Lung Cancer : పురుషులలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రారంభ సంకేతాలు ఇవే ?

బరువు తగ్గాలన్న ప్రయత్నం చేయకుండానే అనుహ్యంగా ఒకేసారి బరువు తగ్గితే ఆలోచించుకోవాల్సిందే. ఎందుకంటే ఊహించని విధంగా బరువు తగ్గడం అనేది ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో సహా వివిధ ఆరోగ్య సమస్యలకు ప్రారంభ సంకేతంగా అనుమానించాలి.

Lung Cancer

Lung Cancer : భారతదేశంలో పురుషులలో ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. క్యాన్సర్లలో రెండవ స్ధానంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉంది. 80% మంది పొగాకు వాడకం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ బారినపడుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ధూమపానం చేయని స్త్రీలు సైతం ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌ లక్షణాలలో ముఖ్యంగా నిరంతర దగ్గు, ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గొంతు బొంగురుపోవడం , స్వరంలో మార్పు, కఫంలో రక్తం పడడం, మెడ వాపు, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

READ ALSO : Protecting Your Lungs : ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించటం తప్పనిసరి !

ఊపిరితిత్తుల క్యాన్సర్ అవగాహన మాసంగా ప్రతి ఏడాది నవంబర్‌లో నిర్వహిస్తారు. 1995 నుండి, ఊపిరితిత్తుల క్యాన్సర్ నిర్మూలనకు కృషి చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం జరుగుతుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ అవేర్‌నెస్ మాసం 2023 థీమ్ గా విద్య, సాధికారత మరియు నిర్మూలనను ఎంచుకున్నారు.

READ ALSO : సిగరెట్ తాగుతున్నారా..! ఇవి తింటే ఊపిరితిత్తులు సేఫ్ _ Best & Healthy Food for Smokers

పురుషులలో ఊపిరితిత్తుల క్యాన్సర్ యొక్క ప్రారంభ లక్షణాలు ;

1. నిరంతర దగ్గు ;

వారం కంటే ఎక్కువ కాలం పాటు నిరంతర దగ్గు వస్తుంటే అనుమానించాల్సిందే. ఇది పొడి దగ్గుగా మొదలై తర్వాత శ్లేష్మం, రక్తం పడటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు మీ ఊపిరితిత్తులు ఆరోగ్యంగా లేవనటానికి సంకేతం.

2. ఛాతీ నొప్పి

దగ్గినప్పుడు, లోతుగా ఊపిరి పీల్చినప్పుడు తీవ్రమయ్యే ఛాతీ నొప్పి వంటి అసౌకర్యం కలిగితే ఏమాత్రం నిర్లక్ష్యం చేయరాదు. ఛాతీ నొప్పి ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు సంకేతం కానప్పటికీ వైద్యుల సూచించే పరీక్షల ద్వారానే నిర్ధారించుకోవాలి. లేదంటే ప్రమాదంలో ఉన్నట్లనే అనుమానించాల్సిందే.

READ ALSO : Omphalocele Covid Patients: కరోనాతో ఊపిరితిత్తులు పాడైతే.. బొడ్డుతాడుతో ట్రీట్‌మెంట్

3. ఒకేసారి బరువు కోల్పోవటం ;

బరువు తగ్గాలన్న ప్రయత్నం చేయకుండానే అనుహ్యంగా ఒకేసారి బరువు తగ్గితే ఆలోచించుకోవాల్సిందే. ఎందుకంటే ఊహించని విధంగా బరువు తగ్గడం అనేది ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో సహా వివిధ ఆరోగ్య సమస్యలకు ప్రారంభ సంకేతంగా అనుమానించాలి. వెంటనే వైద్యులను కలసి తగిన సూచనలు, సలహాలు తీసుకోవాలి. అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి.

4. శ్వాస ఆడకపోవడం

ఊపిరి పీల్చుకోలేకపోవటం, శ్వాస సరిగా ఆడకపోవటం వంటి పరిస్ధితులు ఎదురైతే ఊపిరితిత్తుల సమస్యలకు ముందస్తు హెచ్చరికగా భావించాలి. కలుషితమైన ప్రాంతాలలో గాలి నాణ్యతపై శ్రద్ధ పెట్టాలి. అలాంటి గాలిని పీల్చకుండా నివారించాలి.

READ ALSO : Lung Cancer : ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడే జీవనశైలి మార్పులు !

5. వాయిస్ లో మార్పులు

స్వరంలో , మార్పు, గొంతు బొంగురుపోవడం, గరగర శబ్ధం వంటివి ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో ముడిపడి ఉంటాయి. స్వర తంతువులు , వాయుమార్గం క్యాన్సర్ కణాల పెరుగుదల ద్వారా ప్రభావితమై ఈ మార్పులకు కారణమవుతుంది.

6. దగ్గిన సమయంలో రక్తం పడటం

దగ్గినప్పుడు శ్లేష్మంలో రక్తం పడటం అన్నది ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాలలో తీవ్రమైనది. ఇలా రక్తం పడటం కొన్ని సందర్భాల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్‌ కానప్పటికీ దానిని తేలికగా తీసుకోరాదు.

READ ALSO : Lung Problems In Winte : శీతాకాలంలో ఊపిరితిత్తుల సమస్యలు అధికం! ఈ జాగ్రత్తలు తప్పనిసరి

7. కుటుంబ చరిత్ర, ధూమపానం

ఎలాంటి లక్షణాలు కనిపించనప్పటికీ ఊపిరితిత్తుల క్యాన్సర్ ధూమపానం చేసే కుటుంబ చరిత్ర ఉన్నవారిలో ప్రమాద కారకమవుతుంది. భారతదేశంలో, పొగాకు వాడకం చాలా సాధారణం. దీని వల్ల చాలా మంది ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడుతున్నారు.

లంగ్ క్యాన్సర్ నివారణకు మార్గాలు

ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను నివారించడానికి ధూమపానం, పొగాకుకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయినట్లయితే, మిగిలిన కుటుంబ సభ్యులు జన్యు పరీక్షలు చేయించుకోవటం మంచిది. పొగకు దూరంగా ఉండటం మంచిది. అలాగే పొగతాగే వారికి దూరంగా ఉండాలి.

READ ALSO : Lung Cancer : ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడే జీవనశైలి మార్పులు !

ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కారణాలైన రాడాన్, ఆస్బెస్టాస్, ఆర్సెనిక్, డీజిల్ ఎగ్జాస్ట్ వంటి హానికరమైన పదార్ధాలకు దూరంగా ఉండటం మంచిది. రోజువారిగా బ్రిస్క్ వాకింగ్, రన్నింగ్ ,కొన్ని శ్వాస వ్యాయామాలు ,యోగా వంటివి ఊపిరితిత్తుల క్యాన్సర్ ముప్పును తగ్గించడంలో సహాయపడతాయి. ఊపిరితిత్తులు మరింత సమర్థవంతంగా పనిచేయడానికి ఇవి సహాయపడుతాయి. లక్షణాలను బట్టి నిర్ధారణ కోసం పరీక్షలను చేయించుకోవటం ద్వారా ప్రారంభ దశలోనే క్యాన్సర్ ను గుర్తించ వచ్చు.