Overhydration Water : నీళ్లు ఎక్కువగా తాగినా ప్ర‌మాద‌మే.. ఎందుకో తెలుసా?

Overhydration Water : ఏది ఎక్కువైనా ఇబ్బందే.. నీళ్లు తాగమన్నారు కదా అని అదేపనిగా తాగినా లేనిపోని అనారోగ్య సమస్యల బారినపడతారు జాగ్రత్త..

What Happens If You Drink Too Much Water Overhydration Symptoms

Overhydration Water : ఏది ఎక్కువైనా ఇబ్బందే.. నీళ్లు తాగమన్నారు కదా అని అదేపనిగా తాగినా లేనిపోని అనారోగ్య సమస్యల బారినపడతారు జాగ్రత్త.. ఏదైనా మితంగా చేస్తేనే మంచి ఫలితాలు ఉంటాయని అంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. మంచినీళ్లు ఎక్కువగా తాగితే ఓవర్‌హైడ్రేషన్‌ గురవుతారు జాగ్రత్త.. శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. ముఖ్యంగా కడుపులో తిప్పినట్టుగా అవుతుంది.

బతకడానికి నీరు అత్యవసమరే.. అది కూడా సరైన మోతాదులో తాగినప్పుడు మాత్రమే మంచిది. నీళ్లు తాగితే శరీరంలో వేడి బయటకు పోతుంది. ఫలితంగా మెదడు చురుగ్గా పనిచేస్తుంది. మానసిక ఒత్తిడి, ఏమైనా ఆందోళనలు ఉంటే వెంటనే తగ్గిపోతాయి. మనస్సు ప్రశాంతంగా అనిపిస్తుంది. కిడ్నీల్లో రాళ్లు తయారుకాకుండా నివారిస్తాయి. రక్తపోటు కంట్రోల్ అవుతుంది. మంచినీళ్లను తాగడం వల్ల మరెన్నో ప్రయోజనాలు కలుగుతాయి.

What Happens If You Drink Too Much Water Overhydration Symptoms

అతిగా నీళ్లు తాగితే.. నీళ్లను నిల్వ ఉంచుకునే సామర్థ్యం కిడ్నీలకు ఉండదని గుర్తించాలి. అధికమైన నీరు రక్తంలో చేరుతుంది. ఫలితంగా రక్తంలోని సోడియం, ఎలక్ట్రోలైట్లు డెల్యూట్ అయిపోతాయి. దాంతో శరీరంలోని ద్రవాల స్థాయిని పెంచే ఆమ్ల క్షారాలు పలచబడి పోతాయి. కండరాలూ, నరాలూ బలంగా పనిచేయాలంటే సోడియం చాలా కీలకం.. కణాల్లో నీరు ఎంత శాతం కావాలో సోడియంనే డిసైడ్ చేస్తుంది. అలాంటి ప్రధానమైన సోడియం క్షీణిస్తే.. కణాల్లోకి నీరు చేరి ఉబ్బిపోతాయి. దాంతో రక్తపోటు పెరుగుతుంది.

హృదయ సంబంధిత సమస్యలు ఎక్కువ అవుతాయి. తలనొప్పి, తలతిరగడం, డయేరియాలాంటి సమస్యలూ రావచ్చు. మగతగా అనిపించవచ్చు.. ఒత్తిడి పెరుగుతుంది. అధిక మోతాదులో నీళ్లు తీసుకుంటే మెదడు కూడా దెబ్బతింటుంది. కొన్నిసార్లు కోమాలోకి వెళ్లే పరిస్థితి కూడా సంభవించవచ్చు. అవసరమైన నీటిని మాత్రమే తాగడం అలవాటు చేసుకోండి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు.

Read Also : Kidneys Health: కిడ్నీలను ఆరోగ్యంగా ఉండాలంటే 7 గోల్డెన్ రూల్స్

ట్రెండింగ్ వార్తలు