Green Tea : గ్రీన్ టీతో చర్మానికి కలిగే ప్రయోజనాలు ఎన్నంటే?

గ్రీన్ టీలోని యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీఆక్సిడెంట్లు ముడతలు వంటి వృద్ధాప్య సంకేతాలను నిరోధిస్తాయి. కళ్ళ చుట్టూ ఏర్పడే నల్లని వలయాలు మరియు ఉబ్బిన కళ్ళు వంటి సమస్యల పరిష్కారం కోసం గ్రీన్ టీని ఉపయోగించడం మంచి ఫలితం ఉంటుంది.

Green Tea

Green Tea : ఇటీవలి కాలంలో గ్రీన్ టీ తాగడం ఆరోగ్యానికి మంచిదన్న ప్రచారం ఊపందుకుంది. ఇదే విషయాన్ని అటు నిపుణులు సైతం అంగీకరిస్తున్నారు. ఆరోగ్యాన్ని మెరుగుపరిచే బయోయాక్టివ్ సమ్మేళనాలు గ్రీన్ టీ లో ఉన్నాయి. గ్రీన్ టీలో ఉండే ఎపిగాల్లోకాటెచిన్ గాలెట్ అనే శక్తివంతమైన సమ్మేళనం అనేక వ్యాధులకు చికిత్స చేసేందుకు తోడ్పడుతుంది. గ్రీన్ టీలో 0 కేలరీలు ఉంటాయి. ఇది జీవక్రియ రేటును మెరుగుపరచడం, శరీర బరువును నియంత్రించడం, మరియు ఇన్ఫ్లమేటరీ గుణాలతో పోరాడడంలో మీకు సహాయపడుతుంది.

ముఖ్యంగా గ్రీన్ టీ వల్ల చర్మానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. గ్రీన్ టీ లోని యాంటీఆక్సిడెంట్లు చర్మ సమస్యలను ఎదుర్కోవడానికి తోడ్పడతాయి. క్రమం తప్పకుండా గ్రీన్ టీ తీసుకుంటే మీ చర్మం మెరుపుదనంతో కూడి ఉంటుంది. చర్మానికి తేమను ఇచ్చి, ఆకర్షణీయంగా మారేలా చేస్తుంది. 100 గ్రాముల గ్రీన్ టీ ఆకులు, అర లీటరు నీటిలో వేయాలి. గది ఉష్ణోగ్రతలో 30 నుండి 40 నిమిషాలు పాటు అలాగే ఉంచాలి. తరువాత వడకట్టి రిఫ్రిజిరేటర్‌లో భద్రపరుకొని అవసరమైనప్పుడు ముఖాన్నిరిఫ్రెష్ చేయడానికి ఈ నీటిని ఉపయోగిస్తే చర్మంపై మొటిమలను తగ్గించడానికి, తిరిగి రాకుండా నిరోధించడానికి సహాయపడుతుంది.

గ్రీన్ టీ ఆకులను చర్మంపై ఉండే మృతకణాలను తొలగించడానికి ఉపయోగించవచ్చు. చర్మంపై మృతకణాలు తొలగించటానికి 1 టీస్పూన్ గ్రీన్ టీ ఆకులలో 3 టీస్పూన్ల పెరుగు కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై రాసి నెమ్మదిగా మసాజ్ చేయండి. 5 నిమిషాలు తరువాత గోరువెచ్చని నీటితో కడగాలి. గ్రీన్ టీలోని యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీఆక్సిడెంట్లు ముడతలు వంటి వృద్ధాప్య సంకేతాలను నిరోధిస్తాయి. కళ్ళ చుట్టూ ఏర్పడే నల్లని వలయాలు మరియు ఉబ్బిన కళ్ళు వంటి సమస్యల పరిష్కారం కోసం గ్రీన్ టీని ఉపయోగించడం మంచి ఫలితం ఉంటుంది.

గ్రీన్ టీ ఆకులను తడిపి తేనెతో కలపండి. ఈ ప్యాక్‌ను మీ ముఖంపై రాసి 20 నిమిషాలు అలాగే ఉంచి తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. గ్రీన్ టీ మరియు తేనె రెండింటిలోని యాంటీఆక్సిడెంట్లు వృద్ధాప్య లక్షణాలను తగ్గించడానికి సహాయపడతాయి. తేనె లోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చర్మాన్ని శుభ్రపరిచి, ఆకర్షణీయంగా చేస్తాయి. గ్రీన్ టీ చర్మానికి సహజ సన్‌స్క్రీన్‌గా పనిచేస్తుంది. ఫ్రీ రాడికల్స్ చర్మ కణాల మధ్య స్థిరపడకుండా నిరోధించడంలో ఇది సహాయపడుతుంది.

ట్రెండింగ్ వార్తలు