Pineapple : పైనాపిల్ తినటం వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఎన్నంటే?

పైనాపిల్ ను తినడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందడం మాత్రమే కాకుండా చర్మ సౌందర్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.

Pineapple

Pineapple : రుచికరమైన పండ్లలో పైనాపిల్ ఒకటి. పైనాపిల్ తినడానికి తీయ్యగా, పుల్లని రుచి కలిగి ఉంటుంది. ఇందులో అధిక మొత్తంలో పొటాషియం, సోడియం నిల్వలు ఉంటాయి. అదే విధంగా వీటిలో విటమిన్స్, ఇతర పోషకాలు కూడా విరివిగా లభిస్తాయి. ఎన్నో పోషక విలువలు కలిగిన పైనాపిల్ ను తినడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను మన సొంతం చేసుకోవచ్చు. పైనాపిల్‌లో ‘సి’ విటమిన్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది మధుమేహం, హృదయసంబంధ వ్యాధులు, క్యాన్సర్‌ కారకాలైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కంటి సమస్యల్ని దూరం చేస్తాయి.

మన శరీరంలో ఏర్పడే అధిక రక్తపోటును నియంత్రించడానికి కూడా పైనాపిల్ ఎంతో కీలకపాత్ర వహిస్తుంది. పైనాపిల్ లో ఉండే బ్రొమిలైన్‌ అనే ఎంజైమ్‌ క్యాన్సర్ పేషెంట్లలో కలిగే దుష్ప్రభావాలను దూరం చేస్తుంది. ఇటీవల పరిశోధనలలో భాగంగా పైనాపిల్ లోని బీటా-కెరోటిన్‌.. ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ నుంచి రక్షిస్తుందని వెల్లడయింది.

మధుమేహం, గుండె పోటు సమస్యలు, దంతాల సమస్యలతో బాధపడేవారికి పైనాపిల్ ఎంతో ప్రయోజనకరం. విపరీతమైన వాంతులతో బాధపడేవారు పైనాపిల్ జ్యూస్ తాగడం వల్ల త్వరగా వాటి నుంచి విముక్తి పొందవచ్చు. బాగా పండిన పైనాపిల్ ను రోజూ తినడం వల్ల ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. అదేవిధంగా బాలింతలు పైనాపిల్ ను తినడం వల్ల పిల్లలకు కావలసినంత పాల ఉత్పత్తి జరుగుతుంది.

పైనాపిల్‌లో నీరు 87.8 గ్రాములు (ప్రతి 100 గ్రాముల పండులో), ప్రొటీన్ 0.4 మి.గ్రా, కొవ్వు 0.1 మి.గ్రా, పిండి పదార్థం 10.8 మి.గ్రా, కాల్షియం 20 మి.గ్రా, పాస్పరస్ 9 మి.గ్రా, ఐరన్ 2.4 మి.గ్రా, సోడియం 34.7 మి.గ్రా, పొటాషియం 37 మి.గ్రా, మాంగనీస్ 0.56 మి.గ్రా, కెరోటిన్ 18 మైక్రోగ్రాములు, శక్తి 46 కిలో కాలరీలు ఉంటాయి.

పైనాపిల్ ను తినడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందడం మాత్రమే కాకుండా చర్మ సౌందర్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు. పైనాపిల్ జీర్ణక్రియ సక్రమంగా పనిచేయడంలో సహాయపడుతుంది. పైనాపిల్ జుట్టు రాలడం తగ్గించడంలో సహాయపడుతుంది. రక్త నాళాల్లో రక్తం గడ్డకట్ట కుండా కాపాడుతుంది. ఆడవారికైతే నెలసరి సక్రమంగా వచ్చేందుకు తోడ్పడుతుంది. పండిన పైనాపిల్ పండును తింటుంటే పళ్ళ నుండి రక్తం కారే స్కర్వే వ్యాధి రాకుండా రక్షణ కలిగిస్తుంది. పూర్తిగా పండని పైనాపిల్ రసం తీసుకుంటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి.

పైనాపిల్‌లోని ఎంజైమ్స్‌ వాపులను, నాసికా సంబంధమైన వ్యాధులను, టైఫాయిడ్‌ని ఉప శమనం చేస్తుంది. పచ్చి పైనాపిల్ రసాన్ని తెగిన గాయా లపై వేస్తే రక్తస్రావం అరికడుతుంది. పచ్చకామెర్ల వ్యాధి, కాలేయ వ్యాధులున్నవారు ప్రతిరోజు ఈ రసాన్ని తాగితే మంచి ఫలితాలన్ని ఇస్తుంది. పైనాపిల్‌లో అమినో యాసిడ్ ట్రైపోటాన్ రిచ్‌గా ఉండటం వల్ల హార్మోన్‌ల ఆరోగ్యానికి మంచిది. న్యూరోలాజిక్ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి పైనాపిల్‌లో ఉండే పోషకాలు ఉపయోగపడతాయి. వీటి ద్వారా పాజిటివ్, మూడ్ హార్మోన్‌లకు శక్తి అందుతుంది. పైనాపిల్ పండు రసాన్ని ముఖానికి రాసుకుని మర్థన చేస్తే ముఖ చర్మం కోమలంగా, అందంగా మారుతుంది. పండులోని ఎంజైములు ముఖ చర్మంలో నశించిన కణాలను తొలగిస్తాయి. అంతే కాకుండా నల్లటి మచ్చలను తొలగిస్తుంది.