది, ప్రేగులను శుభ్రం చేస్తుంది. కొలెస్ట్రాల్ శరీరంలో చేరకుండా నివారిస్తుంది. కోలన్ క్యాన్సర్ నివారిస్తుంది. ప్రేగులో మ్యూకస్ మెంబరెన్స్ ఏర్పడకుండా దోహదపడుతుంది. పెక్టిన్ కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది. ఆకలి తగ్గిస్తుంది.