Zinc Deficiency : శరీరానికి జింక్ వల్ల ఉపయోగాలు ఇవే?

జింక్ లోపం కారణంగా ఎదుగుదల కుంటుపడుతుంది. వెంట్రుకలు ఊడిపోవటం, గోళ్లు పెళుసుబారటం, చర్మం పొడిబారటం, ఆకలి తగ్గటం, వాసన తగ్గటం, తరచూ జలుబు రావటం, శరీర ఉష్ణోగ్రత మారిపోవటం,

Zinc

Zinc Deficiency : జింక్ అనేది మీ శరీరంలో అనేక కీలక పాత్రలను పోషించే ఒక పోషకం. శరీరం సహజంగా జింక్‌ను ఉత్పత్తి చేయనందున, దానిని ఆహారం లేదా సప్లిమెంట్ల ద్వారా పొందాల్సి ఉంటుంది. జింక్ వల్ల ఆరోగ్యపరంగా ప్రయోజనాలు ఉండగా అదే సమయంలో దాని మోతాదు మించితే కొన్ని దుష్ప్రభావాలు సైతం ఉన్నాయి.

జింక్ ఒక ముఖ్యమైన పోషకంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇది శరీరం ఉత్పత్తి చేయదు. అదే విధంగా నిల్వ చేయదు. ఆహారం ద్వారా మాత్రమే నిరంతరం జింక్ ను శరీరానికి అందించాల్సి ఉంటుంది. సరఫరా పొందాలి. శరీరంలో జరిగే అనేక ప్రక్రియలకు జింక్ అవసరం. జన్యు వ్యక్తీకరణ, ఎంజైమాటిక్ ప్రతిచర్యలు, రోగనిరోధక పనితీరు, ప్రోటీన్ సంశ్లేషణ , DNA సంశ్లేషణ, గాయం మాన్పటానికి జింక్ ఉపకరిస్తుంది.

జింక్ సహజంగా అనేక రకాల మొక్కల మరియు జంతు ఆహారాలలో లభిస్తుంది. అల్పాహారం తృణధాన్యాలు, బేకింగ్ పిండి వంటి వాటిలో లభిస్తుంది. జింక్ సప్లిమెంట్లు రూపంలోకాని, జింక్ అందించే ఇతర బహుళ పోషక పదార్ధాలను కూడా తీసుకోవచ్చు. రోగనిరోధక పనితీరులో దాని పాత్ర కారణంగా, జింక్ తో కొన్ని నాసికా స్ప్రేలు, సహజ జలుబు వంటి చికిత్సలకు కూడా ఉపయోగిస్తున్నారు.

నిజానికి, జింక్ శరీరంలో ఐరన్ తర్వాత రెండవ అత్యంత సమృద్ధిగా ఉండే ట్రేస్ మినరల్. ప్రతి కణంలో ఉంటుంది. జీవక్రియ, జీర్ణక్రియ, నరాల పనితీరు మరియు అనేక ఇతర ప్రక్రియలలో సహాయపడే ఎంజైమ్‌ల కార్యకలాపాలకు జింక్ అవసరత ఉంది. రోగనిరోధక కణాల అభివృద్ధి , పనితీరుకు ఇది కీలకం ఈ ఖనిజం చర్మ ఆరోగ్యం, DNA సంశ్లేషణ మరియు ప్రోటీన్ ఉత్పత్తికి కూడా ప్రాథమికమైనది. కణాల పెరుగుదల మరియు విభజన లో దాని పాత్ర కారణంగా శరీర పెరుగుదల, అభివృద్ధి జింక్‌పై ఆధారపడి ఉంటుంది. రుచి , వాసనకు కూడా అవసరం. జింక్ లోపం వల్ల రుచి, వాసన చూసే సామర్థ్యాన్ని కోల్పోవాల్సి వస్తుంది.

జింక్ లోపం కారణంగా ఎదుగుదల కుంటుపడుతుంది. వెంట్రుకలు ఊడిపోవటం, గోళ్లు పెళుసుబారటం, చర్మం పొడిబారటం, ఆకలి తగ్గటం, వాసన తగ్గటం, తరచూ జలుబు రావటం, శరీర ఉష్ణోగ్రత మారిపోవటం, నిస్సత్తువ, చిరాకు వంటి సమస్యలెన్నో తలెత్తుతాయి. జింక్‌ లోపిస్తే సంతాన సామర్థ్యమూ దెబ్బతినొచ్చు. గర్భిణుల్లో పిండం ఎదుగుదల కుంటుపడొచ్చు. గింజపప్పులు, పప్పుల్లోనూ జింక్‌ ఉంటుంది. జింక్ లోపిస్తే విరేచనాలు, పరాన్నజీవుల ఇన్‌ఫెక్షన్‌, కాలేయ జబ్బు, కిడ్నీ వైఫల్యం వంటి సమస్యలూ జింక్‌ లోపానికి దారితీస్తాయి. మాంసం, చికెన్‌ వంటి వాటిలో జింక్‌ ఎక్కువగా లభిస్తుంది. శరీరంలో జింక్ లోపాన్ని రక్త పరీక్ష ద్వారా గుర్తించవచ్చు. ఆల్కలీన్ ఫాస్ఫటాస్, అల్భుమిన్ స్ధాయిలను బట్టి కూడా జింక్ లోపాన్ని నిర్ధారించవచ్చు.