Vegetables : ఆరోగ్యానికి దుంపజాతి కూరగాయలు చేసే మేలు ఎంతంటే?..

క్యారెట్లలో అన్ని పొషకాలలో కెల్లా విటమిన్-ఎ ఎక్కువగా ఉంటుంది. విటమిన్-ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది. చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది

Beet Vegetables

Vegetables : మానవులకు కావలసిన పోషకహార పదార్థాలు కూరగాయలలో పుష్కలంగా లభిస్తాయి. అందువలన మనం తీసుకొనే సమతుల ఆహారంలో కూరగాయలు ఎంతో ప్రదాన పాత్ర వహిస్తాయి. కూరగాయలలో ముఖ్యంగా దుంపజాతికి చెందిన కూరగాయాల్లో పోషకవిలువలు అధికంగా ఉంటాయి. అతి తక్కువ ధరలలో లభ్యమవడమే కాకుండా వీటిలో ఉండే విటమిన్లు, ఖనిజ లవణాలు, పిండి పదార్థాలు ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో ఎంతో మేలు చేస్తాయి. దుంపజాతి కూరగాయల్లో ముఖ్యమైనవిగా బీట్ రూట్, క్యారెట్, బంగాళ దుంప, ఉల్లిగడ్డ, చిలగడ దుంప, కంద, చామను చెప్పవచ్చు.

బంగాళదుంప: ఆహార పౌష్టికత పరంగా బంగాళ దుంపలో పిండి పదార్ధాలు ప్రధానమైన ఆహార పదార్ధం. బంగాళ దుంపలో పలు విధాలైన విటమిన్లు ఖనిజ లవణాలు ఉన్నాయి. 150 గ్రాముల బరువుండే ఒక మాదిరి బంగాళ దుంపలో 27 మిల్లీగ్రాముల సి విటమిన్ , 620 మి.గ్రా. పొటాషియం, 0.2 మి.గ్రా. విటమిన్-B 6 మాత్రమే కాకుండా కొద్దిమోతాదులలో థయామిన్, రైబోఫ్లావిన్, ఫోలేట్, నియాసిన్, మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటి పదార్ధాలు లభిస్తాయి. వర్ధమాన దేశాలలో బంగాళాదుంప యొక్క ఆహారపు ప్రాముఖ్యతను చాటి చెప్పడానికి ఐక్య రాజ్య సమితి 2008 సంవత్సరాన్ని అధికారికంగా అంతర్జాతీయ బంగాళాదుంప సంవత్సరం గా ప్రకటించిం

క్యారెట్: క్యారెట్లలో అన్ని పొషకాలలో కెల్లా విటమిన్-ఎ ఎక్కువగా ఉంటుంది. విటమిన్-ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది. చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. ఆరోగ్యం సరిగ్గా లేకపోతే గంటకో క్యారెట్ తినాలి. కంటిచూపును మెరుగుపరిచే బీటా-కెరొటిన్ క్యారెట్లో పుష్కలంగా ఉంటుంది. ఒకవేళ ఆ సమస్య అప్పటికే ఉంటే దానికి చికిత్స చేస్తుంది. క్యారెట్ గుండె పోటును పక్షవాతాన్ని కూడా నివారిస్తుంది. ఎందుకంటే అందులోని యాంటీ ఆక్సిడెంట్స్, కెరొటినాయిడ్స్ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తాయి. అందుకే క్యారెట్ ఓ క్యాన్సర్ పోరాట యోధుడు. ఉత్తమ యాంటీ క్యాన్సర్ ఉధ్యమ కార్యకర్త. నిండుగా ఆరెంజ్ రంగులో నిగనిగలాడే క్యారెట్లు తింటే ఆరోగ్య పరిరక్షణ, ముఖ్యంగా కంటి రక్షణ కలుగుతుంది.

చిలగడ దుంప : దీనినే గణుసుగడ్డ, మొహర్రం గడ్డ, రత్నపు గడ్డ, అని కూడా అంటారు. బంగాళదుంప, కందగడ్డలలో కన్నా చిలగడదుంపలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. చిలగడదుంపల్లో విటమిన్‌ బీ6 ఎక్కువగా ఉంటుంది. రక్తనాళాలు బలంగా ఉండేందుకు తోడ్పడే హోమోసిస్టీన్‌ను విటమిన్‌ బీ6 విడగొడుతుంది. అందువల్ల వీటితో గుండె, రక్తనాళాల సమస్యలు దూరంగా ఉంటాయి. వీటిల్లోని సి విటమిన్‌ రోగనిరోధకశక్తిని పెంచితే, ఇ విటమిన్‌ మన చర్మం ఆరోగ్యంగా, నిగనిగలాడేందుకు తోడ్పడుతుంది.

కంద: ఇది దీర్ఘకాలిక మొక్క. కంద పేరు వినగానే గుర్తు వచ్చేది దురద. కందని తినడానికి ప్రయత్నిస్తే నోరంతా ఒకటే దురద వేస్తుంది. కంద దుంపలో ఉండే కాల్షియం ఆక్సలేట్ అనే రసాయనం కారణంగా కందకి ఆ దురద వచ్చింది. కందలో రెండు రకాలు ఉన్నాయి. తీట కంద, తియ్య కంద. తీట కందని ముక్కలుగా కోసి, నీళ్లల్లో ఉడికించి, ఆ నీళ్లని పారబోస్తే, ఆ దురద పోతుంది. ఒక మోస్తరుగా కేలరీలను కలిగి ఉంటుంది, పొటాషియం, మాంగనీస్, పీచు పదార్థం ఎక్కువ స్థాయిలోనే ఉంటాయి. కొవ్వు, సోడియం తక్కువగా ఉంటాయి. బంగాళ దుంపతో పోలిస్తే దీని గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. కాబట్టి మధుమేహులు అడపదడపా తీసుకోవచ్చు.

ముల్లంగి : ముల్లంగి ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనిని సలాడ్ల కూరగాయగా భావిస్తారు. దుంప లన్నింట్లో తక్కువ శక్తిని కలిగిఉన్నది ముల్లంగే. తాజా దుంపలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. దీని ప్రత్యేకత సలొరాఫేన్ అనే యాంటి ఆక్సైడ్ను కలిగి ఉండటం. ప్రోస్ట్రేట్, రొమ్ము, ఓవరీ, కోలాన్ మొదలైన క్యాన్సర్ల చికిత్సలో సలొరాఫేన్ ప్రముఖపాత్ర వహిస్తుందని కొన్ని పరిశోధనలు తెలుపుతున్నాయి. క్యాన్సర్ కణాలను నశింప చేసే శక్తి వీటికి ఉంది. మహిళల్ని వేధించే మూత్రాశయ ఇబ్బందులు మొదలుకుని క్యాన్సర్లని కట్టడి చేయడం వరకూ వివిధ సమస్యల్ని నియంత్రించగల శక్తి ముల్లంగి దుంపలకు ఉంది, కనుక ముల్లంగి తప్పకుండా తీసుకోవాలి. దీనితో వివధ రకాల వంటలు చేసుకోవచ్చు. రోజుకి ఒక కప్పు ముల్లంగిని సలాడ్‌రూపంలో తీసుకోగలిగితే ‘సి’ విటమిన్‌ పుష్కలంగా అందుతుంది.

ఉల్లిగడ్డ : ఉల్లిలో శరీరానికి అవసరమైన పోషకాలు తక్కువే. కొవ్వు కూడా తక్కువగా ఉంటుంది. కాని కేలరీలు ఎక్కువ. ఉల్లిని అన్ని కూరలలో వాడుతారు. దీని ప్రత్యేకమైన వాసన వంటకాలకు కమ్మదనాన్ని అందిస్తుంది. ఉల్లిరసాన్ని, నెయ్యిని సమభాగాలుగా కలిపి దీనిని ఒక టీస్పూన్ మోతాదుగా మూడుపూటలా తీసు కుంటే శారీరక బలహీనత దూరమవుతుంది. పచ్చి ఉల్లిపాయను రోజువారీగా తీసుకుంటూ ఉంటే మహిళల్లో ఋతుక్రమం సక్రమంగా ఉంటుంది.